మీ ఛానెల్ బ్రాండింగ్‌ను మేనేజ్ చేయండి

మీ ప్రొఫైల్ ఫోటో, ఛానెల్ బ్యానర్, వీడియో వాటర్‌మార్క్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా మీ YouTube ఛానెల్ గుర్తింపును బ్రాండింగ్ చేయండి.

మీ ప్రొఫైల్ ఫోటోను మార్చండి

మీ ప్రొఫైల్ ఫోటో అనేది మీ ఛానెల్‌లోని వీక్షకులకు, YouTube అంతటా వీడియోలలో చూపబడే ఇమేజ్.

YouTube iPhone, iPad యాప్

  1. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  2. మీ ఛానెల్‌ను ట్యాప్ చేయండి.
  3. ఛానెల్‌ను ఎడిట్ చేయండి , ఆపై మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  4. మీరు ఫోటోను తీసుకోవచ్చు లేదా అప్‌లోడ్ చేయడానికి ఫోటోను ఎంచుకోవచ్చు.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

iPhone, iPad కోసం YouTube Studio యాప్

  1. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  2. ఛానెల్‌ను ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, ఆపై మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. మీరు ఫోటోను తీసుకోవచ్చు లేదా అప్‌లోడ్ చేయడానికి ఫోటోను ఎంచుకోవచ్చు.
  4. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ప్రొఫైల్ ఫోటో గైడ్‌లైన్స్

మీ ప్రొఫైల్ ఫోటో తప్పనిసరిగా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి, కింద పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:

  • JPG, GIF, BMP, లేదా PNG ఫైల్ (యానిమేట్ చేసిన GIFలు అనుమతించబడవు).
  • 800 X 800 px ఇమేజ్ (సిఫార్సు చేయబడినవి).
  • 4 MB లేదా అంతకంటే తక్కువ సైజ్ ఉన్న స్క్వేర్ లేదా రౌండ్ ఆకారం ఉన్న ఇమేజ్.

మీ బ్యానర్ ఇమేజ్ మీ YouTube పేజీలో ఎగువన బ్యాక్‌గ్రౌండ్‌గా కనిపిస్తుంది.

YouTube iPhone, iPad యాప్

  1. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  2. మీ ఛానెల్‌ను ట్యాప్ చేయండి.
  3. ఛానెల్‌ను ఎడిట్ చేయండి ని ట్యాప్ చేసి, ఆపై కుడి వైపున ఉన్న మీ బ్యానర్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఫోటోను తీసుకోవచ్చు లేదా అప్‌లోడ్ చేయడానికి ఫోటోను ఎంచుకోవచ్చు.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

iPhone, iPad కోసం YouTube Studio యాప్

  1. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  2. ఛానెల్ ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, ఆపై మీ బ్యానర్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఫోటోను తీసుకోవచ్చు లేదా అప్‌లోడ్ చేయడానికి ఫోటోను ఎంచుకోవచ్చు.
  4. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

బ్యానర్ ఇమేజ్ గైడ్‌లైన్స్

మీ బ్యానర్ ఇమేజ్ తప్పనిసరిగా కింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:

  • అప్‌లోడ్ చేయడానికి కనీస పరిమాణం: 16:9 ఆకార నిష్పత్తితో 2560 x 1440 px.
  • కనీస పరిమాణంలో, టెక్స్ట్, లోగోలకు ఉండవలసిన సురక్షితమైన ఏరియా: 1235 x 338 px.
  • ఇమేజ్‌లు పెద్ద పరికరాల విషయంలో మొత్తం స్క్రీన్‌కు అనుగుణంగా ఉండాలి అయితే నిర్దిష్ట వీక్షణలు, పరికరాలలో కత్తిరించబడతాయి.
  • ఫైల్‌కు ఎలాంటి అదనపు అలంకరణలను జోడించవద్దు (ఉదా. షాడోలు, బార్డర్స్, ఫ్రేమ్‌లు).
  • ఫైల్ సైజ్: 6 MB లేదా అంతకన్నా తక్కువ ఉండాలి.

ఇమేజ్‌ల సైజ్ ఎలా మార్చాలి

మీరు మీ కంప్యూటర్‌లోని ఇమేజ్ ఎడిటర్‌ను లేదా ఆన్‌లైన్‌లో ఇమేజ్ సైజ్‌ను మార్చే టూల్‌ను ఉపయోగించి ఇమేజ్‌ల సైజ్‌ను మార్చవచ్చు. ఉదాహరణకు, మీరు Apple కంప్యూటర్‌లో లేదా Windowsలోని Microsoft Photosలో ప్రివ్యూను ఉపయోగించవచ్చు.

మీ వీడియో వాటర్‌మార్క్‌ను జోడించండి

ఈ సెట్టింగ్ కంప్యూటర్‌లో అందుబాటులో ఉంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11410238466478691155
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false