చెల్లని ట్రాఫిక్ కారణంగా నా 'YouTube కోసం AdSense' ఖాతా డిజేబుల్ అయ్యింది

ట్రాఫిక్ చెల్లుబాటవుతుందా లేదా చెల్లుబాటు కాదా అని గుర్తించడానికి మా సిస్టమ్‌లు క్రమం తప్పకుండా వీడియోలకు సంబంధించిన ట్రాఫిక్‌ను రివ్యూ చేస్తాయి. చెల్లని ట్రాఫిక్ అంటే మీ ఛానెల్‌లో రియల్ యూజర్‌కు లేదా నిజమైన ఆసక్తి ఉన్న యూజర్‌కు సంబంధించని యాక్టివిటీ అని అర్థం. దీనిలో యాడ్ ఆదాయాన్ని బూస్ట్ చేయడానికి మోసపూరిత, ఆర్టిఫిషియల్, లేదా ఉద్దేశపూర్వకంగా పాటించని మార్గాలు కూడా ఉండవచ్చు, కానీ లిస్ట్ వీటికి మాత్రమే పరిమితం కాదు. మీరు ఉద్దేశపూర్వకంగా చెల్లని ట్రాఫిక్‌ను పొందనప్పటికీ, అది మీ ఛానెల్‌ను ప్రభావితం చేయవచ్చు. 

మీ 'YouTube కోసం AdSense' ఖాతా చెల్లని ట్రాఫిక్‌తో అనుబంధించబడిందని కనుగొంటే, మేము మీ ఖాతాను డిజేబుల్ చేయవచ్చు. మీ ఖాతాను డిజేబుల్ చేయడం వలన క్రియేటర్‌లు, అడ్వర్టయిజర్‌లు, వీక్షకుల కోసం మా ప్లాట్‌ఫామ్ సురక్షితంగా ఉంటుంది. చెల్లని ట్రాఫిక్ బారి నుండి మా అడ్వర్టయిజింగ్ సిస్టమ్‌లను రక్షించడం ద్వారా, అడ్వర్టయిజర్‌లు YouTube మీద నమ్మకంతో యాడ్‌లను చూపుతారు, ఫలితంగా మీ వంటి క్రియేటర్‌లు, కంటెంట్‌ను మానిటైజ్ చేయడంలో అది సహాయపడుతుంది. 

చెల్లని ట్రాఫిక్ కారణంగా నా ఖాతా డిజేబుల్ అయిన తర్వాత, అది మళ్లీ పునరుద్ధరించబడుతుందా?

చాలా సందర్భాలలో, మా సిస్టమ్‌లు చెల్లని ట్రాఫిక్ గురించి ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకుంటాయి. కానీ, ఈ నిర్ణయం పొరపాటున తీసుకోవడం జరిగిందని మీరు భావిస్తే, మీరు చెల్లని యాక్టివిటీ విషయంలో అప్పీల్‌ను సమర్పించవచ్చు. చెల్లని ట్రాఫిక్‌కు మీరు, మీరు ప్రాతినిధ్యం వహించే వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణం కాలేదని మీరు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. 

మేము మీ అప్పీల్‌ను అందుకున్నప్పుడు, మాకు అందించిన సమాచారాన్ని జాగ్రత్తగా రివ్యూ చేసి, తుది నిర్ణయాన్ని మీకు అందిస్తాము. మీ ఖాతా పునరుద్ధరించబడుతుందనే ఖచ్చితమైన హామీ ఇవ్వలేమని గమనించండి. మీ అప్పీల్‌పై మేము ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, తర్వాతి అప్పీల్స్‌ను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు.

చెల్లని ట్రాఫిక్ విషయంలో అప్పీల్‌ను సమర్పించేటప్పుడు అది విజయవంతం కావడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఏమిటి? 

  • చెల్లని ట్రాఫిక్‌లకు సంబంధించిన ఉదాహరణలను రివ్యూ చేయండి. ఇక్కడ పేర్కొన్న ఏవైనా కారణాలు మీకు లేదా మీ కంటెంట్‌కు వర్తిస్తాయా? ఎవరైనా మీ యాడ్‌లను చాలాసార్లు క్లిక్ చేశారా? చెల్లని ట్రాఫిక్‌కు దారితీసే ట్రాఫిక్‌ను మీరు కొనుగోలు చేశారా? చెల్లని ట్రాఫిక్‌ను మళ్లీ పొందకుండా నివారించడానికి మీరు కంటెంట్‌కు లేదా ప్రవర్తనాపరమైన మార్పులు చేయగలరా?
  • చెల్లని యాక్టివిటీ అప్పీల్ ఫారమ్‌లో, డిజేబుల్ చేయబడిన మీ 'YouTube కోసం AdSense' ఖాతాతో అనుబంధించబడిన ఈమెయిల్ అడ్రస్‌ను షేర్ చేయండి. ఫారమ్‌లో ఇమెయిల్‌ను షేర్ చేయడం వలన, అది మీ ఖాతాను కనుగొని, మీ అప్పీల్‌ను ప్రాసెస్ చేయడంలో ఆలస్యాన్ని తగ్గించడంలో మాకు సహాయపడుతుంది.
  • మీ వీడియోలలో చెల్లని ట్రాఫిక్‌కు కారణం అయ్యే అవకాశం ఉన్న కారణాలను గుర్తించండి. చెల్లని ట్రాఫిక్‌ను మళ్లీ పొందకుండా మీరు ఎలా చూసుకుంటారో కూడా షేర్ చేయండి. మీ కేస్‌ను వివరించడానికి వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వండి.
    • ఉదాహరణకు, మీ ప్రేక్షకులను పెంచుకోవడానికి మీరు థర్డ్-పార్టీ నుండి ట్రాఫిక్‌ను కొనుగోలు చేసి ఉంటే, దాని గురించి మాకు చెప్పండి. మీరు ఈ థర్డ్-పార్టీతో పని చేయడం ఎలా నిలిపివేశారు, అలాగే భవిష్యత్తులో ఛానెల్ ప్రమోషన్ కోసం థర్డ్-పార్టీలతో పని చేయకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే సమాచారాన్ని షేర్ చేయండి.  

