లైసెన్స్ ట్రాక్‌లు

Creator Music ఫీచర్ ప్రస్తుతం U.S. క్రియేటర్‌లకు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో అందుబాటులో ఉంది. U.S. బయట ఉండే YPP క్రియేటర్‌లకు విస్తరించే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
గమనిక: ఈ ఆర్టికల్‌లో వివరించిన ఫీచర్‌లు వెబ్ బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

Creator మ్యూజిక్‌తో, కొన్ని పాటలకు లైసెన్స్ పొందవచ్చు, అంటే క్రియేటర్‌లు ముందస్తు ఫీజును పే చేసి (లేదా కొన్ని ట్రాక్‌లకు ఫీజు ఉండదు) వారి వీడియోలో మ్యూజిక్‌ను ఉపయోగించవచ్చు, అలాగే వీడియో ఆదాయంలో పూర్తి వాటాను వారే ఉంచుకోవచ్చు.

లైసెన్స్ పొందాలనుకునే మ్యూజిక్‌కు కనుగొనండి

మీరు లైసెన్స్ పొందగల ట్రాక్‌లను కనుగొనడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. హోమ్ లేదా బ్రౌజ్ చేయండి పేజీలలో, సెర్చ్ బార్ కు వెళ్లి, పాట టైటిల్ లేదా ఆర్టిస్ట్ పేరు వంటి సెర్చ్ క్వెరీలను ఎంటర్ చేయండి.
  4. మీ సెర్చ్ ఫలితాల ఎగువున లైసెన్స్ అందుబాటులో ఉంది బాక్స్‌ను ఎంచుకోండి.
వీటిని గుర్తుంచుకోండి:
  • హోమ్ పేజీలో, మీరు ఫీచర్ చేయబడిన లైసెన్స్ పొందగలిగే ట్రాక్‌లలో లైసెన్స్ పొందగల ట్రాక్‌లను కనుగొనవచ్చు.
  • లైసెన్స్ పొందగల ట్రాక్‌లు ధరతో వాటి పక్కన లిస్ట్ చేయబడతాయి.
  • లైసెన్స్‌ను కొనుగోలు చేయాలని మీకు లేకపోతే, మీ వీడియో ఆదాయ షేరింగ్ వినియోగ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నప్పుడు, లైసెన్స్ పొందగల ట్రాక్‌లకు ఆదాయాన్ని షేర్ చేసే అర్హత కూడా లభించవచ్చు.

లైసెన్స్‌ను పొందండి

లైసెన్స్ పొందగల ట్రాక్‌ను మీరు కనుగొన్న తర్వాత, మీరు దానికి లైసెన్స్ పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

  • Creator Musicలో
  • అప్‌లోడ్ చేస్తున్న సమయంలో
  • అప్‌లోడ్ చేసిన తర్వాత
Creator మ్యూజిక్‌లో

Creator మ్యూజిక్‌లో ట్రాక్‌లకు లైసెన్స్ పొందడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. మీరు లైసెన్స్ పొందాలనుకుంటున్న ట్రాక్‌ను కనుగొనండి.
  4. "మరిన్ని చర్యలు"  ఆ తర్వాత లైసెన్స్‌ను కొనుగోలు చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  5. లైసెన్స్ వివరాలను రివ్యూ చేయండి.
    • పెయిడ్ లైసెన్స్‌లు: లైసెన్స్‌ను కొనుగోలు చేయండి ఆ తర్వాత పేమెంట్ సమాచారాన్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇప్పుడే పేమెంట్ చేయండి ఆ తర్వాత ట్రాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఉచిత లైసెన్స్‌లు: డౌన్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. లైసెన్స్‌ను ఉపయోగించడానికి, అప్‌లోడ్ చేస్తున్నప్పుడే మీ వీడియోకు లైసెన్స్‌ను జోడించండి.
అప్‌లోడ్ చేస్తున్న సమయంలో

Creator Music ట్రాక్‌ను ఉపయోగించే వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు, మీరు అప్‌లోడ్ చేస్తున్న వీడియో ఫైల్‌లో లైసెన్స్ సమాచారాన్ని జోడించాల్సి ఉంటుంది. మీరు ఇంకా లైసెన్స్‌ను కొనుగోలు చేసి ఉండకపోతే, అప్‌లోడ్ సమయంలో కూడా దానిని చేయవచ్చు. మీరు ఇదంతా వీడియో ఎలిమెంట్‌ల పేజీలో చేయవచ్చు:

  1. వెబ్ బ్రౌజర్‌లో వీడియోను అప్‌లోడ్ చేయడం ప్రారంభించండి.
  2. వీడియో ఎలిమెంట్‌ల పేజీలో, మ్యూజిక్ లైసెన్స్‌లను జోడించండి అనే విభాగంలో, జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు అప్‌లోడ్ చేస్తున్న వీడియోలో మీరు ఉపయోగించిన ట్రాక్‌లను కనుగొనండి.
    • మీరు ఇప్పటికే కొనుగోలు చేసిన ట్రాక్‌ల కోసం, కొనుగోలు చేసినవి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు ఇప్పటికే కొనుగోలు చేసిన ట్రాక్‌ల కోసం, డౌన్‌లోడ్ చేసినవి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీ లైబ్రరీలో మీరు సేవ్ చేసిన ట్రాక్‌ల కోసం, సేవ్ చేసినవి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. డౌన్‌లోడ్ చేసిన లేదా సేవ్ చేసిన ట్రాక్‌ల కోసం, ధరను క్లిక్ చేయండి. కొనుగోలు చేసిన ట్రాక్‌ల కోసం, జోడించండి క్లిక్ చేసి, 6వ దశకు స్కిప్ చేయండి.
  5. లైసెన్స్ వివరాలను రివ్యూ చేయండి.
    • పెయిడ్ లైసెన్స్‌లు: లైసెన్స్‌ను కొనుగోలు చేయండి ఆ తర్వాత పేమెంట్ సమాచారాన్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇప్పుడే పేమెంట్ చేయండి ఆ తర్వాత లైసెన్స్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఉచిత లైసెన్స్‌లు: లైసెన్స్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. లైసెన్స్ మీ వీడియోకు జోడించబడిందని నిర్ధారించుకోవడానికి వీడియో కాపీరైట్ వివరాల పేజీని రివ్యూ చేయండి.
    • మరిన్ని లైసెన్స్‌లు జోడించడానికి, పైన ఉన్న 2-5 దశలను రిపీట్ చేయండి.
  7. అప్‌లోడ్‌కు తిరిగి వెళ్లండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, అప్‌లోడ్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

