YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయండి

Google ఖాతాతో మీరు వీడియోలను చూడవచ్చు, లైక్ చేయవచ్చు, అలాగే ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. కానీ YouTube ఛానెల్ లేకుండా, YouTubeలో మీ యాక్టివిటీ పబ్లిక్‌గా కనిపించదు. మీకు Google ఖాతా ఉన్నప్పటికీ, మీరు వీడియోలను అప్‌లోడ్ చేయడానికి, కామెంట్ చేయడానికి లేదా ప్లేలిస్ట్‌లను రూపొందించడానికి YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది.

మీరు మీ ఛానెల్‌ను YouTube వెబ్‌సైట్‌లో లేదా YouTube మొబైల్ సైట్‌లో క్రియేట్ చేయవచ్చు.

గమనిక: ఈ ఫీచర్ YouTubeలోని యాక్సెస్ పర్యవేక్షణ మోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి.

YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయడం, దాన్ని అనుకూలంగా మార్చడం ఎలా (Creatorకు సంబంధించిన ప్రాథమిక అంశాలు)

వ్యక్తిగత ఛానెల్‌ను క్రియేట్ చేయండి

మీ Google ఖాతాను ఉపయోగించి మీరు మాత్రమే మేనేజ్ చేయగల ఛానెల్‌ను క్రియేట్ చేయడానికి ఈ సూచనలను ఫాలో అవ్వండి.

  1. కంప్యూటర్ లేదా మొబైల్ సైట్‌లో YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాతఛానెల్‌ను క్రియేట్ చేయండిని క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్రియేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
  4. వివరాలను (మీ Google ఖాతా పేరు, ఫోటోతో) చెక్ చేసి, మీ ఛానెల్‌ను క్రియేట్ చేయడాన్ని నిర్ధారించండి.
గమనిక: కొన్ని సందర్భాల్లో, మీరు మొబైల్‌లో కామెంట్‌ను పోస్ట్ చేయడం వంటి విధానాల ద్వారా ఛానెల్‌ను క్రియేట్ చేసినప్పుడు, మీరు ఎంచుకున్న ఛానెల్ పేరు ఆధారంగా YouTube మీకు హ్యాండిల్‌ను ఆటోమేటిక్‌గా కేటాయించవచ్చు. కొన్ని సందర్భాలలో, ఎంచుకున్న ఛానెల్ పేరును హ్యాండిల్‌గా మార్చడం వీలు కాకపోతే, మీ హ్యాండిల్ ర్యాండమ్‌గా కేటాయించబడవచ్చు. మీరు Studio‌లో లేదా youtube.com/handle లింక్‌కు వెళ్లి ఎప్పుడైనా హ్యాండిల్‌ను చూడవచ్చు, ఎడిట్ చేయవచ్చు.

బిజినెస్ లేదా ఇతర పేరుతో ఛానెల్‌ను క్రియేట్ చేయండి

ఒకరి కంటే ఎక్కువ మేనేజర్‌లు లేదా ఓనర్‌లు ఉండగలిగే ఛానెల్‌ను క్రియేట్ చేయడానికి ఈ సూచనలను ఫాలో అవ్వండి.

మీరు మీ Google ఖాతా పేరును కాకుండా YouTubeలో వేరే పేరును ఉపయోగించాలనుకుంటే మీ ఛానెల్‌ను బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేయవచ్చు. బ్రాండ్ ఖాతాల గురించి మరింత తెలుసుకోండి.

  1. కంప్యూటర్ లేదా మొబైల్ సైట్‌లో YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ఛానెల్ లిస్ట్‌కు వెళ్లండి.
  3. కొత్త ఛానెల్‌ను క్రియేట్ చేయడాన్ని ఎంచుకోండి లేదా ఇప్పటికే ఉన్న బ్రాండ్ ఖాతాను ఉపయోగించండి:
    • కొత్త ఛానెల్‌ను క్రియేట్ చేయండిని క్లిక్ చేయడం ద్వారా ఛానెల్‌ను క్రియేట్ చేయండి.
    • లిస్ట్ నుండి బ్రాండ్ ఖాతాను ఎంచుకోవడం ద్వారా మీరు ఇప్పటికే మేనేజ్ చేసే బ్రాండ్ ఖాతా కోసం YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయండి. ఈ బ్రాండ్ ఖాతా ఇప్పటికే ఒక ఛానెల్‌ను కలిగి ఉంటే, మీరు దాన్ని ఉపయోగించి కొత్త ఛానెల్‌ను క్రియేట్ చేయలేరు. మీరు లిస్ట్ నుండి బ్రాండ్ ఖాతాను ఎంచుకున్నప్పుడు, మీరు ఆ ఛానెల్‌కు మారతారు.
  4. మీ కొత్త ఛానెల్‌కు పేరు పెట్టడానికి వివరాలను పూరించండి. ఆ తర్వాత, క్రియేట్ చేయండిని క్లిక్ చేయండి. ఇది కొత్త బ్రాండ్ ఖాతాను క్రియేట్ చేస్తుంది.
  5. ఛానెల్ మేనేజర్‌ను జోడించడానికి, ఛానెల్ ఓనర్‌లు, మేనేజర్‌లను మార్చడం కోసం ఉన్న సూచనలను అనుసరించండి.

YouTubeలో బిజినెస్ లేదా ఇతర పేరుతో ఛానెల్‌ను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10393564692677942846
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false