మీ YouTube ఛానెల్‌ను తొలగించండి లేదా దాచండి

మీ ఛానెల్‌లోని కంటెంట్‌ను తాత్కాలికంగా దాచడాన్ని లేదా మీ ఛానెల్‌ను శాశ్వతంగా తొలగించడాన్ని మీరు ఎంచుకోవచ్చు.

How to hide or delete your YouTube channel

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీ ఛానెల్‌ను తాత్కాలికంగా దాచండి 

మీ YouTube ఛానెల్‌లోని కంటెంట్‌ను మీరు దాచవచ్చు, అలాగే దాన్ని తర్వాత తిరిగి ఎనేబుల్ చేయడానికి ఎంచుకోవచ్చు. మీ ఛానెల్‌ను దాచిపెడితే, ఛానెల్ పేరు, వీడియోలు, లైక్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు, సబ్‌స్క్రయిబర్‌ల సమాచారం ప్రైవేట్‌గా ఉంచబడుతుంది.

మీ ఛానెల్‌ను లేదా మీ ఛానెల్ కంటెంట్‌ను దాచండి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ సైడ్‌బార్‌లో, సెట్టింగ్‌లు ను ఎంచుకోండి.
  3. ఛానెల్ ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. దిగువున, YouTube కంటెంట్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. గమనిక: ఈ లింక్ మీ ఛానెల్‌ను మీరు తొలగించగల లేదా దాచగల పేజీకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. మీ సైన్ ఇన్ వివరాలను ఎంటర్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు.
  5. నేను నా కంటెంట్‌ను దాచాలనుకుంటున్నానును ఎంచుకోండి.
  6. మీ ఛానెల్‌లో మీరు దాచాలనుకుంటున్న వాటిని నిర్ధారించడానికి బాక్స్‌లను ఎంచుకోండి.
  7. నా ఛానెల్‌ను దాచును ఎంచుకోండి.

మీ కంటెంట్‌ను మీరు ఇతరులకు కనిపించేలా చేయాలనుకున్నా, లేదా మీరు అప్‌లోడ్ చేయాలనుకున్నా, కామెంట్ చేయాలనుకున్నా, లేదా ప్లేలిస్ట్‌లను ఉపయోగించాలనుకున్నా, మీరు ఛానెల్‌ను తిరిగి ఎనేబుల్ చేయవచ్చు.

మీ ఛానెల్‌ను శాశ్వతంగా తొలగించండి

మీ YouTube ఛానెల్‌ను మూసివేస్తే, వీడియోలు, కామెంట్‌లు, మెసేజ్‌లు, ప్లేలిస్ట్‌లు, హిస్టరీతో సహా మీ కంటెంట్ శాశ్వతంగా తొలగించబడుతుంది. ప్రస్తుతం మీరు మొబైల్ పరికరాలలో ఛానెల్‌ను తొలగించలేరని గమనించండి.

మీరు మీ ఛానెల్‌ను శాశ్వతంగా తొలగించాలని ఎంచుకుంటే, మీ ఖాతాను రికవర్ చేయడం మాకు కష్టంగా ఉండవచ్చు.

మీ YouTube ఛానెల్‌ను తొలగించండి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ సైడ్‌బార్‌లో, సెట్టింగ్‌లు ను ఎంచుకోండి.
  3. ఛానెల్ ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. దిగువున, YouTube కంటెంట్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మిమ్మల్ని అడిగినట్లయితే,  మీ సైన్ ఇన్ వివరాలను ఎంటర్ చేయండి.
  5. నేను నా కంటెంట్‌ను శాశ్వతంగా తొలగించాలనుకుంటున్నాను అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. మీ ఛానెల్‌ను మీరు తొలగించాలనుకుంటున్నారని నిర్ధారించడానికి బాక్స్‌లను ఎంచుకోండి.
  7. నా కంటెంట్‌ను తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ ఛానెల్ శాశ్వతంగా తొలగించబడటానికి కొంత సమయం పట్టవచ్చు. కొంత సమయం వరకు, మీకు సైట్‌లో మీ వీడియోల థంబ్‌నెయిల్స్ కనిపించడం జరుగుతుంది.

గమనిక: ఈ దశలను అనుసరించడం వలన కేవలం మీ YouTube ఛానెల్ మాత్రమే తొలగించబడుతుంది, మీరు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించిన Google ఖాతా తొలగించబడదు. మీ మొత్తం Google ఖాతాను తొలగించడం ఎలాగో తెలుసుకోండి.

మీరు ఛానెల్‌ను తొలగించిన తర్వాత, ఛానెల్ URL, అలాగే ఛానెల్ పేరు, ఇకపై YouTube ఎనలిటిక్స్‌లో కనబడవు లేదా సెర్చ్ చేసినా దొరకవు. ఛానెల్‌తో అనుబంధించబడి ఉన్న వాచ్ టైమ్ వంటి డేటా, ఇప్పటికీ సమగ్ర రిపోర్ట్‌లలో భాగంగానే ఉంటుంది, కానీ అది తొలగించబడిన ఛానెల్‌కు ఆపాదించబడదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2538621293571896702
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false