క్లిప్‌లను క్రియేట్ చేయడం, మేనేజ్ చేయడం

మీరు వీడియోలోని లేదా లైవ్ స్ట్రీమ్‌లోని కొంత భాగాన్ని క్లిప్ చేసి, దాన్ని సోషల్ ఛానెల్స్‌లో లేదా ఈమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్ వంటి డైరెక్ట్ కమ్యూనికేషన్‌ల ద్వారా ఇతరులకు షేర్ చేయవచ్చు. క్లిప్‌లు పబ్లిక్‌గా ఉంటాయి, సదరు క్లిప్‌నకు యాక్సెస్ ఉన్న ఎవరైనా వాటిని చూడగలరు, అలాగే సదరు క్లిప్ ఏ వీడియోలో భాగమై ఉందో, ఆ ఒరిజినల్ వీడియోను కూడా చూడగలరు. మీరు క్రియేట్ చేసిన క్లిప్‌లను, అలాగే మీ క్లిప్‌ల లైబ్రరీ పేజీలోని మీ వీడియోలలో క్రియేట్ చేసిన క్లిప్‌లను మీరు కనుగొనవచ్చు. వీడియో క్రియేటర్‌లు, YouTube Studioలో తమ వీడియోలలో క్రియేట్ చేసిన క్లిప్‌లను మేనేజ్ చేయవచ్చు.

గమనిక: వీడియోల క్లిప్పింగ్ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

YouTube క్లిప్‌లు

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

క్లిప్‌ను క్రియేట్ చేసి, షేర్ చేయండి

  1. YouTube యాప్ ‌ను తెరవండి.
  2. మీరు క్లిప్ చేయాలనుకుంటున్న వీడియోకు వెళ్లండి.
  3. సబ్‌స్క్రయిబ్ చేయండి బటన్ కింద, ఆప్షన్‌లను కుడి వైపునకు స్లయిడ్ చేసి, క్లిప్ ను ట్యాప్ చేయండి.
  4. స్లయిడర్‌ను లాగడం ద్వారా, మీరు వీడియోలో ఏ భాగాన్ని అయితే క్లిప్ చేయాలనుకుంటున్నారో, ఆ భాగాన్ని ఎంచుకోండి. మీరు ఎంచుకున్న క్లిప్ నిడివిని, గరిష్ఠంగా 60 సెకన్లకు పెంచుకోవచ్చు, లేదా కనిష్ఠంగా 5 సెకన్లకు తగ్గించుకోవచ్చు.
  5. క్లిప్‌ను షేర్ చేయండిని ట్యాప్ చేయండి.
  6. క్లిప్‌ను షేర్ చేయడానికి ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • పొందుపరచండి: ఈ ఆప్షన్‌ను ఉపయోగించి మీరు ఏదైనా వెబ్‌సైట్‌లో వీడియోను పొందుపరచవచ్చు.
    • సోషల్ నెట్‌వర్క్‌లు: ఈ ఆప్షన్‌ను ఉపయోగించి మీ క్లిప్‌ను Facebook లేదా Twitter వంటి సోషల్ నెట్‌వర్క్‌లలో మీరు షేర్ చేయవచ్చు.
    • లింక్‌ను కాపీ చేయండి: ఈ ఆప్షన్‌ను ఉపయోగించి మీ క్లిప్‌నకు సంబంధించిన లింక్‌ను కాపీ చేసి వేరే చోట మీరు పేస్ట్ చేయవచ్చు.
    • ఈమెయిల్: ఈ ఆప్షన్ ద్వారా మీ మొబైల్ పరికరంలో ఆటోమేటిక్‌గా సెట్ చేసి ఉన్న ఈమెయిల్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మీ క్లిప్‌ను మీరు షేర్ చేయవచ్చు.
గమనిక: క్లిప్‌ల లైబ్రరీలో, మీరు క్రియేట్ చేసిన క్లిప్‌లను, మీ కంటెంట్ నుండి వీక్షకులు క్రియేట్ చేసిన క్లిప్‌లను కనుగొనవచ్చు. ప్రధాన యాప్ ఆ తర్వాత మీ క్లిప్‌లు లో ఉండే ఖాతా ట్యాబ్‌లో ఇది ఉంటుంది.

