టీవీలో లొకేషన్ షేరింగ్ & ప్లేబ్యాక్ ఏరియా

YouTube Primetime ఛానెల్స్‌లో కొన్ని క్రీడలు, షోలు, ఇంకా ఇతర కంటెంట్‌ను చూడటానికి, మీరు లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేసి, మీ ప్లేబ్యాక్ ఏరియాను సెట్ చేయాలి. మీ లొకేషన్‌ను వెరిఫై చేయడం అవసరం, ఎందుకంటే కొన్నిసార్లు మీరు చూసే కంటెంట్ మీ లొకేషన్‌పై ఆధారపడి ఉంటుంది.

మీరు ఇప్పటికే లొకేషన్ షేరింగ్‌ను ఎనేబుల్ చేసి, కేవలం మీ ప్లేబ్యాక్ ఏరియాను మాత్రమే అప్‌డేట్ చేయాల్సి ఉంటే, ఈ దశలను ఫాలో అవ్వండి. మీకు ఏవైనా ఎర్రర్ మెసేజ్‌లు ఎదురైతే, ఈ దశలు సహాయపడగలవు.

NFL సండే టికెట్‌లో లైవ్ లేదా రాబోయే గేమ్ వంటి, లొకేషన్ వెరిఫికేషన్ అవసరమైన ప్రోగ్రామ్‌ను చూడటానికి మీరు ఎంచుకున్నప్పుడు, మీ లొకేషన్‌ను వెరిఫై చేయడానికి మొబైల్ పరికరంలో లొకేషన్ షేరింగ్‌ను ఉపయోగించాల్సిందిగా సూచించే ప్రాంప్ట్ మీకు కనిపిస్తుంది. పూర్తయిన తర్వాత, ఇది మీ “ప్లేబ్యాక్ ఏరియా”ను సెట్ చేస్తుంది.

మీ టీవీలో Primetime ఛానెల్స్‌ను చూడటానికి లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయడం ఎలా

మీ టీవీలో మీరు YouTube యాప్‌ను ఉపయోగిస్తుంటే, మీ లొకేషన్‌ను వెరిఫై చేసి, మీ ప్లేబ్యాక్ ఏరియాను సెట్ చేయడానికి మీ టీవీ ఇంకా మొబైల్ పరికరం రెండూ మీకు అవసరం. మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో మీ మొబైల్ వెబ్ బ్రౌజర్‌కు సంబంధించిన లొకేషన్ షేరింగ్‌ను మీరు ఆన్ చేయాలి. ఇది మీ టీవీలోని YouTube యాప్‌ను మీ లొకేషన్‌ను వెరిఫై చేయాడానికి అనుమతిస్తుంది.

మీ బ్రౌజర్‌లో లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయండి

మీ కంప్యూటర్‌లో NFL సండే టికెట్‌తో సహా Primetime ఛానెల్స్‌ను చూడటానికి, లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయడానికి కింది దశలను ఫాలో అవ్వండి.

  1. Chrome Chrome‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, మెనూ  లేదా మరిన్ని  ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత సైట్ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లొకేషన్‌ను క్లిక్ చేసి, నిర్దిష్ట సైట్‌ల కోసం లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయండి లేదా మీ లొకేషన్‌ను అడగడానికి సైట్‌లను అనుమతించండి.

మీరు ఇప్పుడే Chromeలో లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేసి, మీరు చూడటానికి ట్రై చేస్తున్న వీడియో ప్లే అవ్వకపోతే, లొకేషన్ షేరింగ్ అనుమతులు వర్తింపజేసినట్లు నిర్ధారించుకోవడానికి వీడియోను కొత్త ట్యాబ్‌లో తెరవండి. వీడియో ఇప్పటికీ ప్లే అవ్వకపోతే, Chrome తాజా వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసి, మళ్లీ ట్రై చేయండి.

