మీ ఛానెల్ బ్రాండింగ్‌ను మేనేజ్ చేయండి

మీ ప్రొఫైల్ ఫోటో, ఛానెల్ బ్యానర్, వీడియో వాటర్‌మార్క్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా మీ YouTube ఛానెల్ గుర్తింపును బ్రాండింగ్ చేయండి.

మీ ప్రొఫైల్ ఫోటోను మార్చండి

 YouTube Studioలో మీ ప్రొఫైల్ ఫోటోను మార్చండి. మీ ప్రొఫైల్ ఫోటో అన్నది ఒక ఇమేజ్. ఇది, మీ ఛానెల్‌లో, వీడియోల్లో వీక్షకులకు కనిపిస్తుంది. అలాగే YouTube అంతటా పబ్లిక్‌గా ప్రదర్శించబడే మీ యాక్టివిటీల్లో కూడా కనిపిస్తుంది.

'అనుకూలంగా మార్చడం' అనే ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత, 'బ్రాండింగ్' ట్యాబ్ ఎగువున ఉంటుంది.

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ఆ తర్వాత బ్రాండింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మార్చండిని క్లిక్ చేసి మీ కంప్యూటర్ నుండి ఇలస్ట్రేషన్‌ను లేదా ఇమేజ్‌ను ఎంచుకోండి. ఇలస్ట్రేషన్ ప్రీసెట్ రంగులను, కత్తిరింపును, లేదా మీరు అప్‌లోడ్ చేసిన ఇమేజ్ సైజ్‌ను మార్చండి, ఆపై పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. YouTube అంతటా మీ ప్రొఫైల్ ఫోటో అప్‌డేట్ అవ్వడానికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.

సహాయక టెక్నాలజీ లేదా కీబోర్డ్‌తో మీ ఫోటోను కత్తిరించండి

మీ ఫోటోను ఒక మూల నుండి కత్తిరించండి

  1. మీ ఫోటో యొక్క మూలను ఎంచుకోవడానికి నావిగేట్ చేయండి.
  2. ఫోటోను కత్తిరించడానికి బాణం కీలను ఉపయోగించండి.

కత్తిరించే స్క్వేర్ భాగం మొత్తాన్ని తరలించండి

  1. కత్తిరించే స్క్వేర్ భాగం మొత్తాన్ని ఎంపిక చేయడానికి నావిగేట్ చేయండి.
  2. కత్తిరించే స్క్వేర్ భాగం పొజిషన్‌ను మార్చడానికి బాణం కీలను ఉపయోగించండి.

ప్రొఫైల్ ఫోటో గైడ్‌లైన్స్

మీ ప్రొఫైల్ ఫోటో తప్పనిసరిగా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి, కింద పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:

  • JPG, GIF, BMP, లేదా PNG ఫైల్ (యానిమేట్ చేసిన GIFలకు అనుమతి ఉండదు)
  • ఇమేజ్ సైజ్ 15 MBకి మించకూడదు.
  • 98 X 98 px వద్ద రెండర్ చేయబడే ఇమేజ్.

YouTube Creators

మీ బ్యానర్ ఇమేజ్ మీ YouTube పేజీలో ఎగువన బ్యాక్‌గ్రౌండ్‌గా కనిపిస్తుంది.
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ఆ తర్వాత బ్రాండింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఇమేజ్‌ను ఎంచుకోండి. మార్పులు చేయడానికి, ప్రివ్యూను ఎంచుకొని, కత్తిరింపును మార్చి, ఆపై పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: కంప్యూటర్, మొబైల్, టీవీ డిస్‌ప్లేల అంతటా ఒకటే బ్యానర్ ఇమేజ్ ఉపయోగించబడుతుంది, కానీ మీ పరికరం ఆధారంగా అది వేర్వేరుగా చూపబడుతుంది.

అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్స్

కంప్యూటర్, మొబైల్ పరికరాలలో మాత్రమే మీ బ్యానర్ ఇమేజ్ ఉపయోగించబడుతుంది. ఆ బ్యానర్‌ను అప్‌డేట్ చేయడానికి, పైన ఉన్న YouTube క్రియేటర్ సూచనలను ఫాలో అవ్వండి. 

టీవీ, YouTube Musicలో ఉన్న మీ బ్యానర్‌ను అప్‌డేట్ చేయడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో ఉన్న ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
  3. ప్రొఫైల్ ఫోటోకు పక్కన ఉన్న ను క్లిక్ చేసి, ఇమేజ్‌ను ఎంచుకోండి. ఇమేజ్‌కు మార్పులు చేయడానికి,
    • ప్రివ్యూను ఎంచుకుని, ఇమేజ్‌ను ఎడిట్ చేయండి.
    • పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పేజీకి ఎగువ కుడి వైపున ఉన్న, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

బ్యానర్ ఇమేజ్ గైడ్‌లైన్స్

మీ బ్యానర్ ఇమేజ్ తప్పనిసరిగా కింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:

