ట్రాక్‌లను కనుగొని, వాటి ప్రివ్యూను చూడండి

Creator Music ఫీచర్ ప్రస్తుతం U.S. క్రియేటర్‌లకు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో అందుబాటులో ఉంది. U.S. బయట ఉండే YPP క్రియేటర్‌లకు విస్తరించే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
గమనిక: ఈ ఆర్టికల్‌లో వివరించిన ఫీచర్‌లు వెబ్ బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
Creator మ్యూజిక్‌లో, మీరు నిర్దిష్ట ట్రాక్ లేదా ఆర్టిస్ట్ కోసం సెర్చ్ చేయవచ్చు, మ్యూజిక్ శైలి, మూడ్ వంటి కేటగిరీలలో ట్రాక్‌లను బ్రౌజ్ చేయవచ్చు, లేదా లైసెన్స్ జారీ చేయడం, ఆదాయ విభజనలకు సంబంధించి ట్రాక్‌ల అర్హత ఆధారంగా వాటిని కనుగొనవచ్చు.

మీరు అన్వేషిస్తున్నప్పుడు, మీరు పాటల ప్రివ్యూను చూడవచ్చు, అలాగే మీ వీడియోలకు సరైన మ్యూజిక్‌ను కనుగొనడంలో మీకు సహాయపడటానికి వాటిని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి సమాచారాన్ని పొందవచ్చు.

ట్రాక్‌లను కనుగొనండి

మీరు Creator మ్యూజిక్‌లో ట్రాక్‌లను కనుగొనడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

ఫీచర్ చేసిన ట్రాక్‌లను అన్వేషించండి

మూడ్, మ్యూజిక్ శైలి, ఇతర ప్రమాణాల ఆధారంగా గ్రూప్ చేయబడిన ఫీచర్ చేసిన ట్రాక్‌లను చూడటానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. హోమ్ పేజీ‌లో, కింది విభాగాలలో దేనిలోనైనా ట్రాక్‌లను బ్రౌజ్ చేయండి:
    • ఫీచర్ చేసిన ఆదాయ విభజన ట్రాక్‌లు: ట్రాక్ హక్కుదారులతో ఆదాయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా మీ వీడియోను మానిటైజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ట్రాక్‌లు.
    • ఫీచర్ చేసిన కలెక్షన్‌లు: Creator మ్యూజిక్‌లోని జనాదరణ పొందిన ట్రాక్‌లు.
    • ఫీచర్ చేసిన లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌లు: మీ వీడియోకు సంబంధించి పూర్తి మానిటైజేషన్‌ను పొందడానికి మీరు లైసెన్స్ పొందగలిగే ట్రాక్‌లు.
    • మూడ్స్: సంతోషం, విచారం, అలాగే నాటకీయత వంటి ఒకే విధమైన మూడ్‌కు సంబంధించిన ట్రాక్‌లు.
    • మ్యూజిక్ శైలులు: యాంబియంట్, బ్లూస్, క్లాసికల్ వంటి మ్యూజిక్ శైలుల ఆధారంగా గ్రూప్ చేయబడిన ట్రాక్‌లు.
నిర్దిష్ట పాట లేదా ఆర్టిస్ట్ కోసం సెర్చ్ చేయండి

నిర్దిష్ట పాట లేదా ఆర్టిస్ట్ కోసం సెర్చ్ చేయడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. హోమ్ లేదా బ్రౌజ్ చేయండి పేజీలలో, సెర్చ్ బార్ కు వెళ్లి, పాట టైటిల్ లేదా ఆర్టిస్ట్ పేరు వంటి సెర్చ్ క్వెరీలను ఎంటర్ చేయండి.
మీరు లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌లను కనుగొనండి
మీరు లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌లను కనుగొనడానికి:
  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. హోమ్ లేదా బ్రౌజ్ చేయండి పేజీలలో, సెర్చ్ బార్ కు వెళ్లి, పాట టైటిల్ లేదా ఆర్టిస్ట్ పేరు వంటి సెర్చ్ క్వెరీలను ఎంటర్ చేయండి.
  4. మీ సెర్చ్ ఫలితాల ఎగువున లైసెన్స్ అందుబాటులో ఉంది బాక్స్‌ను ఎంచుకోండి.
వీటిని గుర్తుంచుకోండి:
  • హోమ్ పేజీలో, మీరు ఫీచర్ చేయబడిన లైసెన్స్ పొందగలిగే ట్రాక్‌లలో లైసెన్స్ పొందగల ట్రాక్‌లను కనుగొనవచ్చు.
  • లైసెన్స్ పొందగల ట్రాక్‌లు ధరతో వాటి పక్కన లిస్ట్ చేయబడతాయి.
  • లైసెన్స్‌ను కొనుగోలు చేయాలని మీకు లేకపోతే, మీ వీడియో ఆదాయ షేరింగ్ వినియోగ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నప్పుడు, లైసెన్స్ పొందగల ట్రాక్‌లకు ఆదాయాన్ని షేర్ చేసే అర్హత కూడా లభించవచ్చు.
ఆదాయాన్ని షేర్ చేసుకోగల ట్రాక్‌లను కనుగొనండి

