YouTube Studioలో ప్లేలిస్ట్‌లను మేనేజ్ చేయండి

ప్రేక్షకులతో ఎంగేజ్ అవ్వడానికి YouTube Studioలో మీ ప్లేలిస్ట్‌లను క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, మేనేజ్ చేయడం, ఫిల్టర్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

గమనిక: ఈ ఫీచర్ YouTubeలోని యాక్సెస్ పర్యవేక్షణ మోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి.

 

iPhone & iPad కోసం YouTube Studio యాప్

ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించండి

  1. YouTube Studio యాప్ ‌ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూ నుండి, కంటెంట్  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ప్లేలిస్ట్‌కు జోడించాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి.
  4. ఎడిట్ చేయండి  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ప్లేలిస్ట్‌కు జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేసి, మీరు జోడించాలనుకుంటున్న ప్లేలిస్ట్‌లను ఎంచుకోండి.
  6. పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ప్లేలిస్ట్ నుండి వీడియోలను తీసివేయండి

ప్లేలిస్ట్ నుండి నిర్దిష్ట వీడియోను తీసివేయడానికి, ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. YouTube Studio యాప్ ‌ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూ నుండి, కంటెంట్  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ప్లేలిస్ట్ నుండి తీసివేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి.
  4. ఎడిట్ చేయండి  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ప్లేలిస్ట్‌ను ట్యాప్ చేసి, ప్లేలిస్ట్ పేరు పక్కన ఉన్న బాక్స్‌లో ఎంపికను తీసివేయండి.
  6. పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ప్లేలిస్ట్ సెట్టింగ్‌లను (టైటిల్, వివరణ) ఎడిట్ చేయండి

మీరు YouTube Studio యాప్‌ను ఉపయోగించి ప్లేలిస్ట్ టైటిల్, వివరణ, గోప్యత, ప్లేలిస్ట్‌లోని వీడియోల క్రమాన్ని ఎడిట్ చేయవచ్చు.
  1.  YouTube Studio యాప్ ‌ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూ నుండి, కంటెంట్  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌లో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
  4. ఎడిట్ చేయండి  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ప్లేలిస్ట్ సెట్టింగ్‌లను ఎడిట్ చేసి, సేవ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ప్లేలిస్ట్‌ను తొలగించండి

  1. YouTube Studio యాప్ ‌ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూ నుండి, కంటెంట్  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌లో, మీరు తొలగించాలనుకుంటున్న ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
  4. ఎడిట్ చేయండి  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ప్లేలిస్ట్‌ను తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేసి, ఆపై సరే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3559622435917473689
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false