చాప్టర్ & దాటవేసే ఫీచర్‌లను ఉపయోగించండి

మీ మొబైల్ పరికరంలో YouTube కంటెంట్‌ను అన్వేషించడానికి నావిగేషన్ చిట్కాలు

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

 

YouTube చాప్టర్, దాటవేసే ఫీచర్‌లతో, మీరు చూస్తున్న వీడియోకు మీరు వేగంగా, సులభంగా నావిగేట్ అవ్వవచ్చు. దాటవేసే ఫీచర్ అనేది, మీరు స్క్రబ్బర్‌ను ఉపయోగించేటప్పుడప, ప్రోగ్రెస్ బార్‌లోని ఎరుపు రంగు చుక్క వీడియోలో మీ స్థానాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది.

చాప్టర్‌ల వారీగా వీడియోలను చూడండి

క్రియేటర్ చాప్టర్‌లను వారి వీడియోకు జోడించినప్పుడు, మీరు వివిధ చాప్టర్‌లను ఎంచుకోవడం ద్వారా మీరు వీడియోలను నావిగేట్ చేయవచ్చు. ఈ చాప్టర్‌లు వీడియోను వివిధ విభాగాలుగా విభజిస్తాయి.

నిర్దిష్ట చాప్టర్‌కు వెళ్లడానికి:

  1. ప్రోగ్రెస్ బార్‌ను తెరవడానికి, వీడియోపై క్లిక్ చేయండి. 
  2. స్క్రబ్బర్‌ను (ఎరుపు రంగు చుక్క) వివిధ చాప్టర్‍లలో ఒక దానికి తరలించండి. చాప్టర్‌లు ప్రోగ్రెస్ బార్‌లో వర్టికల్ లైన్‌తో మార్క్ చేయబడతాయి. మీరు ఒక విభాగం నుండి మరొక విభాగానికి మారినప్పుడు చాప్టర్ టైటిల్ కనిపిస్తుంది. 
  3. చాప్టర్ నుండి వీడియోను ప్రారంభించడానికి ప్లే చేయండి ను క్లిక్ చేయండి. 

మీరు వీడియో వివరణ దిగువునకు స్క్రోల్ చేయడం ద్వారా కూడా చాప్టర్‌లను కనుగొనవచ్చు.

వీడియోలో అతి ఎక్కువగా రీప్లే చేసిన భాగాలకు వెళ్లండి

మీరు దాటవేయడాన్ని ప్రారంభించినప్పుడు, ప్రోగ్రెస్ బార్‌కు ఎగువున గ్రాఫ్ కనిపిస్తుంది. గ్రాఫ్, వీడియోలో ఏ భాగాలను అతి తరచుగా మళ్లీ చూశారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. గ్రాఫ్ ఎత్తుగా ఉంటే, వీడియోలోని ఆ భాగం తరచుగా రీప్లే చేయబడిందని అర్థం.

వీడియో ఇలా ఉంటే, ప్రోగ్రెస్ బార్ ఎగువున గ్రాఫ్ కనిపించకపోవచ్చు:
  • ఛానెల్‌పై ఏవైనా స్ట్రయిక్‌లు యాక్టివ్‌గా ఉన్నట్లయితే.
  • కంటెంట్ అనుచితమయ్యే అవకాశమున్నదిగా ఉంటే.
  • వీడియో చాలా కొత్తది అయినా గానీ, లేదా చాలా తక్కువ వీక్షణలు కలిగి ఉండటం వంటి ఇతర కారణాల వల్ల గానీ మా సిస్టమ్‌లు దానిని అనర్హమైనదిగా పరిగణిస్తాయి.

ఖచ్చితమైన పాయింట్‌కు దాటవేసే మోడ్

ఖచ్చితమైన పాయింట్‌కు దాటవేసే మోడ్ అనేది, వీడియోలో నిర్దిష్ట భాగానికి వెళ్లగలిగేలా వీడియోను దాటవేయడాన్ని సులభం చేస్తుంది.

Use precise seeking to find a specific moment in a video ft. Lyanna Kea 📌 📺

ఖచ్చితమైన పాయింట్‌కు దాటవేసే మోడ్‌ను ఉపయోగించడానికి:

  1. ప్రోగ్రెస్ బార్ స్క్రీన్‌పై కనిపించేలా చూడటానికి స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.
  2. స్క్రబ్బర్ (ఎరుపు రంగు చుక్క) నుండి పైకి స్లయిడ్ చేయండి.
  3. మీకు ప్రోగ్రెస్ బార్ కింద థంబ్‌నెయిల్స్ అడ్డు వరుస కనిపిస్తుంది.

ఎక్కడ దాటవేయాలో ఎంచుకోవడానికి:

  1. మీకు థంబ్‌నెయిల్స్ అడ్డు వరుస కనిపించిన తర్వాత, ప్లేబ్యాక్ స్థానాన్ని సర్దుబాటు చేయడానికి మీరు వాటిపై లేదా స్క్రబ్బర్‌పై స్వైప్ చేయవచ్చు.
  2. ఎంచుకున్న లొకేషన్ నుండి ప్లే చేయడాన్ని ప్రారంభించడానికి, ప్లే బటన్‌ను లేదా థంబ్‌నెయిల్స్ పైన ఎక్కడైనా ట్యాప్ చేయండి.
  3. దాటవేయడాన్ని రద్దు చేయడానికి, X బటన్‌ను ట్యాప్ చేయండి.

దాటవేయడాన్ని రద్దు చేయడానికి రిలీజ్ చేయండి

మీరు దాటవేసేటప్పుడు, మీరు ఈ చర్యను రద్దు చేయాలని నిర్ణయించుకోవచ్చు, అలాగే మీరు వీడియోను ఎక్కడి వరకు అయితే చూశారో మళ్లీ అక్కడి నుండి చూడటానికి తిరిగి వెళ్లవచ్చు. దాటవేయడాన్ని రద్దు చేయడానికి:

  1. మీరు ఎక్కడి వరకు అయితే చూశారో మళ్లీ అక్కడకు వెళ్లడానికి ప్రోగ్రెస్ బార్‌లోని స్క్రబ్బర్‌ను (ఎరుపు రంగు చుక్క) తరలించండి.
  2. మీరు వైబ్రేషన్‌ను అనుభూతి చెందే వరకు వేచి ఉండండి, లేదా “రద్దు చేయడానికి వదలండి” నోటిఫికేషన్‌ను చూడండి.
  3. మీరు ఎక్కడి వరకు అయితే చూశారో మళ్లీ అక్కడకు తిరిగి వెళ్లడానికి మీ వేలును తీసివేయండి.
గమనిక: ఈ ఫీచర్ మీ టాబ్లెట్‌లోని లేదా ఫోన్‌లోని YouTube యాప్‌నకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16982610078156528948
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false