వీడియోల నుండి క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌ను తీసివేయండి

మీ వీడియోపై కంటెంట్ ID క్లెయిమ్ ఉన్నట్లయితే, వీడియోను ఎక్కడ చూడవచ్చు లేదా దాన్ని మానిటైజ్ చేయవచ్చా లేదా అనే దానిపై పరిమితులు ఉండవచ్చు. క్లెయిమ్‌ను, అలాగే అనుబంధిత పరిమితులను తీసివేయడానికి, మీరు కొత్త వీడియోను అప్‌లోడ్ చేయకుండానే క్లెయిమ్ చేసిన కంటెంట్‌ను ఎడిట్ చేసి తీసివేయవచ్చు.

ఈ కింద ఉన్న ఆప్షన్‌లలో దేన్ని అయినా విజయవంతంగా పూర్తి చేస్తే, కంటెంట్ ID క్లెయిమ్ ఆటోమేటిక్‌గా క్లియర్ చేయబడుతుంది:

  • విభాగాన్ని ట్రిమ్ చేయండి: మీ వీడియో నుండి మీరు, క్లెయిమ్ చేసిన విభాగాన్ని మాత్రమే ఎడిట్ చేసి తీసివేయగలరు.
  • పాటను రీప్లేస్ చేయండి: మీ వీడియోలోని ఆడియో క్లెయిమ్ చేయబడితే, ఆ క్లెయిమ్ చేయబడిన ఆడియోను, YouTube ఆడియో లైబ్రరీలోని ఇతర ఆడియోతో రీప్లేస్ చేయగలిగే అవకాశం మీకు ఉంటుంది.
  • పాటను మ్యూట్ చేయండి: మీ వీడియోలోని ఆడియో క్లెయిమ్ చేయబడితే, ఆ క్లెయిమ్ చేయబడిన ఆడియోను మ్యూట్ చేయగలిగే అవకాశం మీకు ఉంటుంది. కేవలం పాటను మాత్రమే మ్యూట్ చేయాలా, లేదా వీడియోలోని మొత్తం ఆడియోను మ్యూట్ చేయాలా అనేది మీరు ఎంచుకోవచ్చు.

YouTube Studioలో క్లెయిమ్ చేసిన కంటెంట్‌ను ట్రిమ్ చేయండి, రీప్లేస్ చేయండి, లేదా మ్యూట్ చేయండి

వీడియో నుండి క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌ను తీసివేయడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ ను ఎంచుకోండి.
  3. ఫిల్టర్ బార్ ఆ తర్వాత కాపీరైట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీకు ఆసక్తి ఉన్న వీడియోను కనుగొనండి.
  5. పరిమితుల నిలువు వరుసలో, కాపీరైట్‌ పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  6. వివరాలను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. ఈ వీడియోలో గుర్తించబడిన కంటెంట్ విభాగం కింద, సంబంధిత క్లేయిమ్‌ను కనుగొని, చర్యలను ఎంచుకోండి ఆ తర్వాత విభాగాన్ని ట్రిమ్ చేయండి, పాటను రీప్లేస్ చేయండి, లేదా పాటను మ్యూట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

 విభాగాన్ని ట్రిమ్ చేయండి

మీ వీడియోలోని ఏ విభాగంలో అయితే కంటెంట్ ID క్లెయిమ్‌ను అందుకున్నారో, దానిని ఎడిట్ చేసి తీసివేసే వీలును మీకు ఈ ఆప్షన్ కల్పిస్తుంది.
  1. (ఆప్షనల్) మీరు తీసివేస్తున్న విభాగం తాలూకు ప్రారంభ సమయాన్ని, అలాగే ముగింపు సమయాన్ని ఎడిట్ చేయండి.
    • మీ వీడియోలో క్లెయిమ్ చేయబడిన కంటెంట్ కొంత ఉన్నా కూడా, క్లెయిమ్ తీసివేయబడదని గుర్తుంచుకోండి.
  2. కొనసాగించండి ఆ తర్వాత ట్రిమ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
క్లెయిమ్ చేయబడిన కంటెంట్ మొత్తాన్ని ట్రిమ్ చేసిన తర్వాత, మీ వీడియో నుండి కంటెంట్ ID క్లెయిమ్ తీసివేయబడుతుంది.

