YouTube Studioలో ప్లేలిస్ట్‌లను మేనేజ్ చేయండి

ప్రేక్షకులతో ఎంగేజ్ అవ్వడానికి YouTube Studioలో మీ ప్లేలిస్ట్‌లను క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, మేనేజ్ చేయడం, ఫిల్టర్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

గమనిక: ఈ ఫీచర్ YouTubeలోని యాక్సెస్ పర్యవేక్షణ మోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి.

 

ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయండి

కొత్త ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడానికి,

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ కుడి మూలన, కొత్త ప్లేలిస్ట్ ఆ తర్వాత క్రియేట్ చేయండి  అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ప్లేలిస్ట్ టైటిల్‌ను ఎంటర్ చేయండి.
  4. మీ ప్లేలిస్ట్ విజిబిలిటీ సెట్టింగ్‌ను ఎంచుకోవడానికి డ్రాప్-డౌన్ బాక్స్‌ను ఉపయోగించండి.
  5. క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

YouTube Studioలో పాడ్‌కాస్ట్‌ను ఎలా క్రియేట్ చేయాలో దిగువున తెలుసుకోండి, లేదా సహాయ కేంద్రం ఆర్టికల్‌ను చూడండి.

ప్లేలిస్ట్ టైటిల్ చిట్కాలు:
  • ప్లేలిస్ట్ టైటిల్స్‌లో అక్షరాల పరిమితి 150 అక్షరాలను మించకూడదు
  • ప్లేలిస్ట్ టైటిల్స్‌లో చెల్లని అక్షరాలు ఉండకూడదు ("<", ">", లైన్ సపరేటర్ "\u2028")
ప్లేలిస్ట్ వివరణ చిట్కాలు:
  • ప్లేలిస్ట్ వివరణలలో అక్షరాల పరిమితి 5,000 అక్షరాలను మించకూడదు
  • ప్లేలిస్ట్ వివరణలలో చెల్లని అక్షరాలు ("<", ">", లైన్ సపరేటర్ "\u2028") ఉండకూడదు

ప్లేలిస్ట్‌ను మేనేజ్ చేయండి

మీ ప్లేలిస్ట్‌ను మేనేజ్ చేయడానికి,

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, కంటెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3.  ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్ పక్కన ఉన్న మెనూ  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. YouTubeలో ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ప్లేలిస్ట్ కొత్త ట్యాబ్‌లో తెరుచుకుంటుంది.
    • ప్లేలిస్ట్‌లో వీడియోలను క్రమపద్ధతిలో అమర్చడానికి, ఏదైనా వీడియోను ఎంచుకొని దాన్ని పైకి, కిందికి లాగి, వదలడం ద్వారా క్రమాన్ని మార్చండి.
    • ప్లేలిస్ట్‌ను షేర్ చేయడానికి, మీ ప్లేలిస్ట్ వివరాలకు వెళ్లి, షేర్ చేయండి ని ఎంచుకోండి. ఆపై, మీరు ప్లేలిస్ట్‌ను ఎక్కడికి షేర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
    • సహకారులను జోడించడానికి, మీ ప్లేలిస్ట్ వివరాలకు వెళ్లి, మరిన్ని ఆ తర్వాత సహకరించండి ని క్లిక్ చేయండి.
    • ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించడానికి, మీ వీడియో వివరాలకు వెళ్లి, మరిన్ని  ఆ తర్వాత వీడియోలను జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు సెర్చ్, URL, లేదా మీ లైబ్రరీ నుండి వీడియోను జోడించవచ్చు.