మీరు Chromeను కాకుండా వేరే బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, లొకేషన్ అనుమతులను మార్చడానికి మీ బ్రౌజర్ సెట్టింగ్‌లను చెక్ చేయండి. కింది ఇంటర్నెట్ బ్రౌజర్‌లలోని లొకేషన్ షేరింగ్ అనుమతుల గురించి మరింత తెలుసుకోండి:

macOSలో లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయండి

పైన పేర్కొన్న దశలను ఫాలో అయినా కూడా ఫలితం లేకపోతే, మీ macOS వెర్షన్ 13.5.1 లేదా అంతకంటే కొత్త వెర్షన్ అని నిర్ధారించుకోండి. మీ macOSను అప్‌గ్రేడ్ చేయడానికి:
 
Apple మెనూ  తెరవండి ఆ తర్వాత సిస్టమ్ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత సాధారణం ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

macOSలో యాప్‌ల కోసం లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయడానికి:

  1. Apple మెనూ  తెరవండి ఆ తర్వాత సిస్టమ్ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత గోప్యత & సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత లొకేషన్ సర్వీస్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. మీ బ్రౌజర్ కోసం లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయడానికి బటన్‌ను క్లిక్ చేయండి. బటన్ నీలం రంగులోకి మారుతుంది.

మీ టీవీలో మీ ప్లేబ్యాక్ ఏరియాను వెరిఫై చేయండి లేదా మార్చండి

మీ మొబైల్ బ్రౌజర్‌కు సంబంధించి లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేసిన తర్వాత, మీ టీవీలో చూడటానికి కంటెంట్‌ను ఎంచుకోండి. ‘మీ ప్రస్తుత ప్లేబ్యాక్ ఏరియాను వెరిఫై చేయండి’ అనే మెసేజ్ మీకు వస్తే, ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. మొబైల్ బ్రౌజర్ నుండి youtube.com/locate లింక్‌కు వెళ్లండి ఆ తర్వాత మీ టీవీ లేదా స్ట్రీమింగ్ పరికరంలో మీరు సైన్ ఇన్ చేసిన అదే Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. 
    • చిట్కా: మీ ఖాతాకు చెందిన ఈమెయిల్ అడ్రస్ మీ టీవీ స్క్రీన్‌పై సెట్టింగ్‌లు ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు ఆప్షన్ కింద కనిపించాలి.
  2. సైన్ ఇన్ చేసిన తర్వాత, మీ బ్రౌజర్‌కు సంబంధించి లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయడానికి మీకు పాప్‌అప్ కనిపించాలి. తర్వాత ఆ తర్వాత అనుమతించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ మొబైల్ పరికరంలో youtube.com/locate పేజీని రిఫ్రెష్ చేయండి ఆ తర్వాత మీ టీవీలో యాప్ నుండి నిష్క్రమించి, మళ్లీ తెరవండి.

మీ టీవీలో అప్‌డేట్ అవ్వడం మీకు కనిపించకపోతే, మీ మొబైల్ బ్రౌజర్ ఇంకా టీవీ రెండింటిలో మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ఆ తర్వాత, మీ టీవీలో యాప్ నుండి నిష్క్రమించి, మళ్లీ తెరవడానికి ట్రై చేయండి. ఇది ఇప్పటికీ పని చేయకపోతే, మీ కాష్ ఇంకా కుక్కీలను క్లియర్ చేసి, మళ్లీ ట్రై చేయండి.

‘ఏరియా అప్‌డేట్ అందుబాటులో లేదు' వంటి ఎర్రర్ మెసేజ్‌లను పరిష్కరించండి
“బ్రౌజర్ లొకేషన్ అనుమతులను ఆన్ చేయండి” లేదా “ఏరియా అప్‌డేట్ అందుబాటులో లేదు” అనే ఎర్రర్ మెసేజ్ మీకు కనిపిస్తున్నట్లయితే, ఈ దశలను ట్రై చేయండి:
  1. పైన పేర్కొన్న దశలతో మీ మొబైల్ పరికరం, మొబైల్ బ్రౌజర్‌కు సంబంధించి లొకేషన్ షేరింగ్ ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.
  2. youtube.com/locate లింక్‌లోని దశలను ఫాలో అవ్వడానికి మీరు కంప్యూటర్‌ను కాకుండా మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.
  3. మీ టీవీలో YouTube యాప్ నుండి నిష్క్రమించి, తిరిగి తెరిచి, మళ్లీ ట్రై చేయండి.
  4. మీ సెట్టింగ్‌లలో వెర్షన్‌ను చెక్ చేయడం ద్వారా మీ మొబైల్, టీవీ పరికరాలు అప్‌డేట్ అయ్యి ఉన్నాయని నిర్ధారించుకోండి.
  5. మీ మొబైల్ పరికరంలో కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేసి, మళ్లీ ట్రై చేయండి.

