స్క్రీన్ రీడర్‌తో YouTubeను ఉపయోగించండి

ఈ పేజీలో ఉన్న చిట్కాలను ఉపయోగించి, కంప్యూటర్ స్క్రీన్ రీడర్ సహాయంతో ఉత్తమ YouTube అనుభవాన్ని పొందండి. మీరు YouTubeను ఉపయోగించేటప్పుడు, కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి.

YouTubeలో సెర్చ్ చేయండి, సెర్చ్ ఫలితాలు

YouTube వీడియోల కోసం సెర్చ్ చేయండి

  1. YouTubeకు వెళ్లండి.
  2. / కీబోర్డ్ కీని ఉపయోగించి, పేజీ ఎగువ భాగాన ఉన్న సెర్చ్ బాక్స్‌కు వెళ్లండి. 
  3. సెర్చ్ క్వెరీని ఎంటర్ చేసి, Enterను నొక్కండి.

సెర్చ్ ఫలితాలు

సెర్చ్ ఫలితాల పేజీలో, మీరు ఏవైనా పదాలను తప్పుగా టైప్ చేస్తే, వాటికి సంబంధించిన సరైన పదాలను సూచించే "మీ ఉద్దేశం ఇదేనా" అనే విభాగం ఒకటి ఉంటుంది. ప్రతి సెర్చ్ ఫలితంలో ఈ సమాచారం ఉంటుంది:

  • వీడియో టైటిల్  -- దీనిని ఎంచుకున్నప్పుడు వీడియో ప్లే అవుతుంది. 
  • వీడియోను పోస్ట్ చేసిన ఛానెల్ పేరు.
  • వీడియోను అప్‌లోడ్ చేసి ఎంత సమయం అయింది, అలాగే దానికి ఎన్ని వీక్షణలు వచ్చాయి.
  • వీడియో వివరణకు సంబంధించిన టెక్స్ట్ ప్రివ్యూ.

YouTube ప్లేయర్

వీడియోను క్లిక్ చేసినప్పుడు, మీరు YouTube వీడియో ప్లేయర్‌కు మళ్లించబడతారు. మీరు ప్లేయర్‌లో ఈ విభాగాలను ఉపయోగిస్తారు:

విభాగం హెడర్‌లు

వీడియో టైటిల్‌కు సంబంధించిన H1

ప్లేయర్‌లో

  • దాటవేసే స్లయిడర్: వీడియోను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి, లేదా రివైండ్ చేయడానికి దాటవేసే స్లయిడర్ ఉపయోగించబడుతుంది. దాటవేసే స్లయిడర్‌ను ఉపయోగించడానికి, ముందు వర్చువల్ కర్సర్‌ను ఆఫ్ చేసి, ఆ తర్వాత స్లయిడర్‌కు వెళ్లడానికి Tab కీని నొక్కండి. వీడియోను ఫాస్ట్ ఫార్వర్డ్/రివైండ్ చేయడానికి, ఎడమ వైపు బాణం/కుడి వైపు బాణాన్ని లేదా పై వైపు బాణం/కింది వైపు బాణాన్ని ఉపయోగించండి.
  • ప్లే చేయి/పాజ్ చేయి: వీడియో ఏ స్టేటస్‌లో ఉంది అనే దాన్ని బట్టి, ఈ బటన్ టెక్స్ట్ మారుతూ ఉంటుంది. వీడియోను రీప్లే చేయడానికి, వీడియో ప్లే అవ్వడం ఆగిపోయిన తర్వాత, ప్లే చేయిని ఎంచుకోండి లేదా K బటన్‌ను నొక్కండి.
  • తర్వాత: ఈ బటన్ సహాయంతో, మీరు తర్వాతి వీడియోకు స్కిప్ చేయవచ్చు. మీకు మీడియా బటన్‌లు లేకపోతే, మీరు Shift+Nను ఉపయోగించి కూడా తర్వాతి వీడియోకు స్కిప్ చేయవచ్చు. 
  • మ్యూట్ చేయి/అన్‌మ్యూట్ చేయి: వీడియో మ్యూట్ చేయబడిందా లేదా అన్‌మ్యూట్ చేయబడిందా అనే దాన్ని బట్టి, ఈ బటన్ మారుతూ ఉంటుంది.
  • వాల్యూమ్ స్లయిడర్: వాల్యూమ్‌ను పెంచడానికి/తగ్గించడానికి, ఎడమ వైపు బాణం/కుడి వైపు బాణాన్ని లేదా పై వైపు బాణం/కింది వైపు బాణాన్ని ఉపయోగించండి.
  • గడిచిన సమయం/మొత్తం వ్యవధి: ఈ విభాగం, వీడియోకు సంబంధించి గడిచిన సమయాన్ని, అలాగే మొత్తం వ్యవధిని చూపుతుంది. ఇప్పటి దాకా వీడియో ఎంత సమయం పాటు ప్లే అయింది, అలాగే ప్లే అవ్వడానికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది అనేది ఇది చూపుతుంది. 
  • CC (సబ్‌టైటిళ్లు): వీడియోలో సబ్‌టైటిళ్లు ఉంటే, వాటిని మీరు C షార్ట్‌కట్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. సబ్‌టైటిళ్లు, వీడియో దిగువున ప్రదర్శించబడతాయి. సబ్‌టైటిళ్లను ఆఫ్ చేయడానికి, మళ్లీ C షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