ప్లేలిస్ట్ పేరు లేదా వివరణను ఎడిట్ చేయండి

మీ ప్లేలిస్ట్ వివరాలను అప్‌డేట్ చేయడానికి,

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, కంటెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. మీ ప్లేలిస్ట్ పేరు లేదా వివరణ పక్కన ఉన్న వివరాలు  ఆప్షన్‌ను క్లిక్ చేసి, అవసరమైన విధంగా వివరాలను అప్‌డేట్ చేయండి.
  5. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా:

  • ప్లేలిస్ట్ టైటిల్స్‌లో అక్షరాల పరిమితి 150 అక్షరాలను మించకూడదు
  • ప్లేలిస్ట్ టైటిల్స్‌లో చెల్లని అక్షరాలు ఉండకూడదు ("<", ">", లైన్ సపరేటర్ "\u2028")
  • ప్లేలిస్ట్ వివరణలలో అక్షరాల పరిమితి 5,000 అక్షరాలను మించకూడదు.
  • ప్లేలిస్ట్ వివరణలలో చెల్లని అక్షరాలు ("<", ">", లైన్ సపరేటర్ "\u2028") ఉండకూడదు

ప్లేలిస్ట్‌ను ఫిల్టర్ చేయండి

ప్లేలిస్ట్‌ను సులభంగా కనుగొనడానికి, ఫిల్టర్‌ను ఉపయోగించి, మీ సెర్చ్ ఫలితాలను కుదించండి:

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, కంటెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. ఫిల్టర్ బార్ ను ఉపయోగించి, కీవర్డ్‌లను ఎంటర్ చేసి, టైటిల్ ఆధారంగా మీ ప్లేలిస్ట్‌లను కనుగొనండి, ఫిల్టర్ చేయండి.

ప్లేలిస్ట్‌ను పాడ్‌కాస్ట్‌గా మార్చడం

ఇప్పటికే ఉన్న ప్లేలిస్ట్‌ను పాడ్‌కాస్ట్‌గా మార్చడానికి,

  1. YouTube Studioలో, కంటెంట్  ఆ తర్వాత ప్లేలిస్ట్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. పాడ్‌కాస్ట్‌గా మీరు సెట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  3. మెనూ  ఆ తర్వాత పాడ్‌కాస్ట్‌గా సెట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ పాడ్‌కాస్ట్ వివరాలను రివ్యూ చేసి, స్క్వేర్ పాడ్‌కాస్ట్ థంబ్‌నెయిల్‌ను జోడించండి. పాడ్‌కాస్ట్ వివరాలలో టైటిల్, వివరణతో పాటు YouTubeలో మీ పాడ్‌కాస్ట్‌ను ఎవరు చూడగలరు అనే అంశం కూడా ఉంటుంది.
  5. మీరు చేసిన మార్పులను నిర్ధారించడానికి పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

YouTubeలో పాడ్‌కాస్ట్ చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి, మా సహాయ కేంద్రం ఆర్టికల్‌ను చూడండి.

ప్లేలిస్ట్ నుండి పాడ్‌కాస్టింగ్ ఫీచర్‌లను తీసివేయడం

పాడ్‌కాస్టింగ్ ఫీచర్‌లను మీ ప్లేలిస్ట్ నుండి తీసివేయడానికి,

  1. YouTube Studioలో, కంటెంట్ ఆ తర్వాత Podcastsకు వెళ్లండి.
  2. పాడ్‌కాస్ట్‌గా మీరు అన్‌సెట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  3. ఏ పాడ్‌కాస్ట్ నుండి అయితే మీరు ఫీచర్‌లను తీసివేయాలనుకుంటున్నారో, సదరు పాడ్‌కాస్ట్ పేరు పక్కన ఉన్న మెనూ ను క్లిక్ చేయండి.
  4. ప్లేలిస్ట్‌గా సెట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. నిర్ధారించడానికి అవును అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

YouTubeలో పాడ్‌కాస్ట్ చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి, మా సహాయ కేంద్రం ఆర్టికల్‌ను చూడండి.

ప్లేలిస్ట్ ఎనలిటిక్స్‌ను చూడండి

మీ ప్రతి ప్లేలిస్ట్ కోసం, మీరు ఓవర్‌వ్యూ, కంటెంట్, ప్రేక్షకులు, ఇంకా ఆదాయం ట్యాబ్‌ను యాక్సెస్ చేయవచ్చు, దీనితో, మీరు ప్లేలిస్ట్‌లో ఉన్న మీ అన్ని వీడియోలలోని గణాంకాలను ఏకకాలంలో పొందుతారు. మీ ప్లేలిస్ట్ ఎనలిటిక్స్‌ను ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6661696424548244004
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false