ప్రసారం చేయడంలో సమస్యలను పరిష్కరించండి

ప్రసారం చేస్తున్నప్పుడు మీ లొకేషన్‌ను వెరిఫై చేయడంలో మీకు ఏదైనా సమస్య ఎదురైతే, వీటిని ట్రై చేయండి:

  • మళ్లీ ప్రసారం చేయడం, పైన పేర్కొన్న దశలను ఫాలో అవ్వడం.
  • మీ బ్రౌజర్‌కు సంబంధించి కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేసి (youtube.com కోసం), మళ్లీ ప్రసారం చేయడం.
  • మొబైల్‌లోని YouTube యాప్‌లో, మీ టీవీలోని YouTube యాప్‌లో మీరు ఒకే ఖాతాకు లాగిన్ అయ్యారని నిర్ధారించుకోండి.

మీ టీవీకి ప్రసారం చేయడం కోసం లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయండి

మీ మొబైల్ పరికరం, మీ టీవీలోని YouTube యాప్ రెండింటిలో మీరు ఒకే ఖాతాకు సైన్ ఇన్ చేశారని, అలాగే పైన పేర్కొన్న దశలను ఫాలో అవ్వడం ద్వారా మీ మొబైల్ బ్రౌజర్ ఇంకా YouTube యాప్ రెండింటికీ లొకేషన్ షేరింగ్‌ను ఎనేబుల్ చేశారని నిర్ధారించుకోండి. తర్వాత:

  1. మీ మొబైల్ పరికరంలో ప్రోగ్రామ్‌ను తెరిచి, ప్రోగ్రామ్‌ను మీ టీవీకి ప్రసారం  చేయండి.
  2. మీ టీవీలోని YouTube యాప్‌లో ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి. 
  3. YouTube యాప్‌నకు సైన్ ఇన్ చేసిన అదే ఖాతాను ఉపయోగించి మొబైల్ వెబ్ బ్రౌజర్‌లో youtube.com/locate లింక్‌ను తెరవండి. 
  4. మీ మొబైల్ పరికరం నుండి లొకేషన్‌ను విజయవంతంగా అందించిన తర్వాత మీ టీవీ ఆటోమేటిక్‌గా ప్లే అవ్వడం ప్రారంభించాలి.
మీ స్మార్ట్ టీవీలో మీ ప్లేబ్యాక్ ఏరియా తప్పుగా ఉంటే దాన్ని అప్‌డేట్ చేయండి
మీ స్మార్ట్ టీవీలో మీ ప్లేబ్యాక్ ఏరియా సేవ్ అయిన తర్వాత, అది తప్పు అని మీరు కనుగొంటే, మీ పరికర సెట్టింగ్‌లకు వెళ్లి మీరు దాన్ని ఎడిట్ చేయవచ్చు లేదా క్లియర్ చేయవచ్చు:
  1. మీ స్మార్ట్ టీవీలో YouTube యాప్‌ను తెరవండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్లేబ్యాక్ ఏరియా ఆప్షన్‌కు వెళ్లండి.
  3. మీ లొకేషన్‌ను మార్చండి:
    • ఎడిట్ చేయడానికి పెన్సిల్ చిహ్నాన్ని ఎంచుకొని, మీ జిప్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
    • మీ ప్రస్తుత ప్లేబ్యాక్ ఏరియాను సెట్ చేసి, వెరిఫై చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీ స్మార్ట్ టీవీలో మీ ప్లేబ్యాక్ ఏరియాను క్లియర్ చేయండి

మీ ప్లేబ్యాక్ ఏరియాను క్లియర్ చేయడానికి:

  1. మీ టీవీలో YouTube యాప్‌ను తెరవండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్లేబ్యాక్ ఏరియాను క్లియర్ చేయండి ఆప్షన్‌కు వెళ్లండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5634535680986571699
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false