మీ వీడియోల క్లిప్‌లను మేనేజ్ చేయండి

  1. YouTube Studio యాప్ ‌ను తెరవండి.
  2. దిగువున, కంటెంట్ ట్యాబ్ ను ట్యాప్ చేయండి.
  3. ఎగువున, ఫిల్టర్ ను ట్యాప్ చేయండి.
  4. క్లిప్‌లు ఉన్న వీడియో ఆ తర్వాత వర్తింపజేయండిని ఎంచుకోండి.
  5. ఏదైనా వీడియోను ట్యాప్ చేసి, దాని క్లిప్‌లను చూడండి.
  6. తాజా క్లిప్‌ల దిగువున మరిన్ని చూడండిని ఎంచుకోండి.
  7. మీరు మేనేజ్ చేయాలనుకుంటున్న క్లిప్‌పై ఉండే ను ట్యాప్ చేయండి.
  8. మీరు తీసుకోవాలనుకుంటున్న చర్యను బట్టి, క్లిప్‌ను షేర్ చేయండి , క్లిప్‌ను ప్లే చేయండి , ఛానెల్ నుండి యూజర్‌ను దాచండి , లేదా క్లిప్‌ను రిపోర్ట్ చేయండి ఆప్షన్‌లలో ఒక దాన్ని ట్యాప్ చేయండి.

మీరు క్రియేట్ చేసిన క్లిప్‌ను తొలగించండి

YouTube యాప్‌లో

  1. YouTube యాప్  ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. కిందికి స్క్రోల్ చేసి, మీ క్లిప్‌లు ను ట్యాప్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న క్లిప్‌పై, మెనూ ను ట్యాప్ చేయండి.
  5. క్లిప్‌ను తొలగించండి ని ట్యాప్ చేయండి.

YouTube Studio యాప్‌లో

  1. YouTube Studio   ను తెరవండి.
  2. కంటెంట్ ట్యాబ్  ను ట్యాప్ చేయండి.
  3. ఫిల్టర్  ను ట్యాప్ చేయండి.
  4. కిందికి స్క్రోల్ చేసి, క్లిప్‌లు ఉన్న వీడియో ఆ తర్వాత  వర్తింపజేయండిని ఎంచుకోండి.
  5. మీరు ఏ వీడియోకు చెందిన క్లిప్‌లను అయితే చూడాలనుకుంటున్నారో, ఆ వీడియోను ఎంచుకోండి.
  6. తాజా క్లిప్‌ల కార్డ్ దిగువున మరిన్ని చూడండిని ట్యాప్ చేయండి.
  7. మీరు మేనేజ్ చేయాలనుకుంటున్న క్లిప్ పక్కన ఉండే  ను ట్యాప్ చేయండి.
  8. క్లిప్‌ను తొలగించండి ని ట్యాప్ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)

YouTubeలో క్లిప్‌లను ఎలా క్రియేట్ చేయాలో నాకు కనిపించడం లేదు.

YouTubeలో వీడియో లేదా లైవ్ స్ట్రీమ్ నుండి క్లిప్‌లను క్రియేట్ చేయడానికి, మీరు తప్పకుండా ఇలా చేయాలి:

  • సైన్ ఇన్ చేయండి.
  • అర్హత ఉన్న, సమ్మతించిన ఛానెల్ నుండి క్లిప్‌ను క్రియేట్ చేయండి. ఛానెల్ అనేది దాని కంటెంట్‌కు సంబంధించిన క్లిప్‌ను క్రియేట్ చేయకుండా కూడా ఆఫ్ చేయవచ్చు.

ఈ దిగువున పేర్కొన్న వాటి నుండి క్లిప్‌లను క్రియేట్ చేయలేరు:

  • 2 నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోల నుండి
  • పిల్లల కోసం రూపొందించిన వీడియోలు
  • DVR లేని లైవ్ స్ట్రీమ్‌ల నుండి
  • 8 గంటలకు పైగా నిడివి ఉండే లైవ్ స్ట్రీమ్‌ల నుండి
  • లైవ్‌లో ఉన్న ప్రీమియర్‌ల నుండి
  • వార్తా ఛానెళ్ల నుండి రూపొందించిన వీడియోల నుండి

నేను క్రియేట్ చేసిన క్లిప్‌లను ఎవరు చూడగలరు?