సెట్టింగ్‌లు 

ఈ సెట్టింగ్‌ల బటన్ ఒక మెనూను తెరుస్తుంది, ఈ మెనూ ద్వారా మీరు ఈ మార్పులను చేయగలరు:

  • అదనపు గమనికలు: అదనపు గమనికలను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  • ప్లేబ్యాక్ వేగం: వీడియో వేగం సాధారణంగా ఉండాలో, వేగవంతంగా ఉండాలో, లేదా నిదానంగా ఉండాలో ఎంచుకోండి.
  • సబ్‌టైటిళ్లు/CC: సబ్‌టైటిళ్లను ఆన్ లేదా ఆఫ్ చేయండి. మీరు ఇక్కడ సబ్‌టైటిళ్ల భాషను కూడా ఎంచుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ అనువాదాన్ని ఎంచుకోవచ్చు.
  • క్వాలిటీ: ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియోకు సంబంధించి పిక్సెల్ క్వాలిటీని ఎంచుకోండి. వీడియో ఏ విధంగా అప్‌లోడ్ చేయబడింది అనే దాన్ని బట్టి, అలాగే మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి, తగిన రిజల్యూషన్‌లు అందుబాటులో ఉంటాయి. మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి వీడియో క్వాలిటీ ఆటోమేటిక్‌గా సర్దుబాటు అయ్యేలా, ఈ ఆప్షన్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము.

థియేటర్ మోడ్

ప్లేయర్‌ను విస్తరింపజేయడానికి థియేటర్ మోడ్ ను ఎంచుకోండి. తిరిగి ఒరిజినల్ ప్లేయర్ సైజ్‌కు మార్చడానికి, దాన్ని మళ్లీ ఎంచుకోండి.

ఫుల్ స్క్రీన్

ఫుల్ స్క్రీన్ ను ఎంచుకుంటే, ప్లేయర్, మీ స్క్రీన్ సైజ్‌కు విస్తరింపబడుతుంది, అలాగే ప్లేయర్ వెలుపల ఉన్న ప్రతీది తీసివేయబడుతుంది. ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, Escapeను ఎంచుకోండి.

HTML పేజీలో ప్లేయర్ చుట్టూ ఏవైనా అదనపు ఎలిమెంట్‌లు ఉంటే, వాటిని తొలగించాలనుకున్నప్పుడు కూడా ఫుల్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. ఈ మోడ్ ఆన్‌లో ఉంటే, మీకు స్క్రీన్ మీద ప్లేయర్ మాత్రమే కనిపిస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4745085230381078714
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false