వీడియోలను, ప్లేలిస్ట్‌లను పొందుపరచండి

మీరు YouTube వీడియోను లేదా ప్లేలిస్ట్‌ను పొందుపరచడం ద్వారా, వాటిని వెబ్‌సైట్‌కు లేదా బ్లాగ్‌కు జోడించవచ్చు.

మీరు టీచర్ అయి ఉంటే, మీ క్లాస్‌ల కోసం YouTube కంటెంట్‌ను పొందుపరచడం ఎలాగా అనే దానికి సంబంధించిన సమచారం కోసం మీ విద్యా సంబంధిత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను సంప్రదించండి.

YouTube పొందుపరచబడిన ప్లేయర్‌ను యాక్సెస్ చేసినప్పుడల్లా, అలాగే దాన్ని ఉపయోగించినప్పుడల్లా YouTube API సర్వీస్ నియమాలు అలాగే డెవలపర్ పాలసీలు వర్తిస్తాయి.

వీడియో లేదా ప్లేలిస్ట్‌ను పొందుపరచండి

  1. కంప్యూటర్‌లో, మీరు పొందుపరచాలనుకుంటున్న YouTube వీడియో లేదా ప్లేలిస్ట్ వద్దకు వెళ్లండి.
  2. షేర్ చేయి ని క్లిక్ చేయండి.
  3. షేర్ చేయడానికి సంబంధించిన ఆప్షన్‌ల లిస్ట్ నుండి, 'పొందుపరచండి'ని క్లిక్ చేయండి.
  4. కనిపించే బాక్స్ నుండి, HTML కోడ్‌ను కాపీ చేయండి.
  5. కోడ్‌ను మీ వెబ్‌సైట్ HTMLలోకి పేస్ట్ చేయండి.
  6. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌లకు: మీరు youtube.comను ఫైర్‌వాల్ వైట్‌లిస్ట్‌కు జోడించాల్సి ఉంటుంది.
  7. ముఖ్య గమనిక: మీ వెబ్‌సైట్ లేదా యాప్, చిన్నారుల కోసం ఉద్దేశించినది అయితే, అలాగే అందులో మీరు YouTube కంటెంట్‌ను పొందుపరిస్తే, ఈ టూల్స్‌ను ఉపయోగించి తప్పనిసరిగా మీ సైట్‌ను లేదా యాప్‌ను మీరు సొంతంగా పేర్కొనాలి. ఇలా సొంతంగా పేర్కొన్నప్పుడు, ఈ సైట్‌లు లేదా యాప్స్‌లో, Google వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ప్రదర్శించదు, అలాగే పొందుపరిచిన ప్లేయర్‌లో కొన్ని ఫీచర్‌లు ఆఫ్ చేయబడతాయి.
గమనిక: చాలా వరకు థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లలో వయోపరిమితి విధించబడిన వీడియోలను చూడటం సాధ్యపడదు. ప్లే చేసినప్పుడు, ఈ వీడియోలు వీక్షకులను తిరిగి YouTubeకు మళ్లిస్తాయి.

వీడియోను పొందుపరిచే ఆప్షన్‌లను మేనేజ్ చేయండి

మెరుగైన గోప్యతా మోడ్‌ను ఆన్ చేయండి

పొందుపరిచిన YouTube కంటెంట్ వీక్షణలను వినియోగించి YouTubeలో వీక్షకుల బ్రౌజింగ్ అనుభవాన్ని ప్రభావితం చేయకుండా, YouTube పొందుపరిచిన ప్లేయర్‌లో గల మెరుగైన గోప్యతా మోడ్ నివారిస్తుంది. అంటే, పొందుపరిచిన ప్లేయర్‌లో గల మెరుగైన గోప్యతా మోడ్‌లో చూపిన ఏదైనా వీడియో ఆధారంగా, మెరుగైన గోప్యతా మోడ్‌ను ఉపయోగిస్తున్న మీ పొందుపరచబడిన ప్లేయర్ లోపల గానీ, లేదా మీ తదుపరి YouTube వీక్షణ అనుభవంలో గానీ YouTube బ్రౌజింగ్ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడం జరగదు.

