నా వీడియోలను YouTube ఎందుకు ప్రైవేట్‌కు మార్చింది?

కొన్ని సందర్భాలలో, మీ ఛానెల్‌లో అనుమానాస్పదమైన యాక్టివిటీని మేము గుర్తించినప్పుడు, వీడియోలను హ్యాకర్ అప్‌లోడ్ చేశారని మేము నమ్మితే, చర్యలు తీసుకొని వీడియోలను మేము ప్రైవేట్‌కు సెట్ చేయవచ్చు. మీ ఛానెల్‌ను, కమ్యూనిటీని మెరుగ్గా రక్షించడం కోసం మేము ఈ చర్యలు తీసుకుంటాము.

మీ వీడియోలలో వేటిని అయినా మేము ప్రైవేట్‌కు సెట్ చేస్తే, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాము. అదనంగా, మీరు, మీ YouTube కమ్యూనిటీ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మీ ఖాతా నుండి మిమ్మల్ని సైన్ అవుట్ చేస్తాము.

నేను ఏమి చేయాలి?

మీరు వీడియోలను పబ్లిష్ చేస్తే

మీ ప్రైవేట్ వీడియోలను మళ్లీ పబ్లిక్‌గా మార్చాలా, లేదా అని నిర్ణయించుకోవడానికి ముందు వాటిని పరిశీలించండి. మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను వీడియోలను ఫాలో అవుతున్నాయని మీరు భావిస్తే, వాటిని పబ్లిక్‌కు మార్చవచ్చు.

గమనిక: మీ వీడియోలను మీరు 'పబ్లిక్'కు మార్చలేకపోతుంటే, అది వేరొక కారణం చేత దానిని ప్రైవేట్‌గా గుర్తించడం వల్ల కావచ్చు. సంబంధం లేని, లేదా తప్పుదారి పట్టించే ట్యాగ్‌లను ఉపయోగించడం వల్ల 'ప్రైవేట్'గా గుర్తించే వీడియోల గురించి మరింత తెలుసుకోండి.

మీరు వీడియోలను పబ్లిష్ చేయకపోతే

  1. studio.youtube.com‌కు వెళ్లి, మీరు అప్‌లోడ్ చేయని వీడియోలు ఏవైనా ఉంటే, వాటిని తొలగించండి. ప్రైవేట్ వీడియోలు కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి, అలాగే మీరు పోస్ట్ చేయని కంటెంట్‌కు మీకు జరిమానా విధించబడాలని మేము కోరుకోవడం లేదు.
  2. మీ Google ఖాతాలో సెక్యూరిటీ చెకప్ చేసి, సిఫార్సు చేసిన దశలు ఏవైనా ఉంటే, ఫాలో అవ్వండి. మీ పాస్‌వర్డ్‌ను మార్చడం లేదా పాత పరికరాలను తీసివేయడం వంటివి సూచించిన చర్యలలో ఉండవచ్చు.
  3. ఎవరికి మీ ఛానెల్‌కు యాక్సెస్ ఉందో రివ్యూ చేయండి. అవాంఛిత యూజర్‌లు ఎవరూ మీ ఖాతాతో అనుబంధించబడి లేరని నిర్ధారించుకోవడానికి ఛానెల్ అనుమతులను చెక్ చేయండి.
  4. బ్యానర్, వీడియో వివరణలలోని లింక్‌లు, లేదా పిన్ చేసిన కామెంట్‌ల వంటివి వేటిని అయినా మీ ఛానెల్‌లో హ్యాకర్ మార్చారా అని చెక్ చేయండి.

క్రియేటర్ భద్రతా కేంద్రంలో లేదా మీ YouTube ఖాతాను సురక్షితంగా ఉంచుకోండి ఆర్టికల్‌కు వెళ్లి హ్యాకర్‌ల నుండి మీ ఖాతాను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8518406417857333117
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false