ఆడియో లైబ్రరీ నుండి మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లను ఉపయోగించండి

YouTube Studioలోని ఆడియో లైబ్రరీలో, మీ వీడియోలలో ఉపయోగించడానికి మీకు రాయల్టీ-రహిత ప్రొడక్షన్ మ్యూజిక్, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. 

ఆడియో లైబ్రరీని తెరవండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, ఆడియో లైబ్రరీని ఎంచుకోండి.

మీరు నేరుగా youtube.com/audiolibrary లింక్‌లో కూడా ఆడియో లైబ్రరీని యాక్సెస్ చేయవచ్చు.

ఆడియో లైబ్రరీలో సెర్చ్ చేయండి

మ్యూజిక్‌ను కనుగొనండి

ఉచిత మ్యూజిక్ ట్యాబ్‌లో, మీ వీడియోల కోసం ట్రాక్‌లను కనుగొనడానికి ఫిల్టర్‌ల ను అలాగే సెర్చ్ బార్‌ను ఉపయోగించండి. 

నిర్దిష్ట ట్రాక్‌ను కనుగొనడానికి, సెర్చ్ బార్‌లో ట్రాక్ టైటిల్, ఆర్టిస్ట్ లేదా కీవర్డ్‌ను ఎంటర్ చేయండి. ట్రాక్ టైటిల్, సంగీత శైలి, మూడ్, ఆర్టిస్ట్ పేరు, సౌజన్యం, అలాగే వ్యవధి (నిడివి సెకన్లలో) ద్వారా మ్యూజిక్‌ను కనుగొనడానికి మీరు ఫిల్టర్‌లను కూడా ఉపయోగించవచ్చు. 

నిర్దిష్ట ట్రాక్‌ల ఆర్టిస్ట్, సంగీత శైలి లేదా మూడ్ పక్కన ఉన్న ఫిల్టర్ ను క్లిక్ చేయడం ద్వారా మీ సెర్చ్ ఫలితాలను మెరుగుపరచండి. మీ సెర్చ్ ఫలితాలను మీరు ట్రాక్ టైటిల్, ఆర్టిస్ట్ పేరు, వ్యవధి లేదా తేదీ ద్వారా వాటి నిలువు వరుస పేర్లను క్లిక్ చేయడం ద్వారా క్రమపద్ధతిలో అమర్చవచ్చు.

ట్రాక్ టైటిల్ పక్కన ఉన్న స్టార్ చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇష్టమైన ట్రాక్‌లను సేవ్ చేయండి. మీకు ఇష్టమైన ట్రాక్‌ల లిస్ట్‌ను చూడటానికి, స్టార్ ఉన్న ట్యాబ్‌ను క్లిక్ చేయండి.

కొత్త రిలీజ్‌లు నెలకు రెండు సార్లు ఆడియో లైబ్రరీకి జోడించబడతాయి.

సౌండ్ ఎఫెక్ట్‌లను కనుగొనండి

సౌండ్ ఎఫెక్ట్‌ల ట్యాబ్‌లో, మీ వీడియోల కోసం సౌండ్ ఎఫెక్ట్‌లను కనుగొనడానికి ఫిల్టర్‌ల ను అలాగే సెర్చ్ బార్‌ను ఉపయోగించండి. 

నిర్దిష్ట సౌండ్ ఎఫెక్ట్‌ను కనుగొనడానికి, సెర్చ్ బార్‌లో ట్రాక్ టైటిల్ లేదా కీవర్డ్‌ను ఎంటర్ చేయండి. మీరు కేటగిరీ, వ్యవధి (నిడివి సెకన్లలో) ద్వారా సౌండ్ ఎఫెక్ట్‌లను కూడా ఫిల్టర్ చేయవచ్చు. 

ఆడియోను ప్లే చేయండి, డౌన్‌లోడ్ చేయండి

ట్రాక్‌ను శాంపిల్ చేయడానికి, 'ప్లే' ను క్లిక్ చేయండి. మీరు విన్నది మీకు నచ్చినట్లయితే, MP3 ఫైల్‌ను పొందడానికి తేదీపై మౌస్ కర్సర్‌ను ఉంచి, డౌన్‌లోడ్‌ను క్లిక్ చేయండి.

