మీ వీడియోపై విధించిన వయోపరిమితికి ప్రతిగా అప్పీల్ చేయండి

YouTubeలో ఏ కంటెంట్ అనుమతించబడుతుందో, ఏది అనుమతించబడదో, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వివరిస్తాయి. ఇవి ప్రధాన నియమాలు, ప్రతి వీడియో వీటిని తప్పనిసరిగా అవలంబించాలి. ఈ గైడ్‌లైన్స్‌ను వీడియోలు ఉల్లంఘించినప్పుడు, మేము వాటిని తీసివేస్తాము. కొన్ని వీడియోలు మా పాలసీలను ఉల్లంఘించవు, కానీ అవి 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వీక్షకులకు సముచితమైనవి కాకపోవచ్చు. ఈ వీడియోల మీద మేము వయోపరిమితి విధిస్తాము. కంటెంట్‌కు వయోపరిమితి విధించాలా వద్దా అనేది నిర్ణయించేటప్పుడు, మేము ఇటువంటి అంశాలను పరిగణిస్తాము:

  • హింస
  • కలతకు గురిచేసే ఇమేజ్‌లు
  • లైంగిక భావనలను సూచించే కంటెంట్
  • నగ్నత్వం
  • ప్రమాదకర లేదా చట్టవిరుద్ధ యాక్టివిటీల చిత్రీకరణ

ఏదైనా వీడియోపై వయోపరిమితి విధించి ఉంటే, ఆ వీడియో ప్లే అవ్వడానికి ముందు ఒక హెచ్చరిక స్క్రీన్ కనబడుతుంది. అప్పుడు, 18 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న వీక్షకులు ఆ కంటెంట్‌ను చూడటానికి ముందుకు సాగవచ్చు. అనుకోకుండా వీక్షకులు ఈ వీడియోలను చూసే అవకాశాలను తగ్గించడానికి, YouTubeలోని కొన్ని విభాగాలలో అవి చూపబడవు. చాలా వరకు థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లలో వయోపరిమితి విధించబడిన వీడియోలను చూడటం సాధ్యపడదు. ప్లే చేసినప్పుడు, ఈ వీడియోలు వీక్షకులను తిరిగి YouTubeకు మళ్లిస్తాయి.

మీ వీడియోపై విధించిన వయోపరిమితిపై అప్పీల్ చేయండి

మీ వీడియోపై వయోపరిమితి విధించినట్లయితే, దాన్ని తొలగించాలని కోరుతూ అప్పీల్ చేయవచ్చు.

Android కోసం YouTube Studio యాప్

  1. YouTube Studio యాప్ ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూలో, కంటెంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. పరిమితి ఉన్న వీడియోను ఎంచుకుని, పరిమితిపై ట్యాప్ చేయండి.
  4. సమస్యలను రివ్యూ చేయండిని ట్యాప్ చేయండి.
  5. సంబంధిత క్లెయిమ్‌ను ట్యాప్ చేయండి.
  6. అప్పీల్ చేయడానికి మీ కారణాన్ని ఎంటర్ చేసి, సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ వీడియోపై విధించిన వయోపరిమితికి ప్రతిగా అప్పీల్ చేయండి

మీ వీడియోపై వయోపరిమితి విధించినట్లయితే, మీరు పరిమితిని అప్పీల్ చేయవచ్చు.

  1. YouTube Studio కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు అప్పీల్ చేయాలనుకునే వీడియోకు వెళ్లండి. 
  4. “పరిమితుల” నిలువు వరుసలో, పరిమితి రకానికి వెళ్లండి. అప్పీల్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  5. అప్పీల్ చేయడానికి మీ కారణాన్ని ఎంటర్ చేయండి. సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

గమనిక: మీరు మీ వీడియోపై వయోపరిమితికి సంబంధించి ఒక్కసారి మాత్రమే అప్పీల్ చేయగలరు.

మీరు అప్పీల్‌ను సమర్పించిన తర్వాత

YouTube టీమ్ మీ రిక్వెస్ట్‌ను రివ్యూ చేసి, సముచితమైతే తగిన చర్య తీసుకుంటుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14509090769242831058
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false