క్లిప్‌లు పబ్లిక్‌గా ఉంటాయి, సదరు క్లిప్‌నకు యాక్సెస్ ఉన్న ఎవరైనా దాన్ని చూడగలరు, షేర్ చేయగలరు, అలాగే ఆ క్లిప్‌నకు సంబంధించిన ఒరిజినల్ వీడియోను కూడా చూడగలరు. ఒరిజినల్ వీడియోకు ఓనర్‌గా ఉన్న క్రియేటర్‌లకు, వారి లైబ్రరీ పేజీలో, YouTube Studioలో సదరు వీడియోలో క్రియేట్ చేసిన అన్ని క్లిప్‌లకు యాక్సెస్ ఉంటుంది. YouTubeలో వీక్షకులకు, క్రియేటర్‌లకు అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన సెర్చ్, ఇన్‌డైరెక్ట్ సెర్చ్ కేటగిరీ, ఎనలిటిక్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా క్లిప్‌లను చూడవచ్చు.

నేను క్రియేట్ చేసిన క్లిప్‌లు ఎందుకు అందుబాటులో లేవు?

ఒరిజినల్ వీడియోను తొలగించినా లేదా దాన్ని ప్రైవేట్‌గా సెట్ చేసినా, ఆ వీడియో క్లిప్‌లు అందుబాటులో ఉండవు. వీడియోను అన్‌లిస్టెడ్‌గా సెట్ చేసినట్లయితే, ఆ వీడియో క్లిప్‌లు అందుబాటులో ఉంటాయి.

ఒకవేళ ఒరిజినల్ వీడియో మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తే, ఆ వీడియో నుండి క్రియేట్ చేయబడిన క్లిప్‌లు తీసివేయబడతాయి.

నేను ఒక లైవ్ స్ట్రీమ్ నుండి క్లిప్‌ను క్రియేట్ చేశాను, కానీ ఆ క్లిప్ పని చేయడం లేదు.

ఆ లైవ్ స్ట్రీమ్ ముగిసి, అది వీడియో రూపంలో అప్‌లోడ్ చేయబడిన తర్వాత మాత్రమే దాని క్లిప్‌లను చూడవచ్చు. DVR లేని లైవ్ స్ట్రీమ్‌ల నుండి, ఇంకా DVR సమయ వ్యవధి కంటే ఎక్కువ నిడివి ఉండే లైవ్ స్ట్రీమ్‌ల నుండి మీరు క్లిప్‌లను క్రియేట్ చేయలేరు. లైవ్ స్ట్రీమ్‌లలో DVRను ఆన్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

లైవ్ స్ట్రీమ్ ఒకవేళ DVR సమయ వ్యవధి కంటే ఎక్కువసేపు కొనసాగితే, DVR సమయ వ్యవధి వెలుపల ఉన్న క్లిప్‌లు ఏవైనా ఉంటే, లైవ్ స్ట్రీమ్ ముగిసి, అసలు వీడియో పోస్ట్ చేయబడే వరకు, ఆ క్లిప్‌లను ప్లే చేయడం సాధ్యపడదు.

నేను క్లిప్‌ల నుండి షార్ట్‌లను క్రియేట్ చేయగలనా?

అవును, క్లిప్ సోర్స్ వీడియోకు కూడా రీమిక్స్ కోసం అర్హత ఉంటే, మీరు క్లిప్‌ను రీమిక్స్ చేయవచ్చు. వీడియోలో మీకు అందుబాటులో ఉన్న అన్ని రీమిక్స్ టూల్స్ కూడా, సదరు వీడియోకు సంబంధించిన ఏదైనా క్లిప్‌లో మీకు అందుబాటులో ఉంటాయి, ఇక్కడ మరింత తెలుసుకోండి.

క్లిప్‌నకు సంబంధించిన సోర్స్ వీడియోకు ఓనర్లు అయిన క్రియేటర్లు, ఆ క్లిప్ అంతటినీ షార్ట్‌గా మార్చగలరు, ఇక్కడ మరింత తెలుసుకోండి.

నా క్లిప్‌ల పనితీరును నేను ఎలా చూడగలను?

YouTube Studioలోని క్లిప్‌ల  విభాగంలో, మీ వీడియోను ఉపయోగించి ఎన్ని క్లిప్‌లు క్రియేట్ అయ్యాయి, ఒక్కో క్లిప్‌నకు ఎన్ని వీక్షణలు వచ్చాయి, ఒక్కో క్లిప్‌ను క్రియేట్ చేసింది ఎవరు వంటి వివరాలతో పాటు ఇతర సమాచారాన్ని కూడా మీరు చూడగలరు. 

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12217016945984969675
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false