నా YouTube ఛానెల్, ఇంకా వీడియోలలో యాడ్‌లు కనిపించకుండా బ్లాక్ చేయడం

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో (MCNకు అనుబంధమైన వాటితో సహా) భాగం అయ్యుండి, తమ స్వంత కంటెంట్‌లో ప్రదర్శించబడే యాడ్‌లను మార్చాలనుకొనే క్రియేటర్‌ల కోసం ఈ ఆర్టికల్ రూపొందించబడింది.
 
మీరు వీక్షకులు అయితే, మీకు వీడియోలలో కనిపించే యాడ్స్ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చూడండి.

YouTube పార్ట్‌నర్‌గా, మీ YouTube వీడియోలకు, అలాగే ఛానెల్‌కు పక్కన కనిపించే యాడ్స్‌ను మీరు ఫిల్టర్ చేయవచ్చు.

సాధారణ లేదా ప్రత్యేక కేటగిరీలకు చెందిన యాడ్స్‌ను, లేదా నిర్దిష్ట అడ్వర్టయిజర్ డొమైన్‌లకు చెందిన యాడ్స్‌ను ఫిల్టర్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి:

  1. మీ YouTube కోసం AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున ఉన్న మెనూ ను క్లిక్ చేయండి .
  3. బ్లాకింగ్ కంట్రోల్స్ ఆ తర్వాత YouTube కోసం AdSense అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ​​నిర్దిష్ట అడ్వర్టయిజర్ URLలను బ్లాక్ చేయడానికి: పేజీకి ఎగువ భాగాన ఉన్న హారిజాంటల్ బార్‌లోనిఅడ్వర్టయిజర్ URLల ట్యాబ్‌ను క్లిక్ చేయండి. అక్కడ అందించబడే బాక్స్‌లో URLలను ఎంటర్ చేసి, URLలను బ్లాక్ చేయండిని క్లిక్ చేయండి.
    • యాడ్‌లను సాధారణ లేదా వివాదాస్పద కేటగిరీల ఆధారంగా బ్లాక్ చేయడానికి: పేజీకి ఎగువ భాగాన ఉన్న హారిజాంటల్ బార్‌లో సంబంధిత ట్యాబ్‌ను క్లిక్ చేయండి. కేటగిరీలను అనుమతించడానికి లేదా బ్లాక్ చేయడానికి, పేజీలో ఉన్న కంట్రోల్స్‌ను ఉపయోగించండి.

ఎంచుకున్నాక మార్పులు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి, అవి మీ ఛానెల్‌లో 24 గంటలలోపు ప్రతిబింబిస్తాయి.

బ్లాకింగ్ కంట్రోల్స్ వీక్షణ పేజీలో కనిపించే యాడ్‌లకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి ఫీడ్స్‌లో లేదా షార్ట్స్‌లో కనిపించే యాడ్లను ప్రభావితం చేయవు.

మీ ఫిల్టర్ లిస్ట్ YouTube కోసం AdSense ద్వారా అందించబడే యాడ్లను మాత్రమే బ్లాక్ చేస్తుంది. నిర్దిష్ట డొమైన్‌లను ఫిల్టర్ చేయడం వలన Google Ad Manager ద్వారా అందించబడే యాడ్స్‌ను అడ్డుకోవు.

యాడ్‌లను అనుమతించడం లేదా బ్లాక్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17616670908799528379
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false