YouTubeలో ఏ కంటెంట్ అనుమతించబడుతుందో, ఏది అనుమతించబడదో, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వివరిస్తాయి. ఇవి ప్రధాన నియమాలు, ప్రతి వీడియో వీటిని తప్పనిసరిగా అవలంబించాలి. ఈ గైడ్‌లైన్స్‌ను వీడియోలు ఉల్లంఘించినప్పుడు, మేము వాటిని తీసివేస్తాము. కొన్ని వీడియోలు మా పాలసీలను ఉల్లంఘించవు, కానీ అవి 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వీక్షకులకు సముచితమైనవి కాకపోవచ్చు. ఈ వీడియోల మీద మేము వయోపరిమితి విధిస్తాము. కంటెంట్‌కు వయోపరిమితి విధించాలా వద్దా అనేది నిర్ణయించేటప్పుడు, మేము ఇటువంటి అంశాలను పరిగణిస్తాము:
- హింస
- కలతకు గురిచేసే ఇమేజ్‌లు
- లైంగిక భావనలను సూచించే కంటెంట్
- నగ్నత్వం
- ప్రమాదకర లేదా చట్టవిరుద్ధ యాక్టివిటీల చిత్రీకరణ
ఏదైనా వీడియోపై వయోపరిమితి విధించి ఉంటే, ఆ వీడియో ప్లే అవ్వడానికి ముందు ఒక హెచ్చరిక స్క్రీన్ కనబడుతుంది. అప్పుడు, 18 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న వీక్షకులు ఆ కంటెంట్‌ను చూడటానికి ముందుకు సాగవచ్చు. అనుకోకుండా వీక్షకులు ఈ వీడియోలను చూసే అవకాశాలను తగ్గించడానికి, YouTubeలోని కొన్ని విభాగాలలో అవి చూపబడవు. చాలా వరకు థర్డ్-పార్టీ వెబ్సైట్లలో వయోపరిమితి విధించబడిన వీడియోలను చూడటం సాధ్యపడదు. ప్లే చేసినప్పుడు, ఈ వీడియోలు వీక్షకులను తిరిగి YouTubeకు మళ్లిస్తాయి.
మీ వీడియోపై విధించిన వయోపరిమితిపై అప్పీల్ చేయండి
మీ వీడియోపై వయోపరిమితి విధించినట్లయితే, దాన్ని తొలగించాలని కోరుతూ అప్పీల్ చేయవచ్చు.
Android కోసం YouTube Studio యాప్
- YouTube Studio యాప్ ను తెరవండి.
- దిగువున ఉన్న మెనూలో, కంటెంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- పరిమితి ఉన్న వీడియోను ఎంచుకుని, పరిమితిపై ట్యాప్ చేయండి.
- సమస్యలను రివ్యూ చేయండిని ట్యాప్ చేయండి.
- సంబంధిత క్లెయిమ్‌ను ట్యాప్ చేయండి.
- అప్పీల్ చేయడానికి మీ కారణాన్ని ఎంటర్ చేసి, సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీ వీడియోపై విధించిన వయోపరిమితికి ప్రతిగా అప్పీల్ చేయండి
మీ వీడియోపై వయోపరిమితి విధించినట్లయితే, మీరు పరిమితిని అప్పీల్ చేయవచ్చు.
- YouTube Studio కు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూలో, కంటెంట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు అప్పీల్ చేయాలనుకునే వీడియోకు వెళ్లండి.
- “పరిమితుల” నిలువు వరుసలో, పరిమితి రకానికి వెళ్లండి. అప్పీల్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- అప్పీల్ చేయడానికి మీ కారణాన్ని ఎంటర్ చేయండి. సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: మీరు మీ వీడియోపై వయోపరిమితికి సంబంధించి ఒక్కసారి మాత్రమే అప్పీల్ చేయగలరు.
మీరు అప్పీల్‌ను సమర్పించిన తర్వాత
YouTube టీమ్ మీ రిక్వెస్ట్‌ను రివ్యూ చేసి, సముచితమైతే తగిన చర్య తీసుకుంటుంది.