దేశం వారీ పాస్-త్రూలు

దేశం వారీ పాస్-త్రూలను 2023లో అమలు చేసే ఆలోచన ప్రస్తుతానికి YouTubeకు లేదు.

ప్రపంచంలోని కొన్ని దేశాలలో, YouTubeలో కంటెంట్‌ను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది, థర్డ్-పార్టీ హక్కుల లైసెన్సింగ్, రెగ్యులేటరీ ఫీజులు, ఇంకా ప్లాట్‌ఫామ్ పన్నుల వంటి అంశాలకు సంబంధించిన ధరలపై ఆధారపడి ఉంటుంది. మా ఆపరేషన్‌లు సుదీర్ఘ కాలం పాటు స్థిరంగా కొనసాగేలా చూసుకోవడానికి, మానిటైజ్ చేస్తున్న మా పార్ట్‌నర్‌లతో ఈ దేశం వారీ పాస్-త్రూ ఖర్చులలో కొన్నింటిని మేము షేర్ చేయడం ప్రారంభించవచ్చు.

ఈ ధరలను 2023లో అమలు చేసే ఆలోచన ప్రస్తుతానికి మాకు లేదు. ఈ ధరలను మేము షేర్ చేయడం ప్రారంభించినప్పుడు, దేశం వారీగా వర్తించే ధరలు ఏవైనా ఉంటే, ఆ ధరలతో సహా వాటిని మేము ఎలా లెక్కిస్తాము అనేది కనీసం 45 రోజుల ముందుగానే మీకు తెలియజేస్తాము. ఈ ధరలు నిర్దిష్ట దేశాలతో అనుబంధించబడి ఉంటాయి కాబట్టి, ధరల డిడక్షన్ అనేది మీరు ఆ దేశంలో ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అనే దానికి ప్రపోర్షనల్‌గా ఉంటుంది.

గమనిక: దేశం వారీ పాస్-త్రూల ద్వారా థర్డ్-పార్టీ హక్కులకు సంబంధించిన లైసెన్సింగ్ ధరలను షేర్ చేయడం, హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీల ప్రకారం మ్యూజిక్ హక్కుల క్లియరెన్స్‌కు సంబంధించిన డిడక్షన్‌లు, రెండూ వేర్వేరు. ఒకే హక్కులకు సంబంధించిన లైసెన్సింగ్ ధరలను కవర్ చేయడానికి, మేము దేశం వారీ పాస్-త్రూ ఖర్చును, అలాగే హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీని రెండింటినీ ఎప్పటికీ డిడక్ట్ చేయము.

ఇది ఎలా పని చేస్తుంది

దేశం వారీ పాస్-త్రూ ఖర్చుల వర్తింపు అనేది నిర్దిష్ట దేశంపై ఆధారపడి ఉంటుంది, అది మానిటైజేషన్ ఆన్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్‌లన్నింటికీ వర్తిస్తుంది. కేవలం నిడివి ఎక్కువ ఉన్న వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చేసే క్రియేటర్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిన ఒక మామూలు ఊహాత్మక ఉదాహరణను ఇక్కడ అందించాము:

ఊహాత్మక ఉదాహరణ

X అనే దేశం, ఆ దేశంలో సంపాదించిన YouTube అడ్వర్టయిజింగ్ ఆదాయానికి వర్తించే ప్లాట్‌ఫామ్ పన్నును అమలు చేసింది. 

  • X దేశంలో, పార్ట్‌నర్ అప్‌లోడ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోలలో ప్రదర్శించబడిన యాడ్‌ల ద్వారా వచ్చిన నికర ఆదాయం ఆధారంగా, దేశం వారీ పాస్-త్రూ ఖర్చు $1గా నిర్ణయించబడింది. 
  • ఆదాయ షేరింగ్‌ను వర్తింపజేశాక, పార్ట్‌నర్ $0.55 పే చేస్తారు, YouTube $0.45ను కవర్ చేస్తుంది.
  • ఆదాయ షేరింగ్‌ను లెక్కించక ముందు దేశం వారీ పాస్-త్రూ ఖర్చులను డిడక్ట్ చేసి, YouTube, ఇంకా పార్ట్‌నర్‌లు, వర్తించే ఆదాయ షేరింగ్ ఆధారంగా ఈ ధరలను షేర్ చేసుకుంటున్నారు.

