YouTubeలో ఒక కోర్సు చేయండి

YouTubeలో వివరణాత్మకంగా, పలు అంశాలను నేర్పే ప్రోగ్రామ్‌లను అందించడానికి పాల్గొనే క్రియేటర్‌లకు కోర్సులు ఒక కొత్త మార్గం. చక్కగా ఆర్గనైజ్ చేసిన నేర్చుకునే వాతావరణంలో, నేర్చుకునే ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవుతూ క్రియేటర్‌ల నుండి నేర్చుకునే వీలును కోర్సులు కల్పిస్తాయి. YouTube అంతటా గల ఈ విభాగాలలో మీరు కోర్సులను కొనుగొనవచ్చు: 
  • మొదటి ట్యాబ్‌లోని ఫీడ్‌లో
  • తర్వాత చూడవలసిన దానిలో
  • సెర్చ్ ఫలితాలలో
  • పాల్గొనే క్రియేటర్ ప్లేలిస్ట్‌లలో
  • అన్వేషించండి కింద, కోర్స్‌లలో

ఆ కోర్సుకు గాను, పాల్గొనే క్రియేటర్‌లకు మీరు వన్ టైమ్ పేమెంట్ చేయాల్సి రావచ్చు, ఇతర కోర్సులు $0కు అందించబడతాయి. వన్ టైమ్ పేమెంట్ అవసరమైన కోర్సులు యాడ్-రహితంగా ఉంటాయి. $0కు అందుబాటులో ఉన్న కోర్సులలో యాడ్‌లు ఉండవచ్చు. కోర్సుల నుండి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం పాల్గొనే క్రియేటర్‌కు అందజేయబడుతుంది.

గమనిక: కోర్సుల ఫీచర్ బీటాలో ఉంది, ఇవి ప్రస్తుతం కొంత మంది క్రియేటర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో దేశాల్లో మాత్రమే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సును కొనడానికి వీక్షకులు తప్పనిసరిగా కంప్యూటర్‌ను లేదా Android పరికరాన్ని ఉపయోగించాలి. భవిష్యత్తులో మేము కోర్సులను మరింత మంది క్రియేటర్‌లకు, పరికరాలకు, దేశాలు/ప్రాంతాలలో రిలీజ్ చేయాలని ఆశిస్తున్నాము.

ఒక కోర్సును కొనుగోలు చేయండి

ఒక కోర్సును కొనుగోలు చేయడానికి, మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి, అలాగే మీరు తప్పనిసరిగా కంప్యూటర్ లేదా Android పరికరాన్ని ఉపయోగించాలి. కానీ, కోర్సును ఒకసారి కొనుగోలు చేశాక, YouTube అందుబాటులో ఉన్న ఏ పరికరంలో అయినా మీరు దానిని చూడవచ్చు. కొందరు క్రియేటర్‌లు, తమ కోర్సుతో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫైల్స్‌ను కూడా చేర్చవచ్చు. కోర్సులో చేర్చిన కొన్ని ఫైల్స్‌ను మీరు కంప్యూటర్‌లలో మాత్రమే డౌన్‌లోడ్ చేయగలరు, కానీ ఆ ఫైల్స్‌ను ఇతర పరికరాలలో ప్రివ్యూ చేయవచ్చు.

కోర్సును కొనుగోలు చేయడానికి:

  1. కంప్యూటర్ లేదా Android పరికరాన్ని ఉపయోగించి కోర్సుకు వెళ్లండి.
  2. కోర్సును కొనుగోలు చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. తర్వాత అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అయ్యి, మీ పేమెంట్ వివరాలను ఎంటర్ చేసి, కోర్సును కొనుగోలు చేయండి.
గమనిక: కోర్సును కొనుగోలు చేయడం ద్వారా, మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు మీరు వెరిఫై చేస్తున్నారు, అలాగే ఈ నియమాలకు అంగీకరిస్తున్నారు. మా రీఫండ్ పాలసీ ప్రకారం, పరిమిత సందర్భాలలో మాత్రమే రీఫండ్‌లు అందుబాటులో ఉంటాయి.

కొనుగోలు చేసిన కోర్సును కనుగొనండి

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, దానిని మీ కొనుగోళ్ల కింద కనుగొనవచ్చు. కొనుగోలు చేసిన కోర్సును కనుగొనడానికి:

  1. సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ కోర్సులు “కొనుగోళ్లు” అనే విభాగం కింద లిస్ట్ చేయబడతాయి.

కోర్సుకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

మీరు కొనుగోలు చేసిన కోర్సుకు సంబంధించిన వీడియోలు లేదా ఫీచర్‌లు పని చేయకపోతే, మీకు రీఫండ్ పొందే అర్హత ఉండవచ్చు. మీరు మీ కోర్సును చూసి ఉండకపోతే, కొనుగోలు చేసిన 7 పని దినాలలోపు మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. మేము మీ రీఫండ్ రిక్వెస్ట్‌ను మంజూరు చేస్తే, మేము మీ డబ్బును తిరిగి ఇస్తాము, అలాగే కోర్సుకు యాక్సెస్‌ను తీసివేస్తాము. కొనుగోలు చేసిన కోర్సుకు సంబంధించిన రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి:

  1. సెట్టింగ్‌లు   అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సంబంధిత కోర్సు పక్కన ఉన్న, మరిన్ని  ఆ తర్వాత “కొనుగోలుతో సమస్య ఉందా?” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
  4. రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
గమనిక: YouTube Android యాప్‌లో చేసిన కోర్సు కొనుగోళ్లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవడానికి, మీకు ఎలా బిల్ చేయబడుతుందో అర్థం చేసుకోవడానికి pay.google.com లింక్‌కు వెళ్లండి. Google Play ద్వారా చేసిన కొనుగోళ్లు Google Play రీఫండ్ పాలసీలకు లోబడి ఉంటాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9155840111653442361
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false