YouTube సిఫార్సు చేసిన అప్‌లోడ్ ఎన్‌కోడింగ్ సెట్టింగ్‌లు

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాక్సెస్ పొందడానికి మీ YouTube పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించండి.

YouTubeలో మీ వీడియోల కోసం సిఫార్సు చేయబడిన అప్‌లోడ్ ఎన్‌కోడింగ్ సెట్టింగ్‌లు ఈ కింద ఉన్నాయి. 

కంటేయినర్: MP4
  • ఎడిట్ లిస్ట్‌లు ఉండకూడదు (లేకపోతే వీడియో సరిగ్గా ప్రాసెస్ అవ్వకపోవచ్చు)
  • moov atom, ఫైల్ ముందు భాగంలో ఉండాలి (వేగవంతమైన ప్రారంభం)
ఆడియో కోడెక్: AAC-LC
  • ఛానెల్స్: స్టీరియో లేదా స్టీరియో + 5.1
  • శాంపిల్ రేట్, 96khz లేదా 48khz
వీడియో కోడెక్: H.264
  • ప్రోగ్రెసివ్ స్కాన్ (ఇంటర్‌లేసింగ్ ఉండదు)
  • హై ప్రొఫైల్
  • 2 వరుస B ఫ్రేమ్‌లు
  • మూసివేయబడిన GOP. సగం ఫ్రేమ్ రేట్‌కు సంబంధించిన GOP.
  • CABAC
  • వేరియబుల్ బిట్ రేట్. రెఫరెన్స్ కోసం సిఫార్సు చేయబడిన బిట్ రేట్‌లను మేము కింద అందిస్తున్నప్పటికీ, బిట్ రేట్‌పై పరిమితి అవసరం లేదు
  • Chroma subsampling: 4:2:0
ఫ్రేమ్ రేట్

కంటెంట్ ఏ ఫ్రేమ్ రేట్‌లో అయితే రికార్డ్ చేయబడిందో, అదే ఫ్రేమ్ రేట్‌లో దాన్ని ఎన్‌కోడ్ చేసి, అప్‌లోడ్ చేయాలి.

సాధారణ ఫ్రేమ్ రేట్‌లు: ఒక సెకనుకు 24, 25, 30, 48, 50, 60 ఫ్రేమ్‌లు (ఇతర ఫ్రేమ్ రేట్‌లు కూడా ఆమోదించబడతాయి).

అప్‌లోడ్ చేయడానికి ముందు, ఇంటర్‌లేస్ చేయబడిన కంటెంట్‌ను డీఇంటర్‌లేస్ చేయాలి. ఉదాహరణకు, 1080i60 కంటెంట్‌ను 1080p30కు డీఇంటర్‌లేస్ చేయాలి. సెకనుకు 60 ఇంటర్‌లేస్ చేయబడిన ఫీల్డ్‌లను, సెకనుకు 30 ప్రోగ్రెసివ్ ఫ్రేమ్‌లుగా డీఇంటర్‌లేస్ చేయాలి.

బిట్ రేట్

అప్‌లోడ్‌ల కోసం సిఫార్సు చేయబడిన బిట్ రేట్‌లు, ఈ కింద పేర్కొనబడ్డాయి. ఆడియో ప్లేబ్యాక్ బిట్ రేట్ అనేది వీడియో రిజల్యూషన్‌కు సంబంధించినది కాదు.

SDR అప్‌లోడ్‌ల కోసం సిఫార్సు చేయబడిన వీడియో బిట్ రేట్‌లు

4Kలో కొత్త 4K అప్‌లోడ్‌లను చూడటానికి, VP9ను సపోర్ట్ చేసే బ్రౌజర్ లేదా పరికరాన్ని ఉపయోగించండి.

