లైసెన్స్ వ్యూహాలను ఎడిట్ చేయండి లేదా డీయాక్టివేట్ చేయండి

మీరు లైసెన్స్ వ్యూహాన్ని క్రియేట్ చేసిన తర్వాత, మీరు వ్యూహం టైటిల్, ధర లేదా వినియోగ వివరాలను ఎడిట్ చేయవచ్చు. ఛానెల్ ఆధారిత లైసెన్స్ వ్యూహాల కోసం, మీరు అవసరమైన విధంగా ఉచిత లైసెన్స్‌కు ఛానెల్స్‌ను జోడించవచ్చు లేదా దాని నుండి ఛానెల్స్‌ను తీసివేయవచ్చు. మీరు ఇకపై లైసెన్స్ వ్యూహాన్ని ఉపయోగించకపోతే, మీరు దాన్ని డీయాక్టివేట్ చేయవచ్చు.

ప్రతి ఎడిట్ సేవ్ చేయబడి, Studio కంటెంట్ మేనేజర్‌లో “రివిజన్”గా కనిపిస్తుంది.

లైసెన్స్ వ్యూహాన్ని ఎడిట్ చేయండి

  1. Studio కంటెంట్ మేనేజర్ కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, లైసెన్స్ మేనేజ్‌మెంట్ ను ఎంచుకోండి.
  3. ప్లాట్‌ఫామ్ వ్యూహాన్ని ఎడిట్ చేయడానికి, ప్లాట్‌ఫామ్ వ్యూహాలు అనే ట్యాబ్‌లోనే ఉండండి. ఛానెల్ ఆధారిత వ్యూహాన్ని ఎడిట్ చేయడానికి, ఛానెల్ ఆధారిత వ్యూహాలు అనే ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
    • వ్యూహం టైటిల్ ఆధారంగా లిస్ట్‌ను ఫిల్టర్ చేయడానికి, ఫిల్టర్ బార్  ఆ తర్వాత వ్యూహం టైటిల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. వ్యూహం టైటిల్‌ను ఎంటర్ చేసి, ఆపై వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న లైసెన్స్ వ్యూహం టైటిల్ పేరును క్లిక్ చేయండి.
  5. టైటిల్, ధర, లేదా అదనపు వివరాలను అప్‌డేట్ చేయండి.
  6. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఛానెల్ ఆధారిత వ్యూహానికి ఛానెల్స్‌ను జోడించండి లేదా దాని నుండి ఛానెల్స్‌ను తీసివేయండి

మీరు నిర్దిష్ట ఛానెల్స్‌కు ఉచిత లైసెన్స్‌ను అందించే ఛానెల్ ఆధారిత లైసెన్స్ వ్యూహాన్ని క్రియేట్ చేసినట్లయితే, మీరు లైసెన్స్ వ్యూహానికి ఛానెల్స్‌ను జోడించవచ్చు లేదా దాని నుండి ఛానెల్స్‌ను తీసివేయవచ్చు.

  1. Studio కంటెంట్ మేనేజర్ కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, లైసెన్స్ మేనేజ్‌మెంట్ ను ఎంచుకోండి.
  3. ఛానెల్ ఆధారిత వ్యూహాలు అనే ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఏ లైసెన్స్ వ్యూహానికి ఛానెల్స్‌ను జోడించాలనుకుంటున్నారో లేదా ఏ లైసెన్స్ వ్యూహం నుండి ఛానెల్స్‌ను తీసివేయాలనుకుంటున్నారో ఆ లైసెన్స్ వ్యూహాన్ని క్లిక్ చేయండి.
    • ఛానెల్స్‌ను జోడించడానికి, ఛానెల్స్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఛానెల్ IDలను పేస్ట్ చేసి, జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఛానెల్స్‌ను తీసివేయడానికి, ఎగువున ఉన్న బ్యానర్ నుండి చానెల్స్‌ను ఎంచుకుని, ఛానెల్స్‌ను తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీరు పొరపాటున ఛానెల్‌ను తీసివేస్తే, మీరు ఎగువున ఉన్న బ్యానర్ నుండి ఛానెల్‌ను ఎంచుకుని, తీసివేయడానికి సంబంధించిన చర్యను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి, నిర్ధారించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