  • అప్‌లోడ్ చేయడానికి కనీస పరిమాణం: 16:9 ఆకార నిష్పత్తితో 2560 x 1440 px.
  • కనీస పరిమాణంలో, టెక్స్ట్, లోగోలకు ఉండవలసిన సురక్షితమైన ఏరియా: 1235 x 338 px.
  • పెద్ద పరికరాలకు సంబంధించి ఇమేజ్‌లు, మొత్తం స్క్రీన్‌కు సరిపడా ఉండాలి. అయితే నిర్దిష్ట వీక్షణల్లో, పరికరాల్లో కత్తిరించబడతాయి.
  • ఫైల్‌కు ఎలాంటి అదనపు అలంకరణలను జోడించవద్దు (ఉదా. షాడోలు, బార్డర్స్, ఫ్రేమ్‌లు).
  • ఫైల్ సైజ్: 6 MB లేదా అంతకన్నా తక్కువ ఉండాలి.

ఇమేజ్‌ల సైజ్ ఎలా మార్చాలి

మీరు మీ కంప్యూటర్‌లోని ఇమేజ్ ఎడిటర్‌ను లేదా ఆన్‌లైన్‌లో ఇమేజ్ సైజ్‌ను మార్చే టూల్‌ను ఉపయోగించి ఇమేజ్‌ల సైజ్‌ను మార్చవచ్చు. ఉదాహరణకు, మీరు Apple కంప్యూటర్‌లో లేదా Windowsలోని Microsoft Photosలో ప్రివ్యూను ఉపయోగించవచ్చు.

మీ వీడియో వాటర్‌మార్క్‌ను జోడించండి

మీ వీడియోకు వీడియో వాటర్‌మార్క్‌ను జోడించి, మీ ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోమని వీక్షకులను ప్రోత్సహించవచ్చు. మీరు వీడియో వాటర్‌మార్క్‌ను జోడిస్తే, వీక్షకులు, కంప్యూటర్‌లో YouTubeను చూస్తున్నప్పుడు, నేరుగా మీ ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేయగలరు.
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ఆ తర్వాత బ్రాండింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ డిస్‌ప్లే సమయాన్ని ఎంచుకోండి:
    • వీడియో ముగింపు: వీడియోలో చివరి 15 సెకన్లలో వీడియో వాటర్‌మార్క్ చూపబడుతుంది.
    • అనుకూల ప్రారంభ సమయం: మీరు ఎంచుకున్న సమయంలో వీడియో వాటర్‌మార్క్ చూపడం ప్రారంభమవుతుంది.
    • మొత్తం వీడియో: వీడియో వాటర్‌మార్క్ మొత్తం వీడియోలో చూపబడుతుంది.
  4. మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఇమేజ్‌ను ఎంచుకోండి. మీ ఇమేజ్ సైజ్‌ను మార్చి, ఆపై 'పూర్తయింది' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: పిల్లల కోసం రూపొందించినవిగా సెట్ చేసిన వీడియోలలో వీడియో వాటర్‌మార్క్‌లు అందుబాటులో ఉండవు. మీరు గతంలో వీడియో వాటర్‌మార్క్‌ను జోడించి ఉండి, ఇప్పుడు మీ వీడియోను పిల్లల కోసం రూపొందించినదిగా సెట్ చేస్తే, వీక్షకులకు వాటర్‌మార్క్ కనిపించదు.

వీడియో వాటర్‌మార్క్ గైడ్‌లైన్స్

మీ వీడియో వాటర్‌మార్క్ తప్పనిసరిగా కింది ప్రమాణాలను అనుగుణంగా ఉండాలి:

  • కనీసం 150x150 పిక్సెల్స్ ఉండాలి.
  • 1 MB కంటే తక్కువ సైజ్ ఉన్న స్క్వేర్ ఇమేజ్ అయి ఉండాలి.

అందుబాటులోకి వచ్చే తేదీ

ఛానెల్ వాటర్‌మార్క్ కంప్యూటర్‌లలో, మొబైల్ పరికరాల్లో ల్యాండ్‌స్కేప్ వీక్షణలో అందుబాటులో ఉంది (మొబైల్‌లో క్లిక్ చేయడం అవకాశం ఉండదు). ఛానెల్ వాటర్‌మార్క్‌లు అనుకూల YouTube chromeless ప్లేయర్‌లలో లేదా Adobe Flashలో కనిపించవు.

వీడియో వాటర్‌మార్క్ కొలమానాలు

మీరు YouTube ఎనలిటిక్స్‌లోని సబ్‌స్క్రిప్షన్ సోర్స్ రిపోర్ట్ నుంచి కొలమానాలను పొందవచ్చు.

మీ ఛానెల్ బ్రాండింగ్‌ను ఎలా మేనేజ్ చేయాలో చూడండి

మీ ప్రొఫైల్ ఫోటోను, ఛానెల్ బ్యానర్‌ను, వీడియో వాటర్‌మార్క్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి అనే దాని కోసం YouTube Creators ఛానెల్‌లోని కింది వీడియోను చూడండి.

Customize Your Channel Branding & Layout: Add a Profile Picture, Banner, Trailer, Sections, & more!

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1239447113368869079
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false