YouTube ఛానెల్‌లను మేనేజ్ చేయండి

మీ YouTube ఛానెల్‌లో "బ్రాండ్ ఖాతా"కు సంబంధించిన కొత్త ప్రస్తావనలు మీకు కనిపించవచ్చు లేదా మీ ఖాతా మార్పు టూల్‌లో కొత్త ఖాతా కనిపించవచ్చు. తాజా YouTube అప్‌డేట్‌లో భాగంగా మీ ఛానెల్ బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ అయిన కారణంగా మీకు ఇవి కనిపిస్తున్నాయి. బ్రాండ్ ఖాతాలకు తరలించబడిన ఛానెల్స్ గురించి మరింత తెలుసుకోండి.

మీ YouTube ఛానెల్‌లను కేవలం మీరు మాత్రమే లేదా పలువురు వ్యక్తులు మేనేజ్ చేయగలిగేలా మీరు సెటప్ చేయవచ్చు. YouTube ఛానెల్ కోసం, మీరు కింద ఉన్న ఆప్షన్‌లలో ఒక దాన్ని ఎంచుకోవచ్చు:

  • దాన్ని మీ వ్యక్తిగత Google ఖాతాకు కనెక్ట్ చేయండి: ఈ ఛానెల్ మీ Google ఖాతా పేరును, ఫోటోను ఉపయోగిస్తుంది.
  • దీన్ని బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేయండి: మీ Google ఖాతాలో మీరు ఉపయోగించే పేరు కాకుండా ఈ YouTube ఛానెల్ వేరే పేరును ఉపయోగించవచ్చు.

మీ ఛానెల్‌ను బ్రాండ్ ఖాతాకు లేదా మీ వ్యక్తిగత Google ఖాతాకు లింక్ చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. లింక్ చేయడం అనేది మీ ఛానెల్ గుర్తింపును వాలిడేట్ చేయడంలో సహాయపడుతుంది.

మీ Google ఖాతాను ఉపయోగించండి

Google ఖాతా అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాబట్టి, కనెక్ట్ చేసిన ఏదైనా YouTube ఛానెల్‌లో సహా, Google సర్వీస్‌లు అంతటా ఇది ఒకే పేరు, గుర్తింపును ఉపయోగిస్తుంది.

మీ YouTube ఛానెల్‌కు Google ఖాతాను కనెక్ట్ చేయండి

మీ YouTube ఛానెల్‌ను మీ Google ఖాతాకు కనెక్ట్ చేసినట్లయితే:

  • ఛానెల్‌ను ఎవరు మేనేజ్ చేయగలరు: మీరు మాత్రమే ఈ YouTube ఛానెల్‌ను యాక్సెస్ చేయగలరు, అందుకు మీరు మీ Google ఖాతాను ఉపయోగించాల్సి ఉంటుంది.
  • ఏ పేరు, ఫోటో కనిపిస్తాయి: మీ Google ఖాతా (అలాగే Gmail లేదా Google Docs వంటి మిగతా Google సర్వీస్‌లు) ఉపయోగించే పేరు, ఫోటోనే ఈ YouTube ఛానెల్ కూడా ఉపయోగిస్తుంది.

బ్రాండ్ ఖాతాను ఉపయోగించండి

బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేసిన YouTube ఛానెల్‌ను పలు ఖాతాలతో షేర్ చేయవచ్చు.

మీ YouTube ఛానెల్‌ను బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేసినట్లయితే:

  • ఛానెల్‌ను ఎవరు మేనేజ్ చేయగలరు, అలాగే దానికి ఎవరు ఓనర్‌గా ఉండగలరు: బ్రాండ్ ఖాతాను పలు Google ఖాతాలు మేనేజ్ చేయవచ్చు అలాగే దానికి ఓనర్‌గా ఉండవచ్చు. ఆ మేనేజర్‌లు, ఓనర్‌లలో ఎవరైనా కూడా, బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేసిన YouTube ఛానెల్‌ను యాక్సెస్ చేయగలరు. ఛానెల్‌కు మీరు ఇతర ఓనర్‌లను జోడించినట్లయితే, ఛానెల్‌ను తొలగించడం, ఇతర ఓనర్‌లను తీసివేయడం వంటి వాటితో సహా ఛానెల్‌కు సంబంధించి వారు అన్ని చర్యలను తీసుకోగలరు.
  • ఏ పేరు, ఫోటో కనిపిస్తాయి: మీ Google ఖాతా అలాగే ఏదైనా మేనేజర్ Google ఖాతాకు భిన్నంగా YouTube ఛానెల్ వేరే పేరును, ఫోటోను కలిగి ఉండవచ్చు.

మీ Google ఖాతా ద్వారా మేనేజ్ చేసే బ్రాండ్ ఖాతాలను ఉపయోగించండి

YouTube ఛానెల్‌లకు కనెక్ట్ చేసిన పలు బ్రాండ్ ఖాతాలను మేనేజ్ చేయడానికి మీరు ఒకే Google ఖాతాను ఉపయోగించవచ్చు.

మీ Google ఖాతా ద్వారా మాత్రమే మేనేజ్ అవుతున్న బ్రాండ్ ఖాతాకు మీరు మీ YouTube ఛానెల్‌ను కనెక్ట్ చేసినట్లయితే:

  • ఛానెల్‌ను ఎవరు మేనేజ్ చేయగలరు: బ్రాండ్ ఖాతాలకు కనెక్ట్ చేసిన పలు YouTube ఛానెల్‌లను మీరు కలిగి ఉంటే, మీరు సైన్ అవుట్ చేయకుండా వాటన్నింటినీ ఒకే Google ఖాతా ద్వారా మేనేజ్ చేయవచ్చు. మీరు మేనేజ్ చేసే ఛానెల్‌ల మధ్య స్విచ్ అవ్వడం ఎలాగో తెలుసుకోండి.
  • ఏ పేరు, ఫోటో కనిపిస్తాయి: మీ Google ఖాతా అలాగే అది మేనేజ్ చేసే ఏదైనా బ్రాండ్ ఖాతాలకు భిన్నంగా ఈ YouTube ఛానెల్ వేరే పేరును, ఫోటోను కలిగి ఉండవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11719402494683663756
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false