YouTubeలో మల్టీ-వ్యూతో పలు స్ట్రీమ్‌లను ఒకేసారి చూడండి

స్మార్ట్ టీవీలో లేదా Chromecast లేదా Fire TV Stick వంటి స్ట్రీమింగ్ పరికరంలో ఒకేసారి గరిష్ఠంగా నాలుగు ముందుగా ఎంచుకున్న స్ట్రీమ్‌లను చూసే వీలును మీకు మల్టీ-వ్యూ కల్పిస్తుంది.

YouTubeలో NFL సండే టికెట్ గేమ్‌లను చూడండి - USలో మాత్రమే

మల్టీ-వ్యూస్‌ను ఎక్కడ కనుగొనాలి, వాటికి ఎలా నావిగేట్ అవ్వాలి, ఇంకా మరిన్నింటి గురించి మీరు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోవచ్చు.

మల్టీ-వ్యూస్‌ను కనుగొనడం

ప్రీ-సెట్ మల్టీ-వ్యూస్ అనేవి గరిష్ఠంగా నాలుగు లైవ్ గేమ్‌లు కలిగిన గ్రూప్‌లు, అవి ఒకే స్ట్రీమ్‌గా కలిపి డిస్‌ప్లే చేయబడతాయి.

ఎంచుకున్న గేమ్‌ల కాంబినేషన్ కోసం మల్టీ-వ్యూను వేగవంతంగా కనుగొనగల మార్గాలు:

  1. మీరు చూడాలనుకుంటున్న గేమ్‌లలో ఒకదాన్ని చూడటం ప్రారంభించండి.
  2. మల్టీ-వ్యూ కాంబినేషన్‌లను చూడటానికి కిందికి నొక్కండి.
  3. ముందుగా ఎంచుకున్న ఆప్షన్‌ల నుండి మీ ప్రాధాన్య గేమ్ కాంబినేషన్‌ను ఎంచుకోండి.
గమనిక: కొన్ని సందర్భాల్లో, మీరు వెతుకుతున్న కాంబినేషన్‌ను కనుగొనడంలో సహాయపడటానికి మీరు నిర్దిష్ట గేమ్‌లను ఎంచుకోవచ్చు.

మల్టీ-వ్యూస్, మీ స్ట్రీమింగ్ పరికరంలో లేదా స్మార్ట్ టీవీలోని YouTube యాప్‌లో కనిపించవచ్చు. “సిఫార్సు చేసిన మల్టీ-వ్యూస్” దిగువున ఉన్న మొదటి  ట్యాబ్, మీరు లైవ్ గేమ్‌లను చూస్తున్నప్పుడు సిఫార్సు చేయబడిన వీడియోల సిఫార్సులు కూడా ఇందులో ఉంటాయి. NFL, NBA, లేదా WNBA వంటి మల్టీ-వ్యూస్ అందుబాటులో ఉన్న Primetime ఛానెల్ హోమ్ పేజీలో కూడా మీరు వాటిని కనుగొనవచ్చు.

మల్టీ-వ్యూస్‌ను చూడటం & నావిగేట్ చేయడం

మీరు చూడాలనుకునే మల్టీ-వ్యూను ఎంచుకుంటే, అందులో చేర్చి ఉన్న గేమ్‌లు మీ స్క్రీన్‌లో తెరవబడతాయి. ఎడమ వైపున లేదా ఎగువ ఎడమ వైపున ఉన్న స్ట్రీమ్ ఆటోమేటిక్‌గా హైలైట్ అవుతుంది, అలాగే అందులోని ఆడియో ప్లే అవుతుంది.

మల్టీ-వ్యూస్‌కు ఎలా నావిగేట్ అవ్వాలి అనే దానికి సంబంధించిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఆడియోను మార్చడానికి, మీ రిమోట్‌లోని దిశలు కలిగిన ప్యాడ్‌ను ఉపయోగించి వేరే స్ట్రీమ్‌ను హైలైట్ చేయండి.
  • మీ మల్టీ-వ్యూస్‌లోని క్యాప్షన్‌లు, ఆడియో ట్రాక్‌ను యాక్సెస్ చేయడానికి, క్యాప్షన్‌లు లేదా ఆడియో ట్రాక్‌ను టోగుల్ చేయడం కోసం ప్లేయర్ కంట్రోల్స్‌ను చేరుకునే వరకు కిందికి నొక్కుతూ ఉండండి.
  • ఎంచుకున్న స్ట్రీమ్‌ను ఫుల్ స్క్రీన్‌లో చూడటానికి, మీ రిమోట్‌లో 'ఎంచుకోండి' అనే ఆప్షన్‌ను నొక్కండి.
  • మల్టీ-వ్యూకు తిరిగి వెళ్లడానికి, మీ రిమోట్‌లో వెనుకకు అనే ఆప్షన్‌ను నొక్కండి.

మల్టీ-వ్యూ గురించి మరింత తెలుసుకోండి

మల్టీ-వ్యూలో ఏ గేమ్‌లు చూడాలో నేను ఎంచుకోవచ్చా?

లేదు. మీరు ప్రస్తుతం మీ మల్టీ-వ్యూ స్ట్రీమ్‌లను అనుకూలంగా మార్చుకోలేరు. కానీ మీరు విస్తృతమైన స్ట్రీమ్‌లలో కావాల్సిన వాటిని ఎంచుకోవచ్చు, ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు ముందుగానే ఎంచుకున్న ఆప్షన్‌లను తగ్గించడానికి నిర్దిష్ట గేమ్‌లను ఎంచుకోవచ్చు.
మల్టీ-వ్యూను టెలివిజన్‌లో అందరికీ అందుబాటులో ఉంచడం మా లక్ష్యం. చాలా పరికరాలలో నేటివ్ మల్టీ-వ్యూ సౌలభ్యం లేనందున, మేము వీడియో ఫీడ్‌ల ప్రాసెసింగ్ అంతటినీ మా సర్వర్‌లలోనే చేసే ఆప్షన్‌ను ఎంచుకున్నాము. మల్టీ-వ్యూలో చూసే ప్రతి ఒక్క యూనిక్ కాంబినేషన్, కంప్యుటేషనల్ రిసోర్స్‌లను, డేటా కేంద్రం రిసోర్స్‌లను పరిమితంగా ఉపయోగిస్తుందని దీని అర్థం. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన, లోకల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, లోకల్ ఫీడ్‌లతో కూడిన కాంబినేషన్‌ల సంఖ్యలో మాకు పరిమితులు ఉన్నాయి. అంచనా వేసిన పాపులారిటీ మేరకు మేము బెస్ట్ కాంబినేషన్‌లను సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే మా ప్రాసెస్‌లను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉన్నాము.

ఏ పరికరాలు మల్టీ-వ్యూను సపోర్ట్ చేస్తాయి?

Primetime ఛానెల్స్‌ను సపోర్ట్ చేసే స్ట్రీమింగ్ పరికరాలు, స్మార్ట్ టీవీలలో మల్టీ-వ్యూ అందుబాటులో ఉంటుంది. మల్టీ-వ్యూ మొబైల్, వెబ్‌లోని YouTubeలో ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4661521163614054904
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false