కాపీరైట్ స్ట్రయిక్‌ల గురించి పరిచయం

ఈ కంటెంట్ కాపీరైట్ స్ట్రయిక్‌లకు సంబంధించినది. మీరు కాపీరైట్ స్ట్రయిక్‌లకు భిన్నంగా ఉండే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లకు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నట్లయితే, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ల గురించి పరిచయానికి వెళ్లండి.

మీకు కాపీరైట్ స్ట్రయిక్ అందింది అంటే, ఒక కాపీరైట్ ఓనర్, కాపీరైట్ రక్షణ ఉన్న వారి కంటెంట్‌ను ఉపయోగించినందుకు, ఒక చట్టపరమైన కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్‌ను సమర్పించారని అర్థం. కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్‌ను మాకు సమర్పించినప్పుడు, మేము దాన్ని రివ్యూ చేస్తాము. తీసివేత రిక్వెస్ట్ చెల్లుబాటు అయితే, కాపీరైట్ చట్టానికి అనుగుణంగా ఉండటానికి, YouTube నుండి మీ వీడియోను మేము తీసివేయాల్సి ఉంటుంది.

ఒక వీడియో ఒకసారికి ఒక కాపీరైట్ స్ట్రయిక్‌ను మాత్రమే కలిగి ఉండాలి. కాపీరైట్ వల్లనే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా వీడియోలను సైట్ నుండి తీసివేయవచ్చని గుర్తుంచుకోండి. అంతే కాకుండా, కంటెంట్ ID క్లెయిమ్‌ల వల్ల స్ట్రయిక్ రాదు.

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మీకు కాపీరైట్ స్ట్రయిక్ అందినప్పుడు ఏం జరుగుతుంది

అందరం తప్పులు చేస్తాం. మొదటిసారి కాపీరైట్ స్ట్రయిక్‌ను అందుకున్నప్పుడు, మీరు కాపీరైట్ పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కాపీరైట్ నియమాలను అర్థం చేసుకోవడంలో, అవి YouTubeలో ఎలా అమలు అవుతాయో తెలుసుకోవడంలో క్రియేటర్‌లకు కాపీరైట్ పాఠశాల సహాయపడుతుంది. కాపీరైట్ పాఠశాలలో నాలుగు చిన్న మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మా కాపీరైట్ పాలసీల గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి.

చిట్కా: మా కాపీరైట్ పాలసీల గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి.

కాపీరైట్ కారణంగా మీ యాక్టివ్ లైవ్ స్ట్రీమ్ తీసివేయబడితే, లైవ్ స్ట్రీమింగ్‌కు మీకు ఉండే యాక్సెస్ 7 రోజుల పాటు పరిమితం చేయబడుతుంది.

మీకు 3 కాపీరైట్ స్ట్రయిక్‌లను అందినట్లయితే:

  • మీ ఖాతాతో పాటు, ఏవైనా అనుబంధ ఛానెల్స్ ఉంటే అవి కూడా తొలగించబడే అవకాశం ఉంది.
  • మీ ఖాతాకు అప్‌లోడ్ చేయబడిన అన్ని వీడియోలు తీసివేయబడతాయి.
  • మీరు కొత్త ఛానెల్స్‌ను క్రియేట్ చేయలేరు.
కర్టసీ వ్యవధి
మీ ఛానెల్ YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగమైతే, మీరు 7 రోజుల కర్టసీ వ్యవధికి అర్హులు. 3 కాపీరైట్ స్ట్రయిక్‌ల తర్వాత, మీ ఛానెల్ డిజేబుల్ చేయబడటానికి ముందు చర్య తీసుకోవడానికి మీకు అదనంగా 7 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో, మీ కాపీరైట్ స్ట్రయిక్‌ల గడువు ముగియదు, అలాగే మీరు కొత్త వీడియోలను అప్‌లోడ్ చేయలేరు. మీ ఛానెల్ లైవ్‌లో అందుబాటులో ఉంటుంది, అలాగే మీ స్ట్రయిక్‌లకు సంబంధించిన పరిష్కారాన్ని కోరడానికి మీరు దాన్ని యాక్సెస్ చేయవచ్చు.

మీ స్ట్రయిక్ సంఖ్యను 3కు తీసుకువచ్చే ప్రతివాద నోటిఫికేషన్‌లను మీరు సమర్పించినట్లయితే, ప్రతివాద నోటిఫికేషన్‌లు పరిష్కరించబడనప్పుడు మీ ఛానెల్ డిజేబుల్ చేయబడదు. ఈ ప్రతివాద నోటిఫికేషన్‌లు కాపీరైట్ హక్కు దావాదారునికి ఫార్వర్డ్ చేయబడితే, అప్‌లోడ్ చేయగల మీ సామర్థ్యం రీస్టోర్ చేయబడుతుంది. ప్రతివాద నోటిఫికేషన్ మీకు అనుకూలంగా పరిష్కరించబడినా లేదా తీసివేత ఉపసంహరించబడినా మీ ఛానెల్ ప్రభావితం కాదు.
మీ స్ట్రయిక్ గురించిన సమాచారాన్ని ఎలా పొందాలి
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ ను క్లిక్ చేయండి.
  3. ఫిల్టర్ బార్ ఆ తర్వాత కాపీరైట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పరిమితుల నిలువు వరుసలో, కాపీరైట్‌ పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  5. వివరాలను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
కాపీరైట్ స్ట్రయిక్‌ను పరిష్కరించండి

కాపీరైట్ స్ట్రయిక్‌ను పరిష్కరించడానికి మూడు మార్గాలు ఉన్నాయి:

  1. దాని గడువు ముగిసే వరకు వేచి ఉండండి: కాపీరైట్ స్ట్రయిక్‌ల గడువు 90 రోజుల తర్వాత ముగుస్తుంది. ఇది మీ మొదటి స్ట్రయిక్ అయితే, మీరు కాపీరైట్ పాఠశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  2. ఉపసంహరణను పొందండి: మీరు మీ వీడియోను క్లెయిమ్ చేసిన వ్యక్తిని సంప్రదించి, వారిని తమ కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన వారి క్లెయిమ్‌ను ఉపసంహరించమని అడగవచ్చు.
  3. ప్రతివాద నోటిఫికేషన్‌ను సమర్పించండి: మీ వీడియో పొరపాటున తీసివేయబడినట్లు లేదా న్యాయమైన వినియోగం కోసం అర్హత ఉన్న వీడియో అని మీరు భావిస్తే, మీరు ప్రతివాద నోటిఫికేషన్‌ను సమర్పించవచ్చు.
ఫిషింగ్ ప్రయత్నాల నుండి మీ ఖాతాను రక్షించుకోండి. మేము YouTube కాపీరైట్ స్ట్రయిక్ నోటిఫికేషన్‌లను no-reply@youtube.com నుండి మాత్రమే పంపుతాము. మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడం, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మరింత తెలుసుకోవడానికి చూడండి

కాపీరైట్ స్ట్రయిక్‌లకు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకోవడానికి YouTube Creators ఛానెల్ నుండి కింది వీడియోను చూడండి.

Copyright in YouTube Studio: Addressing Copyright Claims with New Tools, Filters and More

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14633499336060538886
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false