ఒకవేళ పొందుపరిచిన ప్లేయర్‌లో గల మెరుగైన గోప్యతా మోడ్‌లో చూపిన ఏదైనా వీడియోలో యాడ్‌లను అందించినట్లయితే, ఆ యాడ్‌లను కూడా వ్యక్తిగతీకరించడం జరగదు. అంతే కాకుండా, పొందుపరచబడిన ప్లేయర్ యొక్క మెరుగైన గోప్యతా మోడ్‌లో చూపబడిన ఏదైనా వీడియో ఆధారంగా, మీ సైట్ లేదా యాప్ వెలుపల వీక్షకులకు చూపబడే అడ్వర్టయిజింగ్‌ను కూడా వ్యక్తిగతీకరించడం జరగదు.

YouTube పొందుపరిచిన ప్లేయర్‌ను యాక్సెస్ చేసినప్పుడు, అలాగే దాన్ని ఉపయోగించినప్పుడు, YouTube API సర్వీస్ నియమాలు, అలాగే డెవలపర్ పాలసీలు వర్తిస్తాయని మేము మీకు గుర్తు చేస్తున్నాము.

మెరుగైన గోప్యతా మోడ్‌ను ఉపయోగించడానికి:

  1. మీ HTMLలోని పొందుపరిచిన URLకు సంబంధించిన డొమైన్‌ను https://www.youtube.com నుండి https://www.youtube-nocookie.comకు మార్చండి.
  2. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌లకు: మీరు youtube-nocookie.comను ఫైర్‌వాల్ వైట్‌లిస్ట్‌కు జోడించాల్సి ఉంటుంది.
  3. యాప్‌లలో ఉపయోగించడానికి, పొందుపరిచిన ప్లేయర్ వెబ్ వీక్షణ వెర్షన్‌ను ఉపయోగించండి. మెరుగైన గోప్యతా మోడ్, కేవలం వెబ్‌సైట్స్‌లో ఉండే పొందుపరిచిన ప్లేయర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.
  4. ముఖ్య గమనిక: మీ వెబ్‌సైట్ లేదా యాప్, చిన్నారుల కోసం ఉద్దేశించినది అయితే, మీరు YouTube వీడియోలను మెరుగైన గోప్యతా మోడ్ ప్లేయర్‌తో పొందుపరిచినప్పటికీ, YouTube API సర్వీస్ నియమాలు, అలాగే డెవలపర్ పాలసీల ప్రకారం, ఈ టూల్స్‌ను ఉపయోగించి తప్పనిసరిగా మీ సైట్‌ను లేదా యాప్‌ను మీరు సొంతంగా పేర్కొనాలి.

ఉదాహరణ:

మార్చక ముందు

<iframe width="1440" height="762"

src="https://www.youtube.com/embed/7cjVj1ZyzyE"

frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

మార్చిన తర్వాత

<iframe width="1440" height="762" src="https://www.youtube-nocookie.com/embed/7cjVj1ZyzyE"

frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

గమనిక: ఒకవేళ వీక్షకులు, పొందుపరిచిన వీడియోలోని ఏదైనా లింక్‌ను లేదా యాడ్‌ను క్లిక్ లేదా ట్యాప్ చేసినప్పుడు, వారు మరొక వెబ్‌సైట్ లేదా యాప్‌నకు మళ్లించబడితే, ఆ వెబ్‌సైట్ లేదా యాప్, దాని పాలసీలు, నియమాలకు అనుగుణంగా వీక్షకుల ప్రవర్తనను ట్రాక్ చేయవచ్చు.