 పాటను రీప్లేస్ చేయండి (ఆడియో క్లెయిమ్‌ల విషయంలో మాత్రమే)

క్లెయిమ్ చేయబడిన ఆడియోను YouTube ఆడియో లైబ్రరీలోని ఇతర ఆడియోతో రీప్లేస్ చేసే వీలు ఈ ఆప్షన్ మీకు అందిస్తుంది.
  1.  కొత్త ఆడియో ట్రాక్‌ను కనుగొనడానికి సెర్చ్ ఫిల్టర్‌ల ను ఉపయోగించండి. ట్రాక్‌లను ప్రివ్యూ చేయడానికి ప్లే చేయండి ని క్లిక్ చేయండి.
  2. మీకు నచ్చిన పాటను మీరు కనుగొన్నప్పుడు, జోడించండిని క్లిక్ చేయండి. ఎడిటర్‌లో నీలం రంగు బాక్స్‌లో పాట కనిపిస్తుంది.
    • పాట ఎప్పుడు ప్రారంభం కావాలనేది మార్చడానికి బాక్స్‌ను క్లిక్ చేసి, లాగండి. మీ వీడియోలో క్లెయిమ్ చేయబడిన ఆడియో కొంత ఉన్నా కూడా, క్లెయిమ్ తీసివేయబడదని గుర్తుంచుకోండి.
    • పాట ప్లేబ్యాక్ నిడివిని సర్దుబాటు చేయడానికి బాక్స్ అంచులను లాగండి.
    • మరింత ఖచ్చితమైన ఎడిట్‌ల కోసం జూమ్ ఆప్షన్‌ల Zoom inను ఉపయోగించండి.
  3. (ఆప్షనల్) మరిన్ని ట్రాక్‌లను జోడించండి.
  4. సేవ్ చేయండి ఆ తర్వాత రీప్లేస్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

క్లెయిమ్ చేయబడిన ఆడియో మొత్తాన్ని పూర్తిగా రీప్లేస్ చేసిన తర్వాత, మీ వీడియో నుండి కంటెంట్ ID క్లెయిమ్ తీసివేయబడుతుంది.

 పాటను మ్యూట్ చేయండి (ఆడియో క్లెయిమ్‌ల విషయంలో మాత్రమే)

మీ వీడియోలోని క్లెయిమ్ చేయబడిన ఆడియోను మ్యూట్ చేసే వీలు ఈ ఆప్షన్ మీకు కల్పిస్తుంది. కేవలం పాటను మాత్రమే మ్యూట్ చేయాలా, లేదా వీడియోలోని మొత్తం ఆడియోను మ్యూట్ చేయాలా అనేది మీరు ఎంచుకోవచ్చు.
  1. మీరు ఎలా మ్యూట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి:
    • పాట ప్లే అవుతున్నప్పుడు మొత్తం సౌండ్‌ను మ్యూట్ చేయండి
      • ఈ ఆప్షన్ క్లెయిమ్ చేయబడిన ఆడియోతో ఉన్న వీడియో భాగంలోని మొత్తం ఆడియోను మ్యూట్ చేస్తుంది.
      • సాధారణంగా ఈ ఆప్షన్ వేగవంతంగా పని చేస్తుంది, అలాగే దీని ద్వారా క్లెయిమ్ ఆటోమేటిక్‌గా తీసివేయబడే అవకాశం ఎక్కువ ఉంటుంది.
    • పాటను మాత్రమే మ్యూట్ చేయండి (బీటా)
      • ఈ ఆప్షన్ కేవలం క్లెయిమ్ చేయబడిన పాటను మాత్రమే మ్యూట్ చేస్తుంది. డైలాగ్ లేదా సౌండ్ ఎఫెక్ట్‌ల వంటి ఇతర ఆడియో మ్యూట్ చేయబడదు.
      • ఈ ఎడిట్‌ను చేయడానికి సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది అలాగే పాటను తీసివేయడం కష్టమైతే పని చేయకపోవచ్చు.
  2. (ఆప్షనల్) ఆడియోలో మీరు మ్యూట్ చేయాలనుకుంటున్న భాగం తాలూకు ప్రారంభ సమయాన్ని, అలాగే ముగింపు సమయాన్ని ఎడిట్ చేయండి.
    • మీ వీడియోలో క్లెయిమ్ చేయబడిన ఆడియో కొంత ఉన్నా కూడా, క్లెయిమ్ తీసివేయబడదని గుర్తుంచుకోండి.
  3. వీడియో ప్లేయర్‌లో ఆ ఎడిట్‌ను ప్రివ్యూ చేయండి.
  4. కొనసాగించండి ఆ తర్వాత మ్యూట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఎడిట్ ప్రాసెస్ అవ్వడం మొదలవుతుంది.