మీరు ఆడియో లైబ్రరీని బ్రౌజ్ చేస్తున్నప్పుడు ట్రాక్ ప్లే అవ్వడం కొనసాగుతుంది. ఆడియో ప్లేయర్‌లోని కంట్రోల్స్‌ను ఉపయోగించి, మీరు మునుపటి లేదా తర్వాత ట్రాక్‌ను పాజ్ చేయవచ్చు, దాటవేయవచ్చు, ప్లే చేయవచ్చు.

అట్రిబ్యూషన్‌ను అందించండి

మీరు క్రియేటివ్ కామన్స్  లైసెన్స్ ఉన్న ట్రాక్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ వీడియో వివరణలో మీరు తప్పనిసరిగా ఆర్టిస్ట్‌కు క్రెడిట్ ఇవ్వాలి. అట్రిబ్యూషన్ సమాచారాన్ని జెనరేట్ చేయడానికి, మీరు ఈ కింద పేర్కొన్న విధంగా చేయవచ్చు:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి. 
  2. ఎడమ వైపు మెనూలో, ఆడియో లైబ్రరీని ఎంచుకోండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ట్రాక్ కోసం వెతకండి.
    • గమనిక: క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉండే మ్యూజిక్ కంటెంట్ అంతటినీ బ్రౌజ్ చేయడానికి, 'ఫిల్టర్ బార్ > అట్రిబ్యూషన్ తప్పనిసరి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లైసెన్స్ రకం నిలువు వరుసలో, క్రియేటివ్ కామన్స్ చిహ్నం ను క్లిక్ చేయండి. 
  5. పాప్-అప్ విండోలో, అట్రిబ్యూషన్ టెక్స్ట్‌ను కాపీ చేయడానికి, కాపీ చేయండి ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ సమాచారాన్ని మీ వీడియో వివరణలో పేస్ట్ చేయవచ్చు.

అట్రిబ్యూషన్ అవసరం లేని స్టాండర్డ్ YouTube ఆడియో లైబ్రరీ లైసెన్స్ ఉన్న మ్యూజిక్ కోసం మీరు వెతకాలనుకుంటే, ఫిల్టర్ బార్  > అట్రిబ్యూషన్ అవసరం లేనివిని క్లిక్ చేయండి.

గమనిక: మీ వీడియో, YouTube ఆడియో లైబ్రరీలోని మ్యూజిక్‌ను ఉపయోగిస్తే, మీ వీడియో వీక్షణ పేజీలో "ఈ వీడియోలోని మ్యూజిక్" అనే విభాగం ప్రదర్శించబడుతుంది. మీ వీడియో క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్న మ్యూజిక్‌ను ఉపయోగించినప్పుడు కూడా మీ వీడియో వివరణలో అట్రిబ్యూషన్ సమాచారాన్ని పేర్కొనాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

మీ వీడియోను మానిటైజ్ చేయండి

మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్నట్లయితే, ఆడియో లైబ్రరీ నుండి తీసుకోబడిన మ్యూజిక్, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్‌తో మీరు వీడియోలను మానిటైజ్ చేయవచ్చు.

ఆడియో లైబ్రరీ నుండి డౌన్‌లోడ్ చేయబడిన కాపీరైట్ హక్కుదారు అనుమతి అవసరం లేని మ్యూజిక్, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్‌ను హక్కుదారు, కంటెంట్ ID సిస్టమ్ ద్వారా క్లెయిమ్ చేయలేరు.

వీటిని గుర్తుంచుకోండి:

  • ఆడియో లైబ్రరీలో ఉండే మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లు మాత్రమే YouTubeకు కాపీరైట్ హక్కుదారు అనుమతి అవసరం లేనివి.
  • YouTube ఛానెల్స్ లేదా ఇతర మ్యూజిక్ లైబ్రరీల నుండి "రాయల్టీ-రహిత" మ్యూజిక్, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఎదురయ్యే సమస్యలకు YouTube బాధ్యత వహించదు.
  • ప్లాట్‌ఫామ్ వెలుపల మ్యూజిక్‌తో సంభవించగలిగే సమస్యలపై గైడెన్స్‌తో సహా, YouTube చట్టపరమైన గైడెన్స్ చేయదు.
  • మీ మ్యూజిక్ వినియోగం గురించి మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే, మీరు అర్హత గల లాయర్‌ను సంప్రదించవచ్చు.

 మీరు ఎలాంటి కంటెంట్‌ను మానిటైజ్ చేయవచ్చు అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2528935177647639827
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false