YouTube హక్కుల మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకోండి

ఈ ఫీచర్‌లు, YouTube కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించి, కాపీరైట్ చేసిన వారి కంటెంట్‌ను మేనేజ్ చేస్తున్న పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మీ మేధోసంపత్తిని మేనేజ్ చేయడానికి YouTube సిస్టమ్ మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది:

  • YouTube హక్కుల మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది మీ మేధోసంపత్తి ఓనర్‌లను, అడ్మినిస్ట్రేటర్‌లను గుర్తిస్తుంది, అలాగే మీ హక్కులను అమలు చేయడానికి ఉపయోగించే పాలసీలను నిర్వచిస్తుంది

  • కంటెంట్ ID అనేది మీ మేధోసంపత్తికి మ్యాచ్ అయ్యే కంటెంట్ కోసం YouTube వీడియోలను ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి, మ్యాచ్ అయ్యే వీడియోకు నిర్వచించిన హక్కుల పాలసీని వర్తింపజేస్తుంది

  • YouTube వీడియోలు (ఆప్షనల్) అనేవి పబ్లిక్‌లో మీ మేధోసంపత్తికి ప్రాతినిధ్యం వహిస్తాయి, అలాగే అవి youtube.com లో యూజర్‌లకు అందుబాటులో ఉంటాయి

మీరు మేధోసంపత్తిలో కొంత భాగాన్ని YouTubeకు అప్‌లోడ్ చేసినప్పుడు, మీరు ఈ ప్రతి భాగంలో ప్రత్యేకంగా దానికి సంబంధించిన ప్రాతినిధ్యాన్ని క్రియేట్ చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, YouTube సిస్టమ్‌లో మేధోసంపత్తికి చెందిన ఒకే భాగం మూడు వరకు ప్రాతినిధ్యాలను కలిగి ఉంటుంది:

  • అస్సెట్ అనేది హక్కుల మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో మీ మేధోసంపత్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అస్సెట్‌లో భాగంగా మీరు యాజమాన్య హక్కు, అలాగే హక్కుల సమాచారాన్ని పేర్కొంటారు.

  • రెఫరెన్స్ అనేది కంటెంట్ ID మ్యాచింగ్ కోసం మీ మేధోసంపత్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మీరు అప్‌లోడ్ చేసిన వీడియో కంటెంట్‌తో, కంటెంట్ ID సరిపోల్చే డిజిటల్ మీడియా ఫైల్‌ను అందిస్తారు.

  • వీడియో అనేది, youtube.com లో మీ మేధోసంపత్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీడియోకు సంబంధించిన మెటాడేటా కంటెంట్‌ను వివరిస్తుంది, అలాగే youtube.com లో అది ఎలా కనిపిస్తుందో తెలుపుతుంది. వీడియో అదే మీడియా ఫైల్‌ను రెఫరెన్స్‌గా ఉపయోగిస్తుంది.

అస్సెట్ అనేది సిస్టమ్‌కు సంబంధించిన ప్రధాన భాగం, అది ఇతర ఆబ్జెక్ట్‌లతో అనుబంధించబడి ఉంటుంది. మేధోసంపత్తికి సంబంధించిన ప్రతి భాగానికి మీరు తప్పనిసరిగా ఒక అస్సెట్‌ను క్రియేట్ చేయాలి; రెఫరెన్స్‌లు, వీడియోలు అనేవి ఆప్షనల్.

ఒక అస్సెట్ దానికి అనుబంధించబడిన ఒకటి కంటే ఎక్కువ రెఫరెన్స్‌లను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక సినిమా అస్సెట్ అనేది 16:9, 4:3 ఆకార నిష్పత్తులతో వేర్వేరు రెఫరెన్స్‌లను కలిగి ఉండవచ్చు.

అస్సెట్ తరపున వీడియోను క్లెయిమ్ చేయడం ద్వారా మీరు అస్సెట్‌లకు వీడియోలను లింక్ చేయవచ్చు. మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలను మీరు క్లెయిమ్ చేయవచ్చు, అలాగే మీ అస్సెట్‌కు మ్యాచ్ అయ్యే కంటెంట్‌ను చేర్చినప్పుడు ఇతర యూజర్‌ల వీడియోలను కూడా క్లెయిమ్ చేయవచ్చు.

మీరు కింద పేర్కొన్నటువంటి ఇతర సహాయక సమాచారాన్ని కూడా క్రియేట్ చేయవచ్చు:

  • యాజమాన్య హక్కు అనేది అస్సెట్ యాజమాన్యంలో ఉన్న శాతం, అస్సెట్ యాజమాన్యంలో ఉన్న ప్రాంతాలు వంటి అస్సెట్ లేదా అస్సెట్‌ల గ్రూప్‌నకు చెందిన ఓనర్(ల) సమాచారాన్ని అందిస్తుంది. మీ అస్సెట్‌లకు సంబంధించి ఎవరు హక్కులను కలిగి ఉన్నారో ప్రకటించడానికి మీరు యాజమాన్య హక్కును ఉపయోగించవచ్చు.

  • హక్కుల పాలసీ అనేది క్లెయిమ్ చేసిన వీడియోలను మానిటైజ్ చేయడం కోసం షరతులు, నియమాలను నిర్వచిస్తుంది. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్‌లో వీక్షకులకు అడ్వర్టయిజ్‌మెంట్‌లను ప్రదర్శించే పాలసీని మీరు నిర్వచించవచ్చు, కానీ ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో వీక్షకులను ట్రాక్ మాత్రమే చేయవచ్చు. మీరు పాలసీలను అస్సెట్‌లతో అనుబంధించవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6003301092985309850
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false