ఆదాయ విభజనకు అర్హత ఉన్న ట్రాక్‌లను కనుగొనడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. ట్రాక్‌లు ఎక్కడ లిస్ట్ చేయబడినా, ఆదాయాన్ని షేర్ చేయండి చిహ్నం  కోసం చూడండి. 

వీటిని గుర్తుంచుకోండి:

  • హోమ్ పేజీలో, ఫీచర్ చేయబడిన ఆదాయ షేరింగ్ ట్రాక్‌లలో మీరు ఆదాయ షేరింగ్ ట్రాక్‌లను కనుగొనవచ్చు.
  • Creator మ్యూజిక్ నుండి ఆదాయ విభజన ట్రాక్‌లను డౌన్‌లోడ్ చేయడం సాధ్యపడదు.
  • మీ వీడియో ఆదాయ షేరింగ్ వినియోగ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉంటే, లైసెన్స్ పొందగల ట్రాక్‌లకు ఆదాయాన్ని షేర్ చేసే అర్హత కూడా లభించవచ్చు.
ట్రాక్‌లను కనుగొనడానికి ఫిల్టర్ చేసి, క్రమపద్ధతిలో అమర్చండి

ట్రాక్ లిస్ట్‌లను ఫిల్టర్ చేయండి

ట్రాక్‌ల లిస్ట్‌లను ఫిల్టర్ చేయడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. బ్రౌజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. కింద పేర్కొన్నా ఏదైనా కేటగిరీని క్లిక్ చేయండి:
    • మూడ్
    • మ్యూజిక్ శైలి
    • గాత్రాలు
    • BPM (బీట్స్ పర్ మినిట్)
    • వ్యవధి
    • ధర
  5. ఫిల్టర్‌లను ఎంచుకోండి ఆ తర్వాత వర్తింపజేయండి.

మీరు పలు కేటగిరీలలో ఒకటి కంటే ఎక్కువ ఫిల్టర్‌లను ఎంచుకోవచ్చు.

ట్రాక్ లిస్ట్‌లను క్రమపద్ధతిలో అమర్చండి

ట్రాక్‌ల లిస్ట్‌లను క్రమపద్ధతిలో అమర్చడానికి:

  1. బ్రౌజ్ చేయండి పేజీలో, ఉత్తమమైన మ్యాచ్ ను క్లిక్ చేయండి
  2. ఈ ప్రమాణాలలో దేని ఆధారంగానైనా మీ సెర్చ్ ఫలితాలను క్రమపద్ధతిలో అమర్చడానికి, ఉత్తమమైన మ్యాచ్, కొత్తవి, లేదా ధర (అతి తక్కువ) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ట్రాక్‌ల ప్రివ్యూను చూడండి

మీకు ఆసక్తి ఉన్న మ్యూజిక్‌ను మీరు కనుగొన్నప్పుడు, మీరు ట్రాక్‌ను ఉపయోగించే ముందు దాని ప్రివ్యూను చూడటానికి, అలాగే దాని గురించి సమాచారాన్ని పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

పాటను ప్లే చేయండి

  • Creator మ్యూజిక్‌లో వినండి: ఏదైనా ట్రాక్ లిస్ట్‌లో, ఆల్బమ్ పోస్టర్ ఇమేజ్‌పై మౌస్ కర్సర్ ఉంచి, "ప్లే చేయండి" ని క్లిక్ చేయండి.
  • YouTubeలో వినండి: YouTubeలో పాటను ప్లే చేయడానికి, ఏదైనా ట్రాక్ లిస్ట్‌లో, "మరిన్ని చర్యలు" ఆ తర్వాత YouTubeలో తెరవండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ట్రాక్ వినియోగ సమాచారాన్ని చెక్ చేయండి