వీటిని గుర్తుంచుకోండి:

  • చెకప్ దశలలో Creator Music ట్రాక్‌లు ఉంటే, మీరు చెకప్ దశల పేజీ నుండి కూడా లైసెన్స్‌లను జోడించవచ్చు. చెకప్ దశల పేజీలో, లైసెన్స్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, లైసెన్స్ పొందే దశలను పూర్తి చేయండి.మీరు వీడియో ఎలిమెంట్‌ల పేజీలో ఇప్పటికే లైసెన్స్‌ను జోడించి ఉంటే, చెకప్ దశల పేజీలో లైసెన్స్ కనిపిస్తుంది.
  • విజిబిలిటీ పేజీలో, మీ వీడియో గోప్యతా సెట్టింగ్‌లు ప్రైవేట్‌కు లేదా అన్‌లిస్టెడ్‌కు సెట్ చేసి ఉంటే, లేదా వీడియో డ్రాఫ్ట్‌లో ఉంటే, మీరు జోడించిన లైసెన్స్‌లు ఏవైనా ఉంటే వాటిని తీసివేసి, ఇతర వీడియోలకు జోడించడం జరుగుతుంది. వీడియోను పబ్లిక్‌కు సెట్ చేసిన తర్వాత, ఇలా చేయడం సాధ్యం కాదు. లైసెన్స్‌లను తీసివేయడం ఎలాగో తెలుసుకోండి.
అప్‌లోడ్ చేసిన తర్వాత

అప్‌లోడ్ చేసిన తర్వాత ట్రాక్‌లకు లైసెన్స్‌ను పొందడానికి, వీడియో పబ్లిష్ అయిన తర్వాత కొంత సమయం వరకు మాత్రమే సాధ్యమవుతుంది. అప్‌లోడ్ చేసిన తర్వాత లైసెన్స్‌ను పొందడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో కంటెంట్ ను ఎంచుకోండి.
  3. మీరు లైసెన్స్‌ను పొందాలనుకుంటున్న ట్రాక్ గల వీడియోను కనుగొనండి.
  4. వీడియో థంబ్‌నెయిల్‌ను క్లిక్ చేయండి.
  5. ఎడమ వైపు మెనూలో, కాపీరైట్ ను ఎంచుకోండి.
    • పెయిడ్ లైసెన్స్‌లు: లైసెన్స్‌ను కొనుగోలు చేయండి ఆ తర్వాత పేమెంట్ సమాచారాన్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇప్పుడే పేమెంట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఉచిత లైసెన్స్‌లు: లైసెన్స్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
 
చిట్కా: లైసెన్స్‌ను ఎలా ఉపయోగించాలి అనే దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కోసం మీకు ఈమెయిల్ చేసిన రసీదును చెక్ చేయండి. వినియోగ వివరాలను Creator మ్యూజిక్‌లో కూడా మీరు చెక్ చేయవచ్చు. లైసెన్స్‌లకు సంబంధించిన వినియోగ వివరాల గురించి మీరు మరింత తెలుసుకోండి.

లైసెన్స్‌ను తీసివేయండి

వీడియో గోప్యతా సెట్టింగ్‌లు ప్రైవేట్‌కు లేదా అన్‌లిస్టెడ్‌కు సెట్ చేసి ఉంటే, లేదా వీడియో డ్రాఫ్ట్‌లో ఉంటే, ఆ వీడియోకు జోడించిన లైసెన్స్‌లు ఏవైనా ఉంటే వాటిని తీసివేసి, ఇతర వీడియోలకు జోడించడం జరుగుతుంది. వీడియోను పబ్లిక్‌కు సెట్ చేసిన తర్వాత, ఇలా చేయడం సాధ్యం కాదు.

లైసెన్స్‌ను తీసివేయడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో కంటెంట్ ను ఎంచుకోండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న లైసెన్స్ గల వీడియోను కనుగొనండి.
  4. పరిమితుల నిలువు వరుసలో, జోడించిన లైసెన్స్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  5. రివ్యూ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. చర్యలు  ఆ తర్వాత లైసెన్స్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. లైసెన్స్‌ను తీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
లైసెన్స్ తీసివేయబడిన తర్వాత, వీడియోలో ఉపయోగించిన లైసెన్స్ పొందగల ట్రాక్ ఇకపై కాపీరైట్ క్లెయిమ్‌ల నుండి రక్షించబడదు. వీడియోల నుండి, క్లెయిమ్ చేసిన కంటెంట్‌ను తీసివేయడం ఎలాగో మీరు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11771151837551468784
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false