పైన పేర్కొన్న ఉదాహరణలో ఒకే 'దేశం వారీ పాస్-త్రూ ఖర్చు'ను చూపడం జరిగినప్పటికీ, పార్ట్‌నర్‌లు పలు 'దేశం వారీ పాస్-త్రూ ఖర్చుల'ను భరించాల్సి రావచ్చు, తమ కంటెంట్‌పై ఆదాయం, ఈ ధరలు వర్తించే ఒకటి కంటే ఎక్కువ దేశాల ద్వారా వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది.

YouTube నుండి నోటిఫికేషన్

ఈ ధరలను YouTube షేర్ చేయడం ప్రారంభించినప్పుడు, దేశం వారీగా వర్తించే ధరలు ఏవైనా ఉంటే, ఆ ధరలతో సహా వాటిని మేము ఎలా లెక్కిస్తాము అనేది కనీసం 45 రోజుల ముందుగానే మీకు తెలియజేస్తాము. దేశం వారీ పాస్-త్రూ ఖర్చులకు సంబంధించి ఏవైనా డిడక్షన్‌లను కూడా ప్రతి నెల రిపోర్ట్ చేయడం జరుగుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

మ్యూజిక్‌కు సంబంధించిన కాపీరైట్ ధరలు, దేశం వారీ పాస్-త్రూలకు అనుగుణంగా ఉంటాయా?

లేదు. దేశం వారీ పాస్-త్రూల ద్వారా థర్డ్-పార్టీ హక్కులకు సంబంధించిన లైసెన్సింగ్ ధరలను షేర్ చేయడం, హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీల ప్రకారం మ్యూజిక్ హక్కుల క్లియరెన్స్‌కు సంబంధించిన డిడక్షన్‌లు, రెండూ వేర్వేరు. ఒకే హక్కులకు సంబంధించిన లైసెన్సింగ్ ధరలను కవర్ చేయడానికి, మేము దేశం వారీ పాస్-త్రూ ఖర్చును, అలాగే హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీని రెండింటినీ ఎప్పటికీ డిడక్ట్ చేయము.

మ్యూజిక్‌తో మీ వీడియోలను మానిటైజ్ చేయడం ఇప్పటికీ సంబంధిత వీడియో ఫార్మాట్‌కు వర్తించే మానిటైజేషన్ పాలసీలకు లోబడి ఉంటుంది. నిడివి ఎక్కువ ఉన్న వీడియోలలో Creator Musicను ఉపయోగించడం గురించి, అలాగే మ్యూజిక్‌తో Shortsను మానిటైజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

దేశం వారీ పాస్-త్రూలు నా లొకేషన్‌ను బట్టి వర్తింపజేయబడతాయా?

లేదు. ఏ దేశాలలో అయితే YouTubeలో కంటెంట్‌ను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది, థర్డ్-పార్టీ హక్కుల లైసెన్సింగ్, రెగ్యులేటరీ ఫీజులు, ఇంకా ప్లాట్‌ఫామ్ పన్నుల వంటి అంశాలకు సంబంధించిన ధరలపై ఆధారపడి ఉంటుందో, ఆ దేశాలకు మాత్రమే అవి వర్తింపజేయబడతాయి. అంటే, ఈ ధరలు, అవి ఏ దేశంలో అయితే అమలు చేయబడ్డాయో, ఆ దేశంలో మీరు సంపాదించే ఆదాయానికి మాత్రమే వర్తిస్తాయి.

నాకు ఏ దేశం వారీ పాస్-త్రూలు వర్తిస్తాయో నాకు ఎలా తెలుస్తుంది?

దేశం వారీ పాస్-త్రూలను 2023లో అమలు చేసే ఆలోచన ప్రస్తుతానికి మాకు లేదు. ఈ ధరలను మేము షేర్ చేయడం ప్రారంభించినప్పుడు, దేశం వారీగా వర్తించే ధరలు ఏవైనా ఉంటే, ఆ ధరలతో సహా వాటిని మేము ఎలా లెక్కిస్తాము అనేది కనీసం 45 రోజుల ముందుగానే మీకు తెలియజేస్తాము. దేశం వారీ పాస్-త్రూ ఖర్చులకు సంబంధించి ఏవైనా డిడక్షన్‌లను కూడా ప్రతి నెల రిపోర్ట్ చేయడం జరుగుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10628834831151452691
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false