హక్కుదారుగా లైసెన్స్‌ను జారీ చేయడాన్ని ప్రారంభించండి

Creator Music ఫీచర్ ప్రస్తుతం U.S. క్రియేటర్‌లకు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో అందుబాటులో ఉంది. U.S. బయట ఉండే YPP క్రియేటర్‌లకు విస్తరించే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.

ఇతర వ్యక్తులకు హక్కులు ఉన్న కంటెంట్‌ను ఎవరైనా ఉపయోగించే చట్టపరమైన అనుమతిని లైసెన్స్ అందిస్తుంది. Creator మ్యూజిక్‌తో, మానిటైజేషన్‌ను కొనసాగిస్తూనే, క్రియేటర్‌లు తమ వీడియోలో మ్యూజిక్‌ను ఉపయోగించడానికి లైసెన్స్‌ను కొనుగోలు చేయగలరు. Creator మ్యూజిక్‌లో లైసెన్స్ జారీ చేయడం కోసం మ్యూజిక్‌ను అందుబాటులో ఉంచడానికి:

  1. మీ సౌండ్ రికార్డింగ్ అస్సెట్‌లలో వేటికి లైసెన్స్ జారీ చేయవచ్చో చూడండి.
  2. ధర, వ్యవధి వంటి లైసెన్స్ వినియోగ నియమాలను అనుకూలంగా మార్చడానికి, లైసెన్స్ వ్యూహాన్ని క్రియేట్ చేయండి.
  3. లైసెన్స్ జారీ చేయదగిన మీ అస్సెట్‌లకు లైసెన్స్ వ్యూహాన్ని వర్తింపజేయండి.

మీరు ప్రారంభించే ముందు, లైసెన్స్ వ్యూహాల గురించి, అలాగే లైసెన్స్‌లను సెటప్ చేయడానికి అవి ఎలా ఉపయోగించబడతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ కింద ఉన్న సమాచారాన్ని రెఫర్ చేయండి.

లైసెన్స్ వ్యూహాలను అర్థం చేసుకోండి

YouTube Creator మ్యూజిక్‌లో మీ మ్యూజిక్‌కు లైసెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు, క్రియేటర్ ఏయే నియమాలకు అంగీకరించాలో లైసెన్స్ వ్యూహం పేర్కొంటుంది. మీరు 2 రకాల లైసెన్స్ వ్యూహాలను అందించవచ్చు: ప్లాట్‌ఫామ్ వ్యూహాలు, ఛానెల్ ఆధారిత వ్యూహాలు. ప్రతి లైసెన్స్ వ్యూహానికి కింది సబ్‌స్క్రయిబర్ బకెట్‌లకు గానూ మీరు వేర్వేరు గరిష్ఠ ఛార్జీలను కలిగి ఉండవచ్చు: 1K - 100K, 100K - 500K, 500K - 5M, 5M - 20M, 20M+. ప్రతి అస్సెట్ ఒకేసారి గరిష్ఠంగా 2 లైసెన్స్ వ్యూహాలను కలిగి ఉండవచ్చు: ఒక ప్లాట్‌ఫామ్ వ్యూహం, ఒక ఛానెల్ ఆధారిత వ్యూహం.

ప్లాట్‌ఫామ్ లైసెన్స్ వ్యూహాలు

Creator మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్ ఉన్న అర్హత గల క్రియేటర్‌లందరికీ ప్లాట్‌ఫామ్ లైసెన్స్ వ్యూహాలు వర్తిస్తాయి. ప్లాట్‌ఫామ్ వ్యూహాన్ని క్రియేట్ చేసేటప్పుడు, సొంతంగా మీ అనుకూల వ్యూహాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ముందే సెట్ చేయబడి ఉండే ఈ 4 ధర వ్యూహాలలో ఏదోక దాన్ని ఎంచుకోవచ్చు:

  • ప్రమోషనల్ వ్యూహం: విజిబిలిటీకి, ఇంకా రీచ్‌కు ఆప్టిమైజ్ చేయబడిన వ్యూహం ఇది.
  • సమతుల్యతతో కూడిన వ్యూహం: ప్రమోషనల్, ఇంకా ప్రీమియం వ్యూహాలకు మధ్య సమతుల్యత ఉండేలా రూపొందించిన వ్యూహం ఇది.
  • ప్రీమియం వ్యూహం: ప్రీమియం కంటెంట్‌కు ఆప్టిమైజ్ చేయబడిన వ్యూహం ఇది.
  • ఉచిత వ్యూహం: విజిబిలిటీకి, ఇంకా రీచ్‌కు అత్యుత్తమంగా ఉపయోగపడే వ్యూహం ఇది.