లైసెన్స్ వ్యూహాన్ని డీయాక్టివేట్ చేయండి

  1. Studio కంటెంట్ మేనేజర్ కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, లైసెన్స్ మేనేజ్‌మెంట్ ను ఎంచుకోండి.
  3. ప్లాట్‌ఫామ్ లైసెన్స్ వ్యూహాన్ని డీయాక్టివేట్ చేయడానికి, ప్లాట్‌ఫామ్ వ్యూహాలు అనే ట్యాబ్‌లోనే ఉండండి. ఛానెల్ ఆధారిత లైసెన్స్ వ్యూహాన్ని డీయాక్టివేట్ చేయడానికి, ఛానెల్ ఆధారిత వ్యూహాలు అనే ట్యాబ్‌ను క్లిక్ చేయండి
    • వ్యూహం టైటిల్ ఆధారంగా లిస్ట్‌ను ఫిల్టర్ చేయడానికి, ఫిల్టర్ బార్  ఆ తర్వాత వ్యూహం టైటిల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. వ్యూహం టైటిల్‌ను ఎంటర్ చేసి, ఆపై వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్న లైసెన్స్ వ్యూహాన్ని ఎంచుకోండి.
  5. లైసెన్స్ వ్యూహాన్ని డీ‌యాక్టివేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
అస్సెట్‌పై లైసెన్స్ వ్యూహాన్ని డీ‌యాక్టివేట్ చేయడానికి, ఇక్కడ ఉన్న శలను ఫాలో అవ్వండి.

రివిజన్ హిస్టరీని చూడండి

మీ లైసెన్స్ వ్యూహాలకు మీరు చేసే ఎడిట్‌లు సేవ్ చేయబడి, Studio కంటెంట్ మేనేజర్‌లో “రివిజన్‌లు”గా కనిపిస్తాయి. లైసెన్స్ వ్యూహానికి చేసిన రివిజన్‌ల రికార్డ్‌ను చూడటానికి, సర్దుబాటు చేసిన ధరను లేదా హిస్టరీను ఎంచుకోండి. ఒక్కో రివిజన్ చేసినప్పుడు జోడించబడిన లేదా తీసివేయబడిన ఛానెల్స్ గురించి మరిన్ని వివరాలను చూడటానికి మీరు ఒక్కో రివిజన్ అడ్డు వరుసను క్లిక్ చేయవచ్చు.

అప్‌డేట్ చేయబడిన లైసెన్స్ వ్యూహానికి సంబంధించిన వివరాలను చూడటానికి హిస్టరీ ట్యాబ్ నుండి డ్రాప్‌డౌన్ బాణాన్ని క్లిక్ చేయండి: 

  • రివిజన్‌లు: ఇప్పటికే ఉన్న లైసెన్స్ వ్యూహానికి అప్‌డేట్ చేశారా లేదా కొత్త ఎంపిక అనే దాన్ని తెలుసుకోవడానికి మార్పునకు సంబంధించిన వివరాలను చూడండి
  • టైటిల్ | ధర: లైసెన్స్ వ్యూహానికి సంబంధించిన టైటిల్, ధర స్థాయిని చూడండి
  • ప్రారంభ తేదీ, ముగింపు తేదీ: ఇవ్వబడిన లైసెన్స్ వ్యూహం అనేది అస్సెట్‌కు ఎప్పుడు కేటాయించబడిందో, అలాగే అది ఎప్పుడు మార్చబడిందో లేదా డీయాక్టివేట్ చేయబడిందో సూచిస్తుంది. ముగింపు తేదీ, లైసెన్స్ వ్యవధి తేదీలు రెండూ వేర్వేరు.
  • సేకరణలు: స్టోర్ ముందు భాగంలో కొనుగోలు చేసిన లైసెన్స్‌ల సంఖ్యను సూచిస్తుంది
  • వినియోగాలు: లైసెన్స్ ఉన్న కంటెంట్ వాస్తవానికి వీడియోలో ఎన్నిసార్లు ఉపయోగించబడిందో సూచిస్తుంది
  • స్టేటస్: లైసెన్స్ వ్యూహానికి సంబంధించిన ప్రస్తుత స్టేటస్; "ప్రస్తుత నియమాలను" లేదా "మునుపటి నియమాలను" సూచించవచ్చు

సర్దుబాటు చేసిన ధర ట్యాబ్‌లో, మీకు, మార్ఫు ఎప్పుడు జరిగింది అనే దానికి సంబంధించిన యూజర్ సమాచారం లేదా టైమ్ స్టాంప్ వంటి మరిన్ని వివరాలు కనిపిస్తాయి. పబ్లిషర్ ధర సర్దుబాటు ద్వారా వ్యూహం ప్రభావితమైతే, రివైజ్ చేయబడిన వ్యూహం దాని టైటిల్‌లో పబ్లిషర్ పేరును కలిగి ఉంటుంది.

లైసెన్స్ వ్యూహానికి సంబంధించిన రివిజన్‌లను తొలగించడం సాధ్యం కాదు. 0 సేకరణలను కలిగి ఉన్న రివిజన్‌లు ప్రదర్శించబడవు. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2340746112803184929
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false