కనిపించని లేదా తీసివేయబడిన కామెంట్‌ల గురించి తెలుసుకోండి

YouTubeలో కమ్యూనిటీని బిల్డ్ చేయడంలో కామెంట్‌లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కానీ మీ కామెంట్‌లు కనిపించకపోవచ్చు లేదా తీసివేయబడవచ్చు. అలా కావడానికి సంబంధించిన కొన్ని కారణాల గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చదవండి.

నా కామెంట్ కనిపించడం లేదు

మీరు టాప్ కామెంట్‌లలో మీ కామెంట్‌ను కనుగొనలేకపోతే, "మొదట అత్యంత కొత్తవి" ఆధారంగా కామెంట్‌లను క్రమపద్ధతిలో అమర్చండి.

  1. కామెంట్‌లకు స్క్రోల్ చేయండి.
  2. దీని ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి ఆ తర్వాత మొదట అత్యంత కొత్తవి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ కామెంట్‌ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి. మీ కామెంట్ 'మొదట అత్యంత కొత్తవి' వీక్షణలో కనిపించకుంటే, అది పాలసీ ఉల్లంఘన కారణంగా తీసివేయబడి ఉండవచ్చు లేదా ఛానెల్ ద్వారా మోడరేట్ చేయబడి ఉండవచ్చు.

టాప్ కామెంట్‌లు & మెంబర్‌ల కామెంట్‌ల గురించి

కామెంట్ టెక్స్ట్, హ్యాండిల్ టెక్స్ట్, ఛానెల్ పేరు టెక్స్ట్, అవతార్, వీక్షకులు, వీడియో వంటి వివిధ సంకేతాల ఆధారంగా వీక్షకులు వేటినైతే విలువైనవిగా భావించి, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందో వాటిని టాప్ కామెంట్‌ల వీక్షణ చూపుతుంది.

మెంబర్‌ల కామెంట్‌ల వీక్షణ, ఛానెల్ మెంబర్‌ల నుండి వచ్చిన కామెంట్‌లను చూపుతుంది, అది ముందుగా సరికొత్త కామెంట్‌లు ఉండేలా క్రమపద్ధతిలో అమర్చబడి ఉంటుంది.

గమనిక: మెంబర్‌ల కామెంట్‌లను Android మొబైల్ పరికరాలలో ప్రత్యేకంగా చూడవచ్చు.

వీక్షకులు విలువైనదిగా భావించని లేదా వారు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేదని YouTube గుర్తించే కంటెంట్‌ను, టాప్ కామెంట్‌ల వీక్షణ, మెంబర్‌ల కామెంట్‌ల వీక్షణ రెండూ, చూపకపోవచ్చు. కామెంట్ టెక్స్ట్, కామెంట్ చేసిన వ్యక్తి ఛానెల్ పేరు టెక్స్ట్ లేదా హ్యాండిల్ టెక్స్ట్, అవతార్, ఛానెల్ మోడరేషన్ సెట్టింగ్‌ల వంటి వివిధ సంకేతాల ఆధారంగా అనుచితమయ్యే అవకాశమున్న, స్పామ్, లేదా మరొక వ్యక్తిలా నటిస్తూ చేసిన కామెంట్‌లను ఇందులో చేర్చవచ్చు. టాప్ కామెంట్స్ వీక్షణలో ఉన్నప్పుడు, ఛానెల్ మెంబర్‌ల నుండి వచ్చిన టాప్ కామెంట్‌లను 'మెంబర్‌ల ద్వారా కామెంట్‌లు' అనే ప్రత్యేక విభాగంలో మరింత కనిపించేలా చేయవచ్చు.

కామెంట్‌ల నియంత్రణ, తీసివేతల గురించి తెలుసుకోండి

మీ కామెంట్ కనిపించకపోవడానికి సంబంధించిన కొన్ని కారణాల గురించి ఇక్కడ తెలుసుకోండి:

  • ఆటోమేటిక్ తీసివేత: మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మా ఆటోమేటిక్ డిటెక్షన్ సిస్టమ్‌లు కామెంట్‌లను నిరంతరం స్కాన్ చేస్తాయి. మీ కామెంట్ మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తున్నట్లు మా సిస్టమ్ గుర్తిస్తే, కామెంట్ తీసివేయబడుతుంది.
గమనిక: తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో కామెంట్‌లను పోస్ట్ చేయడం, ఒకే కామెంట్‌ను పదే పదే పోస్ట్ చేయడం, లింక్‌లను షేర్ చేయడం, లేదా ఎమోజి లేదా అసాధారణ అక్షరాలను అధికంగా ఉపయోగించడం వంటివి స్పామ్‌గా గుర్తించబడి, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినందుకు తీసివేయబడతాయి.
  • రిపోర్ట్‌లు: ఎవరైనా మీ కామెంట్‌ను రిపోర్ట్ చేసి, అది మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తే, అది తీసివేయబడుతుంది.
  • ఛానెల్ మోడరేషన్:
    • ఛానెల్ అన్ని కామెంట్‌లను లేదా అనుచితమయ్యే అవకాశమున్న కామెంట్‌లను రివ్యూ కోసం హోల్డ్‌లో ఉంచవచ్చు. ఛానెల్ కామెంట్‌లను రివ్యూ కోసం హోల్డ్‌లో ఉంచినప్పుడు, దాన్ని పబ్లిష్ చేసే ముందు ఛానెల్ ఓనర్ లేదా మోడరేటర్ దాన్ని ఆమోదించాలి. ఆటోమేటిక్ సెట్టింగ్‌గా ఛానెల్స్ అనుచితమైన కామెంట్‌లను రివ్యూ చేయడానికి ఆటోమేటిక్‌గా అవి హోల్డ్‌లో ఉంచబడతాయి.
    • ఛానెల్‌కు సంబంధించిన కామెంట్‌లలో చూపకూడదనుకునే పదాలు, పదబంధాలను ఛానెల్ ఎంచుకోవచ్చు. మీ కామెంట్ బ్లాక్ చేసిన పదం లేదా పదబంధాన్ని కలిగి ఉంటే, అది చూపబడదు.
    • ఛానెల్ మీ కామెంట్‌ను తీసివేయగలదు.

మీరు ఛానెల్ ఓనర్‌గా ఉండి, మీ వీడియోలపై చేసిన కామెంట్‌లు తీసివేయబడితే, కామెంట్‌లలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘనలు గుర్తించబడి ఉండవచ్చు.

సంబంధిత ఆర్టికల్స్

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12322533503948629399
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false