వీడియో గోప్యతా సెట్టింగ్‌లను మార్చండి

మీ వీడియో ఎక్కడ కనిపించవచ్చు, అలాగే దాన్ని ఎవరెవరు చూడవచ్చు అనే దాన్ని కంట్రోల్ చేయడానికి, మీ వీడియోకు సంబంధించిన గోప్యతా సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.

YouTube iPhone & iPad యాప్

  1. YouTube యాప్ ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో  ఆ తర్వాత మీ వీడియోలు ను ట్యాప్ చేయండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న వీడియో పక్కన ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. విజిబిలిటీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, పబ్లిక్, ప్రైవేట్, అన్‌లిస్టెడ్ ఆప్షన్‌లలో ఒక దానిని ఎంచుకోండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

iPhone, iPad కోసం YouTube Studio యాప్

  1. YouTube Studio యాప్ ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూలో, కంటెంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి. 
  4. ఎడిట్ చేయండి Edit iconని ట్యాప్ చేయండి.
  5. విజిబిలిటీ ని ట్యాప్ చేసి పబ్లిక్, అన్‌లిస్టెడ్, లేదా ప్రైవేట్‌ను ఎంచుకోండి.
    1. పబ్లిక్: YouTubeలో ఎవరైనా పబ్లిక్ వీడియోలను చూడవచ్చు. YouTubeను ఉపయోగించే ఎవరికైనా వాటిని షేర్ కూడా చేయవచ్చు.
    2. అన్‌లిస్టెడ్: అన్‌లిస్టెడ్ వీడియోలు, ప్లేలిస్ట్‌లను లింక్ ఉన్న వారు ఎవరైనా చూడగలరు అలాగే షేర్ చేయగలరు.
    3. ప్రైవేట్: ప్రైవేట్ వీడియోలు, ప్లేలిస్ట్‌లను మీరు, అలాగే మీరు ఎంచుకున్న వారు మాత్రమే చూడగలుగుతారు.
  6. వెనుకక ఆ తర్వాత సేవ్ చేయండిని ట్యాప్ చేయండి.

గమనిక: 13–17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న క్రియేటర్‌ల కోసం ఆటోమేటిక్ వీడియో గోప్యతా సెట్టింగ్ ప్రైవేట్‌కు సెట్ చేయబడి ఉంటుంది. మీరు 18 లేదా అంత కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారైతే, మీ ఆటోమేటిక్ వీడియో గోప్యతా సెట్టింగ్ పబ్లిక్‌కు సెట్ చేయబడి ఉంటుంది. తమ వీడియోను పబ్లిక్, ప్రైవేట్, లేదా అన్‌లిస్టెడ్‌గా చేయడానికి అందరూ ఈ సెట్టింగ్‌ను మార్చుకోవచ్చు. 

గోప్యతా సెట్టింగ్‌ల గురించి వివరాలు

పబ్లిక్ వీడియోలు
YouTubeలో ఎవరైనా పబ్లిక్ వీడియోలను చూడగలుగుతారు. YouTubeను ఉపయోగిస్తున్న ఎవరికైనా వాటిని షేర్ కూడా చేయవచ్చు. మీరు వాటిని అప్‌లోడ్ చేసినప్పుడు అవి మీ ఛానెల్‌లో పోస్ట్ అవుతాయి, అలాగే సెర్చ్ ఫలితాలు, సంబంధిత వీడియోల లిస్ట్‌లలో అవి కనిపిస్తాయి.
ప్రైవేట్ వీడియోలు

ప్రైవేట్ వీడియోలు, ప్లేలిస్ట్‌లను మీరు, అలాగే మీరు ఎంచుకున్న వారు మాత్రమే చూడగలుగుతారు. మీ ప్రైవేట్ వీడియోలు, మీ ఛానెల్ హోమ్ పేజీలోని వీడియోల ట్యాబ్‌లో కనిపించవు. అవి YouTube సెర్చ్ ఫలితాలలో కూడా కనిపించవు. యాడ్‌ల ఔచిత్యం, కాపీరైట్, అలాగే ఇతర దుర్వినియోగ నివారణ విధానాల కోసం YouTube సిస్టమ్‌లు అలాగే మానవ రివ్యూవర్‌లు ప్రైవేట్ వీడియోలను రివ్యూ చేయవచ్చు.

ప్రైవేట్ వీడియోను షేర్ చేయడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. విజిబిలిటీ బాక్స్‌ను క్లిక్ చేసి, ప్రైవేట్‌గా షేర్ చేయండిని ఎంచుకోండి.
  5. మీ వీడియోను మీరు షేర్ చేయాలనుకుంటున్న వ్యక్తుల ఈమెయిల్ అడ్రస్‌లను ఎంటర్ చేసి, సేవ్ చేయండిని ఎంచుకోండి.

ప్రైవేట్ వీడియోలలో కామెంట్‌లు చేసే సదుపాయం అందుబాటులో లేదు. మీరు పబ్లిక్‌గా అందుబాటులో లేని వీడియోపై కామెంట్‌లను అనుమతించాలనుకుంటే, గోప్యతా సెట్టింగ్‌ను అన్‌లిస్టెడ్‌కు మార్చండి.

అన్‌లిస్టెడ్ వీడియోలు

అన్‌లిస్టెడ్ వీడియోలు, ప్లేలిస్ట్‌లను లింక్ ద్వారా ఎవరైనా చూడగలరు అలాగే షేర్ చేయగలరు. మీ అన్‌లిస్టెడ్ వీడియోలు, మీ ఛానెల్ హోమ్ పేజీలోని వీడియోల ట్యాబ్‌లో కనిపించవు. ఎవరైనా మీ అన్‌లిస్టెడ్ వీడియోను పబ్లిక్ ప్లేలిస్ట్‌కు జోడిస్తే తప్ప, అది YouTube సెర్చ్ ఫలితాలలో కనిపించదు.

మీరు అన్‌లిస్టెడ్ వీడియో URLను షేర్ చేయవచ్చు. మీరు ఎవరికైతే వీడియోను షేర్ చేస్తారో వారికి ఆ వీడియోను చూడటానికి Google ఖాతా అవసరం లేదు. లింక్ ఉన్న వారు ఎవరైనా దాన్ని తిరిగి షేర్ కూడా చేయవచ్చు.

ఫీచర్ ప్రైవేట్ అన్‌లిస్టెడ్ పబ్లిక్
URLను షేర్ చేయవచ్చా? లేదు అవును అవును
ఛానెల్ విభాగానికి జోడించవచ్చా? లేదు అవును అవును
సెర్చ్, సంబంధిత వీడియోలు, అలాగే సిఫార్సులలో కనిపిస్తాయా లేదు లేదు అవును
మీ ఛానెల్‌లో పోస్ట్ అవుతుందా? లేదు లేదు అవును
సబ్‌స్క్రయిబర్ ఫీడ్‌లో కనిపిస్తుందా? లేదు లేదు అవును
దానిపై కామెంట్ చేయవచ్చా? లేదు అవును చేయవచ్చు
పబ్లిక్ ప్లేలిస్ట్‌లో చూపే సదుపాయం లేదు అవును అవును

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12994525547388581168
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false