వినియోగ చిహ్నాలు

ట్రాక్ వినియోగ సమాచారాన్ని త్వరగా చూడటానికి, Creator మ్యూజిక్‌లో ఈ చిహ్నాల కోసం చూడండి:

ఆదాయ విభజన కోసం అర్హత ఉంది. మీ వీడియోలో సదరు చిహ్నం ఉన్న ట్రాక్‌ను ఉపయోగించడం వలన మీ వీడియో, ఆదాయాన్ని ట్రాక్ హక్కుదారులతో షేర్ చేసుకోగలదని అర్థం. ఆదాయ విభజన గురించి మరింత తెలుసుకోండి.
మానిటైజేషన్‌కు అర్హత లేదు. మీ వీడియోలో సదరు చిహ్నం ఉన్న ట్రాక్‌ను ఉపయోగించడం వలన మీ వీడియో మానిటైజ్ చేయబడదు, కానీ YouTubeలో కనిపిస్తుంది.
 వీడియో బ్లాక్ చేయబడుతుంది. మీ వీడియోలో సదరు చిహ్నం ఉన్న ట్రాక్‌ను ఉపయోగించడం వలన మీ వీడియో YouTubeలో కనిపించదు.
గమనిక: లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌లు ధరతో లిస్ట్ చేయబడతాయి, ఉదాహరణకు $0.00 లేదా $9.99. లైసెన్స్ జారీ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

వినియోగ వివరాలు

లైసెన్స్ పొందగలిగిన లేదా ఆదాయ విభజనకు అర్హత ఉన్న ట్రాక్‌ల కోసం, మీరు ట్రాక్ వినియోగ వివరాలలో ట్రాక్‌లను ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు:

  1. లైసెన్స్ పొందగలిగిన లేదా ఆదాయ విభజనకు అర్హత ఉన్న ట్రాక్‌ను కనుగొనండి.
  2. లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌ల కోసం, ధరను క్లిక్ చేయండి. ఆదాయ విభజన ట్రాక్‌ల కోసం, "ఆదాయ విభజన వివరాలను చూడండి"  చిహ్నాన్ని క్లిక్ చేయండి.
    • మీరు ఏదైనా ట్రాక్ లిస్ట్ చేయబడిన చోటా "మరిన్ని చర్యలు"  ఆ తర్వాత వినియోగ వివరాలను చూడండి అనే ఆప్షన్‌ను కూడా క్లిక్ చేయవచ్చు.

వినియోగ వివరాల గురించి మరింత తెలుసుకోండి.

లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌ను డౌన్‌లోడ్ చేయండి

లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌లు డౌన్‌లోడ్ చేయబడతాయి, తద్వారా మీరు లైసెన్స్‌ను కొనుగోలు చేసే ముందు అవి మీ వీడియోలలో పని చేస్తాయో లేదో నిర్ధారించుకోవచ్చు. ఆదాయ విభజనకు అర్హత ఉన్నట్లు మార్క్ చేయబడిన ట్రాక్‌లను డౌన్‌లోడ్ చేయడం సాధ్యపడదు.

లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌ను డౌన్‌లోడ్ చేయడానికి:

  1. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న లైసెన్స్ పొందగలిగిన ట్రాక్‌ను కనుగొనండి.
  2. ఏదైనా ట్రాక్ లిస్ట్ లేదా ప్లేయర్ బార్ నుండి "మరిన్ని చర్యలు"  ఆ తర్వాత ట్రాక్‌ను డౌన్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. (ఆప్షనల్) లైసెన్స్‌కు సంబంధించిన వినియోగ వివరాలను చూడటానికి, వినియోగ వివరాలను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

లైసెన్స్ వినియోగ వివరాలలో పేర్కొన్న నియమాల ప్రకారం, ట్రాక్‌ను ఇప్పుడు మీ వీడియోలో ఉపయోగించవచ్చు.

మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? Creator Musicకు సంబంధించిన FAQలను చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15365957756577929381
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false