సబ్‌టైటిల్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

క్యాప్షన్‌లు (సబ్‌టైటిల్స్‌)ను కొన్ని వీడియోలలో ఓనర్ స్వయంగా జోడిస్తారు, కొన్ని వీడియోలలో YouTube వాటిని ఆటోమేటిక్‌గా జోడిస్తుంది. మీరు కంప్యూటర్ లేదా మొబైల్ పరికరంలో క్యాప్షన్‌లకు సంబంధించిన ఆటోమేటిక్ సెట్టింగ్‌లను మార్చవచ్చు.

Caption settings on YouTube

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీరు క్యాప్షన్‌ల రూపాన్ని, భాషను మార్చడం ద్వారా వాటిని అనుకూలంగా మార్చవచ్చు.

క్యాప్షన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీరు చూడాలనుకుంటున్న వీడియోకు వెళ్లండి.
  2. క్యాప్షన్‌లు (సబ్‌టైటిల్స్) అందుబాటులో ఉంటే, వీడియో ప్లేయర్‌కు దిగువ కుడి వైపున కనిపిస్తుంది.
  3. క్యాప్షన్‌లను ఆన్ చేయడానికి, ను క్లిక్ చేయండి.
  4. క్యాప్షన్‌లను ఆఫ్ చేయడానికి, ను మళ్లీ క్లిక్ చేయండి.

ఆటోమేటిక్ సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపు మెనూ నుండి, ప్లేబ్యాక్, పనితీరు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. క్యాప్షన్‌లను ఎల్లప్పుడూ చూడండి అనే ఎంపికను ఎంచుకోండి లేదా తీసివేయండి.
  5. ఆటోమేటిక్‌గా జెనరేట్ అయిన క్యాప్షన్‌లను చేర్చండి (అందుబాటులో ఉన్నప్పుడు) అనే ఎంపికను ఎంచుకోండి లేదా తీసివేయండి. ఈ ఆప్షన్ క్యాప్షన్‌లను జోడించని వీడియోలకు ఆటోమేటిక్ క్యాప్షన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది.

క్యాప్షన్‌ల ఆటోమేటిక్ సైజ్ & స్టయిల్‌ను మార్చండి

  1. వీడియో ప్లేయర్ దిగువ కుడి వైపున ఉన్న సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  2. సబ్‌టైటిళ్లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

​మీరు కింద పేర్కొన్న వాటిని అనుకూలంగా మార్చవచ్చు:

  • ఫాంట్, రంగు, అస్పష్టత, సైజ్.
  • బ్యాక్‌గ్రౌండ్ రంగు, అస్పష్టత.
  • విండో రంగు, అస్పష్టత.
  • అక్షరం అంచు స్టయిల్.
గమనిక: మీరు సెట్టింగ్‌లను మళ్లీ మార్చే వరకు లేదా ఆటోమేటిక్ క్యాప్షన్ ఫార్మాట్‌కు తిరిగి వెళ్లడానికి రీసెట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసే వరకు ఈ సెట్టింగ్‌లు మీ ఆటోమేటిక్ క్యాప్షన్‌ల ఫార్మాట్ సెట్టింగ్‌లుగా ఉంటాయి.

క్యాప్షన్‌ల టైప్ చేసిన మాటల ఫైల్‌ను చూడండి

క్యాప్షన్‌లతో కూడిన చాలా వీడియోల విషయంలో, మీరు పూర్తి క్యాప్షన్‌లతో ఉన్న టైప్ చేసిన మాటల ఫైల్‌ను చూడవచ్చు, అలాగే వీడియోలోని నిర్దిష్ట భాగాలకు వెళ్లవచ్చు.

  1. వీడియో వివరణకు వెళ్లి, టైప్ చేసిన మాటల ఫైల్‌ను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీరు వీడియోను చూస్తున్నప్పుడు, టైప్ చేసిన మాటల ఫైల్‌లో మీకు ప్రస్తుత క్యాప్షన్ టెక్స్ట్‌ను చూపడానికి సంబంధిత విభాగానికి స్క్రోల్ అవుతుంది.

  2. వీడియోలోని సంబంధిత భాగానికి వెళ్లడానికి క్యాప్షన్ టెక్స్ట్‌కు సంబంధించి ఏదైనా లైన్‌ను క్లిక్ చేయండి.

గమనిక: కొన్ని వీడియోల విషయంలో, టైప్ చేసిన మాటల ఫైల్‌లో ఎగువున ఉన్న సెర్చ్ బార్‌లో నిర్దిష్ట కీవర్డ్‌లను టైప్ చేయడం ద్వారా సెర్చ్ చేయడానికి మీకు వీలు కల్పించడం జరుగుతుంది.

టీవీ & గేమ్ కన్సోల్‌లలో క్యాప్షన్‌ సెట్టింగ్‌లు

మీరు YouTube‌ను సపోర్ట్ చేసే టీవీ, గేమ్ కన్సోల్, లేదా మీడియా పరికరం దేనిలో అయినా మీ క్యాప్షన్ సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.

  1. మీరు ప్లే చేస్తున్న వీడియోను పాజ్ చేయండి.
  2. క్యాప్షన్‌లు ను ట్యాప్ చేయండి.
  3. మీకు క్యాప్షన్‌లు ఏ భాషలో కావాలో, దానిని ఎంచుకోండి.
  4. క్యాప్షన్ స్టయిల్‌ను ఎంచుకోండి.
  5. మీరు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సెట్టింగ్‌లను ఎంచుకోండి. మీరు ఫాంట్‌ను అలాగే అది కనిపించే తీరును మార్చుకోవచ్చు. మీరు క్యాప్షన్‌లు డిస్‌ప్లే అయ్యే బ్యాక్‌గ్రౌండ్ అలాగే విండోను కూడా మార్చుకోవచ్చు.
గమనిక: వీడియో, క్యాప్షన్‌లను అందించకపోతే,  కనిపించవచ్చు, కానీ దానిని ఎంచుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ  కనిపించకపోతే, వీడియోకు క్యాప్షన్‌లు అందుబాటులో లేవని అర్థం.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5193277266682198484
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false