నా ఖాతా డిజేబుల్ చేయబడింది, నా అప్పీల్ తిరస్కరించబడింది. నేను మళ్లీ ప్రోగ్రామ్‌లో తిరిగి చేరవచ్చా లేదా కొత్త ఖాతాను తెరవవచ్చా?

మీ ఖాతా విషయంలో తీసుకున్న చర్యలకు సంబంధించి మీ ఆందోళనను మేము అర్థం చేసుకున్నాము. మా అడ్వర్టయిజర్‌లు, క్రియేటర్‌లు, వీక్షకుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని మా నిపుణుల టీమ్ జాగ్రత్తగా దర్యాప్తు చేసి, నిర్ధారించిన తర్వాత మాత్రమే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

చెల్లని ట్రాఫిక్ కారణంగా డిజేబుల్ చేయబడిన క్రియేటర్‌లకు ఇకపై AdSenseలో పాల్గొనడానికి అనుమతి ఉండదు. ఈ కారణంగా, ఈ క్రియేటర్‌లకు కొత్త ఖాతాలను తెరిచే అవకాశం ఉండదు.

ఏదైనా సోర్స్ నుండి చెల్లని ట్రాఫిక్‌ను పొందడంతో సహా, ఇతర ఏ కారణం చేతనైనా ఖాతాను డిజేబుల్ చేసే హక్కు Googleకు ఉంది.

మరొక డిజేబుల్ చేయబడిన ఖాతాకు అనుబంధించబడిన నా ఖాతా ఎందుకు డిజేబుల్ చేయబడింది?

సంబంధిత ఖాతా డిజేబుల్ చేయబడినట్లయితే, మీ ఖాతా మా క్రియేటర్‌లకు, వీక్షకులకు, అడ్వర్టయిజర్‌లకు రిస్క్ కలిగిస్తుందని మా నిపుణులు కనుగొన్నారు.

నేను ఇప్పటికీ నా 'YouTube కోసం AdSense' ఆదాయాన్ని పొందవచ్చా?

చెల్లని ట్రాఫిక్ లేదా మా పాలసీల ఉల్లంఘనల కారణంగా మీ ఖాతా డిజేబుల్ చేయబడితే, చెల్లనిదిగా గుర్తించబడని ఆదాయ భాగాన్ని ఫైనల్ పేమెంట్ రూపంలో పొందడానికి మీరు అర్హులు కావచ్చు. ఖాతా డిజేబుల్ అయిన తర్వాత, 30 రోజులు పేమెంట్‌ను హోల్డ్‌లో ఉంచడం జరుగుతుంది, తద్వారా మేము ఫైనల్ పేమెంట్‌ను (ఏదైనా ఉంటే) లెక్కించగలము. ఈ 30-రోజుల వ్యవధి తర్వాత, మీ మిగిలిన అర్హత గల బ్యాలెన్స్‌ను (ఏదైనా ఉంటే) చూడటానికి, పేమెంట్‌ను పొందడం కోసం YouTube కోసం AdSenseకు సైన్ ఇన్ చేయండి. చెల్లని ట్రాఫిక్, క్రియేటర్ పాలసీ ఉల్లంఘనల కారణంగా మీ ఫైనల్ బ్యాలెన్స్ నుండి డిడక్షన్‌లు చేసి, వాటిని సముచితమైన, సాధ్యమైన సందర్భాలలో ప్రభావితమైన అడ్వర్టయిజర్‌లకు రీఫండ్ చేయడం జరుగుతుంది.

నేను అందుకున్న పేమెంట్‌ల కోసం ఇప్పటికీ ట్యాక్స్ ఫారమ్‌లను పొందుతానా?

కింద పేర్కొన్న సందర్భాలలో మీరు ఇప్పటికీ మా నుండి ట్యాక్స్ ఫారమ్‌ను పొందవచ్చు: 

  • గతంలో మా నుండి పేమెంట్‌ను అందుకుంటే, లేదా 
  • మీ ఖాతాలో, పే చేయాల్సిన బ్యాలెన్స్ మిగిలి ఉంటే

మీ YouTube కోసం AdSense ఆదాయం విషయంలో ట్యాక్స్‌లను పే చేయడం గురించి మరింత తెలుసుకోండి.

నా ఖాతా పునరుద్ధరించబడింది. అయినా నా సైట్‌లలో, యాప్‌లలో లేదా వీడియోలలో యాడ్‌లు ఎందుకు ప్రదర్శించబడటం లేదు?

మీ ఖాతాను పునరుద్ధరించిన తర్వాత, యాడ్‌లను అందించడం కొనసాగించడానికి 48 గంటల వరకు సమయం పట్టవచ్చు. 

గమనిక: మీ YouTube ఛానెల్‌ను మీ 'YouTube ఖాతా కోసం AdSense'తో మళ్లీ అనుబంధించాల్సి రావచ్చు. పేమెంట్‌ల కోసం YouTube కోసం AdSense ఖాతాను సెటప్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2364247058806311699
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false