క్లెయిమ్ చేయబడిన ఆడియోను అంతా మ్యూట్ చేయగలిగితే, మీ వీడియో నుండి కంటెంట్ ID క్లెయిమ్ తీసివేయబడుతుంది.

వీటిని గుర్తుంచుకోండి:
  • మీరు ఎడిట్ చేసిన తర్వాత, ప్రాసెసింగ్ సమయాలు మారవచ్చు.
  • వీడియో ప్రాసెసింగ్‌లో ఉన్నప్పుడు మీరు ఇతర ఎడిట్‌లను చేయలేరు, కానీ మీరు విండోను మూసివేయవచ్చు. ప్రాసెసింగ్ పూర్తి అయ్యే దాకా, వీడియో ప్రస్తుతం ఉన్న స్థితిలోనే (ఎడిట్‌లు చేయక ముందు ఉన్న స్థితిలో) ఉంటుంది.
  • మీ వీడియో నిడివి 6 గంటలకు మించి ఉన్నట్లయితే, మీరు మార్పులను సేవ్ చేయలేకపోవచ్చు.
  • మీ ఛానెల్ YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో లేనట్లయితే, మీ వీడియోకు 1,00,000 వీక్షణలకు పైగా వచ్చి ఉంటే, మీరు మార్పులను సేవ్ చేయలేకపోవచ్చు.
చిట్కా: ప్రాసెసింగ్ పూర్తయినప్పుడు, ఎడిట్‌లు పూర్తయ్యాయని, అలాగే క్లెయిమ్ లేదు అని నిర్ధారించడానికి పేజీని రీలోడ్ చేయండి.

YouTube Studio యాప్‌లోని క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌ను మ్యూట్ చేయండి

వీడియోలో క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌ను మ్యూట్ చేయడానికి:

  1. YouTube Studio యాప్‌నకు సైన్ ఇన్ చేయండి.
  2. కంటెంట్ ను ట్యాప్ చేయండి.
  3. కాపీరైట్ పరిమితి ఉన్న వీడియోను ఎంచుకుని, పరిమితిపై ట్యాప్ చేయండి.
  4. దిగువున ఉన్న ప్యానెల్‌లో, సమస్యలను రివ్యూ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. సంబంధిత క్లెయిమ్‌ను ట్యాప్ చేయండి.
  6. విభాగాన్ని మ్యూట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఎడిట్‌ల చర్యను రద్దు చేయండి

మీ వీడియోకు మీరు చేసిన ఎడిట్‌లను రద్దు చేసి, దాన్ని తిరిగి ఒరిజినల్ వీడియోగా మార్చడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియో థంబ్‌నెయిల్‌ను క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు మెనూలో, ఎడిటర్ ను క్లిక్ చేయండి.
  5. మీ వీడియోకు మీరు ఏవైనా ఎడిట్‌లు చేసి ఉంటే, వాటిని తీసివేయడానికి, ఆప్షన్‌లు మరిన్నిఆ తర్వాత ఒరిజినల్ స్థితికి మార్చండిని  ఎంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13568125322419043241
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false