పొందుపరచబడిన వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా చేయండి

పొందుపరచబడిన వీడియోను ఆటోప్లే అయ్యేలా చేయడానికి, వీడియోకు చెందిన పొందుపరిచిన కోడ్‌కు, సరిగ్గా వీడియో ID ("embed/" తర్వాత ఉండే అక్షరాలు) తర్వాత, "&autoplay=1"ను జోడించండి.

ఆటోప్లే అయ్యే పొందుపరచబడిన వీడియోలు, వీడియో వీక్షణల సంఖ్యను పెంచవు.

ఉదాహరణ:

<iframe width="560" height="315"
src="https://www.youtube.com/embed/D6Ac5JpCHmI?&autoplay=1"frameborder="0"
allowfullscreen></iframe>
పొందుపరిచిన వీడియోను నిర్దిష్ట సమయం వద్ద ప్రారంభించండి

ఒక నిర్దిష్ట సమయం నుండి వీడియో ప్లే అవ్వడం ప్రారంభించేలా సెట్ చేయడానికి, వీడియోకు చెందిన పొందుపరిచిన కోడ్‌కు “?start=”ను జోడించి, దాని తర్వాత మీరు ఏ సమయం వద్ద అయితే వీడియో ప్లే అవ్వడం ప్రారంభించాలనుకుంటున్నారో, ఆ సమయాన్ని సెకన్లలో జోడించండి.

ఉదాహరణకు, మీరు వీడియోను 1 నిమిషం 30 సెకన్ల నుండి ప్రారంభించాలనుకుంటే, మీ పొందుపరిచిన కోడ్ ఈ కింద చూపిన విధంగా ఉంటుంది:

<iframe allowfullscreen="" frameborder="0" height="315" src="http://www.youtube.com/embed/UkWd0azv3fQ?start=90" width="420"></iframe>
పొందుపరచబడిన వీడియోకు క్యాప్షన్‌లు జోడించండి

వీడియోకు చెందిన పొందుపరిచిన కోడ్‌కు "&cc_load_policy=1"ను జోడించడం ద్వారా, పొందుపరచబడిన వీడియోలో క్యాప్షన్‌లు ఆటోమేటిక్‌గా వచ్చేలా చేయండి.

పొందుపరచబడిన వీడియోకు మీరు క్యాప్షన్ భాషను కూడా ఎంచుకోవచ్చు. మీరు పొందుపరచాలనుకుంటున్న వీడియో కోసం క్యాప్షన్ భాషను పేర్కొనడానికి, వీడియోకు చెందిన పొందుపరిచిన కోడ్‌కు "&cc_lang_pref=fr&cc_load_policy=1"ను జోడిస్తే సరిపోతుంది.

  • వీడియోలో చూపబడే క్యాప్షన్‌ల కోసం, "cc_lang_pref" భాషను సెట్ చేస్తుంది.
  • "cc_load_policy=1", ఆటోమేటిక్‌గా క్యాప్షన్‌లను ఆన్ చేస్తుంది.
  • "fr" ఫ్రెంచ్ భాషకు సంబంధించిన కోడ్‌ను సూచిస్తుంది. మీరు ISO 639-1 స్టాండర్డ్‌లో 2 అక్షరాల భాష కోడ్‌లను చూడవచ్చు.
మీ వీడియోలకు పొందుపరిచే సదుపాయాన్ని ఆఫ్ చేయండి
మీరు ఒక వీడియోను అప్‌లోడ్ చేసి ఉంటే, ఆ వీడియోను బాహ్య సైట్‌లలో పొందుపరచకుండా ఇతరులను నిరోధించాలనుకుంటే, ఈ దిగువనున్న దశలను ఫాలో అవ్వండి:
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు మేనేజ్ చేయాలనుకుంటున్న వీడియో పక్కన, వివరాలు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. కింది నుండి, మరిన్ని చూడండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. "పొందుపరచడాన్ని అనుమతించండి"కి పక్కన ఉన్న బాక్స్ ఎంపికను తీసివేసి, సేవ్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
954846785232210282
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false