పొందుపరిచిన వీడియోలలో యాడ్‌లు

క్రియేటర్ ఆదాయాన్ని పెంచడం కోసం మీ వీడియోకు ముందు లేదా తర్వాత చూపే యాడ్ ఫార్మాట్‌లకు సంబంధించిన ఎంపికలను మేము సరళీకృతం చేశాము. ముందస్తు, అనంతర, స్కిప్ చేయదగిన, స్కిప్ చేయదగని యాడ్‌లకు సంబంధించిన విడి విడి యాడ్ ఎంపికలను మేము తీసివేశాము. ఇప్పుడు, మీరు నిడివి ఎక్కువ ఉన్న కొత్త వీడియోలకు యాడ్‌లను ఆన్ చేసినప్పుడు, తగిన సమయంలో మీ వీక్షకులకు మేము ముందస్తు, అనంతర, స్కిప్ చేయదగిన, లేదా స్కిప్ చేయదగని యాడ్‌లను చూపుతాము. అందరికీ స్టాండర్డ్‌గా ఉండేలా, యాడ్ ఫార్మాట్‌లన్నింటినీ సిఫార్సు చేసిన బెస్ట్ ప్రాక్టీసు ఆన్ చేసేలా ఈ మార్పు చేస్తుంది. మధ్యలో వచ్చే యాడ్‌లకు సంబంధించిన మీ ఎంపికలు మారలేదు. మీరు మానిటైజేషన్ సెట్టింగ్‌లను మారిస్తే మినహా, ఇప్పటికే ఉన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియోలకు సంబంధించిన మీ యాడ్ ఎంపికలను మేము అలాగే ఉంచుతాము.

పొందుపరిచిన వీడియోలు స్కిప్ చేయదగిన లేదా స్కిప్ చేయలేని ఇన్-స్ట్రీమ్ యాడ్స్‌ను చూపవచ్చు. మీ స్వంత వెబ్‌సైట్ లేదా యాప్‌తో సహా, వీడియోలను పొందుపరిచే ఏ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ అయినా, మీకు ఆదాయాన్ని జెనరేట్ చేయవచ్చు. YouTube యాడ్ ఫార్మాట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

పొందుపరిచిన వీడియోలలో యాడ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

మీరు మీ ఛానెల్‌కు యాడ్‌లను ఆన్ చేసినప్పుడు, ఇతర వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లలో పొందుపరిచిన YouTube వీడియో ప్లేయర్‌లో ప్రదర్శించబడే యాడ్‌ల నుండి వచ్చే ఆదాయాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. 'youtube.com'లోని వీడియోలకు యాడ్‌లు ఎనేబుల్ అవ్వడానికి ఏ సెట్టింగ్‌లు ఉపయోగించారో, పొందుపరిచిన వీడియోలకు అవే సెట్టింగ్‌లు ఉంటాయని గమనించండి.

మీ YouTube, YouTube కోసం AdSense ఖాతాలను మీరు అనుసంధానం చేసి, వీడియోలు పొందుపరచడాన్ని ఎనేబుల్ చేసి ఉంటే, మీ వీడియోలలో యాడ్‌లు ప్రదర్శించే ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఎనేబుల్ చేయబడుతుంది. 'youtube.com' లోని వీడియోలకు యాడ్‌లు ఎనేబుల్ అవ్వడానికి ఏ సెట్టింగ్‌లు ఉపయోగించారో, పొందుపరిచిన వీడియోలకు అవే సెట్టింగ్‌లు ఉంటాయని గమనించండి.

మీ పొందుపరిచిన వీడియోలలో యాడ్‌లు ప్రదర్శించబడకూడదు అని మీరు భావిస్తే, పొందుపరిచిన వీడియోలలో మాత్రమే నేరుగా యాడ్‌లను ఆఫ్ చేసే సదుపాయం అందుబాటులో లేదు. అలాంటప్పుడు, మీరు పొందుపరచడాన్నే పూర్తిగా ఆఫ్ చేయవచ్చు.

యాడ్‌లు చూపడానికి పొందుపరిచిన వీడియోలకు ఉండవలసిన అర్హతలు

యాడ్‌లు బ్రాండ్‌కు సురక్షితమైన సైట్‌లలో ప్రదర్శించబడతాయి: మా ప్రధాన సూత్రాలన్నింటినీ గౌరవించే సైట్‌లలో మా అడ్వర్టయిజర్‌ల బ్రాండ్‌లు కనిపించేలా చేసేందుకు YouTube ఎంతో శ్రద్ధతో పని చేస్తోంది. పొందుపరిచిన YouTube వీడియోలలో 'స్ట్రీమ్‌లో యాడ్‌ల'ను ఆన్ చేయాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు, మీ వెబ్‌సైట్‌లతో పాటు వాటిలోని కంటెంట్ వివిధ అంశాలకు అనుగుణంగా ఉందా లేదా అని మా సిస్టమ్‌లు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాయి. పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఇమేజ్‌లు, హింస, అనుచితమైన, అలాగే విద్వేషపూరితమైన భాష వంటి కంటెంట్ విషయంలో, అలాగే అతిక్రమణను ప్రమోట్ చేసే సైట్‌ల విషయంలో మేము రూపొందించిన కఠినమైన గైడ్‌లైన్స్ సెట్ కూడా ఈ అంశాలలో భాగంగా ఉంటుంది.

ప్లేయర్ వివరాలు: సానుకూల యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రమోట్ చేయడానికి, వీడియో ప్లేయర్ తగినంత పెద్దగా కనిపించేలా ఉండాలని మేము కోరుకుంటున్నాము. 200x200 పిక్సెల్ లేదా అంత కన్నా పెద్ద ప్లేయర్‌ను ఉపయోగించాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. అంతే కాకుండా, వీడియోలను స్టాండర్డ్ 'క్లిక్-టు-ప్లే పొందుపరచు' పద్ధతిలో పొందుపరచాలి, 'స్క్రిప్ట్ చేయబడిన ప్లే' పద్ధతిలో కాదు.

పొందుపరిచిన వీడియోలకు సంబంధించిన రెవెన్యూ షేరింగ్

పొందుపరిచిన వీడియోలలో ప్రదర్శించబడే యాడ్స్ నుండి కేవలం YouTube, ఇంకా వీడియో ఓనర్ మాత్రమే ఆదాయాన్ని సంపాదిస్తారు. వీడియో ఏ సైట్‌లో అయితే పొందుపరిచి ఉందో, ఆ సైట్ ఓనర్‌కు ఆదాయంలో షేర్ దక్కదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13171869131865888448
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false