చిన్న క్రియేటర్‌లు, పెద్ద క్రియేటర్‌లు అని తేడా లేకుండా అన్ని రకాల క్రియేటర్‌లకు సరసమైన ధరలకే లైసెన్స్‌లను అందించే వీలు మీకు కల్పించడానికి, ముందే సెట్ చేయబడిన ధర వ్యూహాలను, ఛానెల్ సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్యల ఆధారంగా విభజించడం జరుగుతుంది. అనుకూల వ్యూహాల విషయంలో, అన్ని క్రియేటర్ సెగ్మెంట్‌లకు ఒకే ధర ఉండవచ్చు లేదా మీరు వేర్వేరు ధరలను సెట్ చేయవచ్చు, కానీ ధరలు తప్పనిసరిగా ఆరోహణ క్రమంలో ఉండాలి.

ఛానెల్ ఆధారిత లైసెన్స్ వ్యూహాలు

ఛానెల్ ఆధారిత లైసెన్స్ వ్యూహాలు, వ్యక్తిగత ఛానెల్స్‌కు అనుకూల లైసెన్స్ నియమాలను అందించే వీలు మీకు కల్పిస్తాయి. పెయిడ్ లైసెన్స్‌లను, ప్లాట్‌ఫామ్ వ్యూహాల ద్వారా మాత్రమే అందించవచ్చు.

మీ ఛానెల్ ఆధారిత వ్యూహం ద్వారా టార్గెట్ చేయబడిన ఛానెల్, లైసెన్స్ పొందాలనుకుంటే, ఉచిత ఛానెల్ ఆధారిత లైసెన్స్ వర్తింపజేయబడుతుంది. అవసరాన్ని బట్టి ఛానెల్ ఆధారిత వ్యూహాల నుండి మీరు ఛానెల్స్‌ను తీసివేయవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఛానెల్ ఆధారిత లైసెన్స్ వ్యూహాన్ని క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

పబ్లిషర్ ఫ్లోర్ ధర

కొంతమంది పబ్లిషర్‌లు తమ స్వంత అస్సెట్‌లపై ఫ్లోర్ ధరను సెట్ చేస్తారు, ఇది ట్రాక్‌కు లైసెన్స్ పొందగలిగే అతి తక్కువ ధరను సూచిస్తుంది. పబ్లిషర్ ఫ్లోర్ ధరను సెట్ చేసినప్పుడు, లేబుల్/డిస్ట్రిబ్యూటర్ Studio కంటెంట్ మేనేజర్‌లో సెట్ చేసిన ధరకు అనుగుణంగా ఉండాలి.

మీరు పబ్లిషర్ ఫ్లోర్ ధరకు అనుగుణంగా లేని ప్రీసెట్ లైసెన్స్ వ్యూహాలను ఉపయోగించినట్లయితే, లైసెన్స్ కోల్పోకుండా నిరోధించడానికి Creator Musicలో వ్యూహం ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

లైసెన్స్ జారీ చేయడానికి సంబంధించిన అనుమతులను సెట్ చేయండి

మీరు లైసెన్స్ జారీ చేయడాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, కంటెంట్ మేనేజర్ యూజర్‌ల కోసం లైసెన్స్ జారి చేయడానికి సంబంధించి నిర్దిష్ట అనుమతులను మీరు సెటప్ చేయవచ్చు. Studio కంటెంట్ మేనేజర్‌లో లైసెన్స్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌లను చూసే, ఇంకా ఉపయోగించే వీలును కేవలం నిర్దిష్ట యూజర్‌లకు మాత్రమే ఈ అనుమతులు కల్పిస్తాయి. లైసెన్స్ జారీ చేయడానికి సంబంధించిన అనుమతులను సెటప్ చేయడానికి:

  1. Studio కంటెంట్ మేనేజర్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు ను ఎంచుకోండి.
  3. అనుమతులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. కంటెంట్ మేనేజర్‌కు యాక్సెస్ ఉన్న యూజర్‌ల లిస్ట్‌ను, అలాగే వారికి కేటాయించబడి ఉన్న రోల్‌ను ఈ పేజీ చూపుతుంది.
  4. రోల్స్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. డ్రాప్‌డౌన్  ఆ తర్వాత కొత్త దాన్ని క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. రోల్ పేరు కింద, ఆ రోల్‌కు పేరును ఎంటర్ చేయండి.
    • భవిష్యత్తులో రోల్‌ను సులభంగా గుర్తించగలిగేలా ఉండే పేరును ఉపయోగించండి.
    • రోల్ పేరు గరిష్ఠంగా 100 అక్షరాలు ఉండాలి.
  7. కంటెంట్ ID హక్కుల మేనేజ్‌మెంట్ కింద ఉండే ఒక బాక్స్‌ను, లేదా రెండు బాక్స్‌లనూ ఎంచుకోండి: 
    • లైసెన్స్ మేనేజ్‌మెంట్: అస్సెట్‌లపై ప్లాట్‌ఫామ్ లైసెన్స్ వ్యూహాలను చూసే, ఇంకా సెట్ చేసే వీలును యూజర్‌లకు కల్పిస్తుంది.
    • ఛానెల్ ఆధారిత లైసెన్స్ మేనేజ్‌మెంట్: అస్సెట్‌లపై ఛానెల్ ఆధారిత లైసెన్స్ వ్యూహాలను చూసే, ఇంకా సెట్ చేసే వీలును యూజర్‌లకు కల్పిస్తుంది.
  8. పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  9. ఈ కొత్త రోల్‌ను సేవ్ చేయడానికి, తిరిగి అనుమతుల పేజీలో సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇప్పుడు ఈ రోల్‌ను కంటెంట్ మేనేజర్ యూజర్‌లకు కేటాయించవచ్చు. రోల్స్‌ను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

FAQలు

ముందే సెట్ చేయబడిన లైసెన్స్ వ్యూహాలకు ధరలు మారే అవకాశం ఉందా?

YouTube క్రియేటర్ ఎకో-సిస్టమ్ నిరంతరం మారుతూనే ఉంటుంది కాబట్టి, ముందే సెట్ చేయబడిన లైసెన్స్ వ్యూహాలకు సంబంధించిన ధరలు కూడా మారే అవకాశం ఉంది. ఇలా జరిగితే, ముందే సెట్ చేయబడిన లైసెన్స్ వ్యూహాలకు "కొత్త ధర అందుబాటులో ఉంది" అని లేబుల్ చేయడం జరుగుతుంది, ఇది లైసెన్స్ మేనేజ్‌మెంట్ పేజీలో కనిపిస్తుంది లేదా మీరు అస్సెట్‌కు సంబంధించిన లైసెన్స్ వ్యూహాన్ని ఎడిట్ చేసేటప్పుడు కనిపిస్తుంది.

మీ లైసెన్స్ వ్యూహాన్ని అప్‌డేట్ చేసి కొత్త ధరను వర్తింపజేయాలా లేదా ధరను అలాగే ఉంచాలా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. ధరను అలాగే ఉంచాలని మీరు నిర్ణయించుకుంటే, ఆ లైసెన్స్ వ్యూహానికి "పాత ధర" అని లేబుల్ చేయడం జరుగుతుంది.

గమనిక: కొంతమంది పబ్లిషర్‌లు తమ స్వంత అస్సెట్‌లపై ఫ్లోర్ ధరను సెట్ చేస్తారు, ఇది ట్రాక్‌కు లైసెన్స్ పొందగలిగే అతి తక్కువ ధరను సూచిస్తుంది. పబ్లిషర్ ఫ్లోర్ ధరను సెట్ చేసినప్పుడు, లేబుల్/డిస్ట్రిబ్యూటర్ Studio కంటెంట్ మేనేజర్‌లో సెట్ చేసిన ధరకు అనుగుణంగా ఉండాలి. మీరు పబ్లిషర్ ఫ్లోర్ ధరకు అనుగుణంగా లేని ప్రీసెట్ లైసెన్స్ వ్యూహాలను ఉపయోగించినట్లయితే, లైసెన్స్ కోల్పోకుండా నిరోధించడానికి Creator Musicలో వ్యూహం ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడం జరుగుతుంది.
నా లైసెన్స్ వ్యూహాలకు కొత్త ధరను నేను ఎలా అప్‌డేట్ చేయాలి?

ఏదైనా లైసెన్స్ వ్యూహానికి కొత్త ధరను అప్‌డేట్ చేయడానికి, లైసెన్స్ వ్యూహం ఎడిటింగ్ పేజీలో కొత్త ధర లెవెల్‌ను ఎంచుకొని, వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఈ ధరలో మార్పు వలన గతంలో కొనుగోలు చేసిన లైసెన్స్‌లు లేదా వాటి వినియోగంపై ఎటువంటి ప్రభావమూ ఉండదు. మీరు కొత్త ధర వ్యూహాన్ని ఎంచుకున్న తర్వాత, మళ్లీ పాత ధరను సెట్ చేయడానికి వీలు పడదు.

మరింత సమాచారం

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14640382332873411708
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false