రకం వీడియో బిట్ రేట్, స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్
(24, 25, 30)
వీడియో బిట్ రేట్, హై ఫ్రేమ్ రేట్
(48, 50, 60)
8K 80 - 160 Mbps 120 నుండి 240 Mbps వరకు
2160p (4K) 35–45 Mbps 53–68 Mbps
1440p (2K) 16 Mbps 24 Mbps
1080p 8 Mbps 12 Mbps
720p 5 Mbps 7.5 Mbps
480p 2.5 Mbps 4 Mbps
360p 1 Mbps 1.5 Mbps

HDR అప్‌లోడ్‌ల కోసం సిఫార్సు చేయబడిన వీడియో బిట్ రేట్‌లు

రకం వీడియో బిట్ రేట్, స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్
(24, 25, 30)
వీడియో బిట్ రేట్, హై ఫ్రేమ్ రేట్
(48, 50, 60)
8K 100 - 200 Mbps 150 నుండి 300 Mbps వరకు
2160p (4K) 44–56 Mbps 66–85 Mbps
1440p (2K) 20 Mbps 30 Mbps
1080p 10 Mbps 15 Mbps
720p 6.5 Mbps 9.5 Mbps
480p

సపోర్ట్ చేయదు

సపోర్ట్ చేయదు
360p సపోర్ట్ చేయదు సపోర్ట్ చేయదు

అప్‌లోడ్‌ల కోసం సిఫార్సు చేయబడిన ఆడియో బిట్ రేట్‌లు

రకం ఆడియో బిట్ రేట్
మోనో 128 Kbps
స్టీరియో 384 Kbps
5.1 512 Kbps
వీడియో రిజల్యూషన్, ఆకార నిష్పత్తి

కంప్యూటర్‌లో YouTubeకు సంబంధించిన స్టాండర్డ్ ఆకార నిష్పత్తి, 16:9. వర్టికల్ లేదా స్క్వేర్ వంటి ఇతర ఆకార నిష్పత్తులలో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, ప్లేయర్, ఆటోమేటిక్‌గా దాని సైజ్‌ను వీడియో సైజ్‌కు సర్దుబాటు చేసుకుంటుంది. ఈ సెట్టింగ్, ఆకార నిష్పత్తి అలాగే పరికరం ఆధారంగా ఉత్తమ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

సరైన విధంగా వీడియో రిజల్యూషన్ అలాగే ఆకార నిష్పత్తులను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.

కలర్ స్పేస్

SDR అప్‌లోడ్‌ల కోసం సిఫార్సు చేయబడిన కలర్ స్పేస్

SDR అప్‌లోడ్‌ల కోసం స్టాండర్డ్ కలర్ స్పేస్‌గా YouTube, BT.709ను సిఫార్సు చేస్తోంది:
కలర్ స్పేస్ కలర్ ట్రాన్స్‌ఫర్ లక్షణాలు (TRC) కలర్ ప్రైమరీలు కలర్ మ్యాట్రిక్స్ కోఎఫీషియంట్‌లు
BT.709 BT.709 (H.273 విలువ: 1) BT.709 (H.273 విలువ 1) BT.709 (H.273 విలువ 1)


వీడియోను ప్రాసెస్ చేయడానికి ముందు, ఫంక్షనల్‌గా ఒకే రకంగా ఉండే కలర్ మ్యాట్రిక్స్‌లను అలాగే ప్రైమరీలను YouTube ప్రామాణికంగా చేస్తుంది. ఉదాహరణకు, BT.601, అలాగే BT.709 TRC సరిగ్గా ఒకేలా ఉంటాయి, వాటిని YouTube BT.709గా ఏకీకృతం చేస్తుంది. లేదా, BT.601 NTSC, PAL ఫంక్షనల్‌గా ఒకే రకమైన కలర్ మ్యాట్రిక్స్‌లను కలిగి ఉంటాయి, వాటిని YouTube BT.601 NTSCగా ఏకీకృతం చేస్తుంది. అదనంగా, కలర్ స్పేస్ విలువలను అర్థం చేసుకోవడానికి YouTube ఈ కింది చర్యలను తీసుకోవచ్చు:

ఎప్పుడు YouTube చర్య
అప్‌లోడ్ చేయబడిన కలర్ స్పేస్, పేర్కొనబడని TRCని కలిగి ఉన్నప్పుడు. BT.709 TRCగా భావిస్తుంది.
అప్‌లోడ్ చేయబడిన కలర్ స్పేస్, తెలియని లేదా పేర్కొనబడని కలర్ మ్యాట్రిక్స్‌ను, ప్రైమరీలను కలిగి ఉన్నప్పుడు. BT.709 కలర్ మ్యాట్రిక్స్, అలాగే ప్రైమరీలుగా భావిస్తుంది.
అప్‌లోడ్ చేయబడిన కలర్ స్పేస్, BT.601 కలర్ ప్రైమరీలను, మ్యాట్రిక్స్‌ను, అలాగే BT.709 కలర్ ప్రైమరీలను, మ్యాట్రిక్స్‌ను నిర్దిష్ట విలువలతో మిక్స్ చేసినప్పుడు. కలర్ ప్రైమరీలను ఓవర్‌రైడ్ చేయడానికి, అలాగే వాటిని ఏకీకృతం చేయడానికి కలర్ మ్యాట్రిక్స్‌ను ఉపయోగిస్తుంది.
అప్‌లోడ్ చేయబడిన కలర్ స్పేస్, BT.601 కలర్ ప్రైమరీలను, మ్యాట్రిక్స్‌ను, అలాగే BT.709 కలర్ ప్రైమరీలను, మ్యాట్రిక్స్‌ను మిక్స్ చేసినప్పుడు, అలాగే ప్రైమరీలు లేదా మ్యాట్రిక్స్‌లో ఏదైనా ఒకటి పేర్కొనబడనప్పుడు. పేర్కొనని దాన్ని సెట్ చేసి, ఓవర్‌రైడ్ చేయడానికి కలర్ ప్రైమరీలు/మ్యాట్రిక్స్ యొక్క పేర్కొనబడిన విలువను ఉపయోగిస్తుంది.


అప్‌లోడ్ కలర్ స్పేస్ ప్రామాణీకరణ తర్వాత, కలర్ స్పేస్ BT.709 లేదా BT.601తో మ్యాచ్ అవుతుందో లేదో YouTube చెక్ చేస్తుంది, మ్యాచ్ అయిన పక్షంలో, ఆ కలర్ స్పేస్ ఉపయోగించబడుతుంది. లేకపోతే, పిక్సెల్ విలువలను మ్యాప్ చేయడం ద్వారా YouTube, సపోర్ట్ చేయని కలర్ స్పేస్‌లను BT.709గా మారుస్తుంది.

గమనిక: బ్యాండింగ్‌ను నివారించడానికి, సపోర్ట్ చేసే HDR ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్‌ లేకుండా BT.2020 వంటి హై బిట్ గాఢత్వము అవసరం ఉన్న కలర్ ప్రైమరీలను YouTube, BT.709 (8-బిట్)గా మారుస్తుంది. YouTube పూర్తి రంగు పరిధిని పరిమిత రంగు పరిధికి మారుస్తుంది.
హెచ్చరిక: అప్‌లోడ్‌ల విషయంలో, YouTube, RGB కలర్ మ్యాట్రిక్స్‌ను సిఫార్సు చేయదు. ఈ సందర్భంలో, ప్రామాణీకరణకు ముందు YouTube, కలర్ మ్యాట్రిక్స్‌ను పేర్కొనబడనిదిగా సెట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రామాణీకరణ సమయంలో, అది కలర్ ప్రైమరీలను ఉపయోగించి, కలర్ మ్యాట్రిక్స్‌ను అంచనా వేస్తుంది. sRGB TRC అనేది BT.709 TRCగా మారుతుందని గమనించండి. FFmpeg కలర్ స్పేస్ కన్వర్షన్ ఫిల్టర్, కలర్ ప్రైమరీలు/మ్యాట్రిక్స్/TRCని సపోర్ట్ చేయనప్పుడు, ఆ సపోర్ట్ చేయని దాన్ని YouTube, BT.709గా రీట్యాగ్ చేస్తుంది.

HDR అప్‌లోడ్‌ల కోసం సిఫార్సు చేయబడిన కలర్ స్పేస్

HDR వీడియోలను అప్‌లోడ్ చేయడం ఆర్టికల్‌ను చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6761406956832157755
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false