కొనుగోలు చేసిన సినిమాలను, టీవీ షోలను డౌన్‌లోడ్ చేయండి

YouTube సినిమా, టీవీ షో కొనుగోళ్లను ఇప్పుడు YouTube యాప్‌ను ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో చూడవచ్చు. మీకు ఆసక్తి ఉన్న కంటెంట్‌ను కొనుగోలు చేసిన లేదా అద్దెకు తీసుకున్న తర్వాత, దాన్ని iOS లేదా Android పరికరంలో డౌన్‌లోడ్ చేసుకుని, ఎప్పుడైనా చూడవచ్చు. మీ కంటెంట్‌ను చూడటానికి మీ పరికరాన్ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.

మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, కొనుగోలు చేయడం కోసం ఏ Google ఖాతాను అయితే ఉపయోగించారో అదే ఖాతాను ఉపయోగించి మీరు YouTube యాప్‌నకు సైన్ ఇన్ చేయాలి.

కొనుగోలు చేసిన సినిమాను లేదా టీవీ షో ఎపిసోడ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, మీరు YouTube Premium సబ్‌స్క్రయిబర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్, దానికి సపోర్ట్ ఉన్న iOS 11 లేదా అంతకంటే అధునాతనమైన వెర్షన్, Android 16.23 లేదా అంతకంటే అధునాతమైన వెర్షన్‌తో రన్ అవుతున్న పరికరాల్లోని యూజర్‌లందరికీ అందుబాటులో ఉంటుంది.

సినిమాలను, టీవీ షోల ఎపిసోడ్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా

మీరు కొనుగోలు చేసిన సినిమాలను, టీవీ షో ఎపిసోడ్‌లను గరిష్ఠంగా ఐదు పరికరాలలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అద్దెకు తీసుకున్న సినిమాలను, టీవీ షో ఎపిసోడ్‌లను ఒకసారి ఒక పరికరంలో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరొక పరికరంలో అద్దెకు తీసుకున్న వీడియోను డౌన్‌లోడ్ చేయడానికి, మీరు దాన్ని మొదటి పరికరం నుండి తీసివేసి, ఆపై ఏ పరికరంలో అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పరికరంలో మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

గమనిక: ఒకే పరికరంలో ఒకే సమయంలో మీరు YouTube యాప్‌లో, Google Play Movies & TV యాప్ రెండింటిలో సినిమాను లేదా టీవీ షో ఎపిసోడ్‌ను డౌన్‌లోడ్ చేయలేరు. మీరు కంటెంట్‌ను పైన పేర్కొన్న ఒక యాప్‌లో డౌన్‌లోడ్ చేయడానికి ముందు, దాన్ని మరొక యాప్‌లోని 'డౌన్‌లోడ్‌లు' విభాగం నుండి తీసివేయాలి. YouTubeలో, డౌన్‌లోడ్ చేసిన కంటెంట్‌ను తీసివేయడానికి సంబంధించిన సమాచారం కోసం మీరు ఇక్కడ దిగువ అందించిన సమాచారాన్ని చదవచ్చు. మీరు Google Play Movies & TV యాప్‌లో, డౌన్‌లోడ్ చేసిన కంటెంట్‌ను ఎలా తీసివేయాలి అనే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.

అద్దెకు తీసుకున్న లేదా కొనుగోలు చేసిన సినిమాను లేదా టీవీ షోను ఆఫ్‌లైన్ వీక్షణ కోసం డౌన్‌లోడ్ చేయడానికి, ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. కంప్యూటర్ లేదా మొబైల్ పరికరంలో, లేదా స్మార్ట్ టీవీలో మీకు కావలసిన సినిమాను లేదా టీవీ షో ఎపిసోడ్‌లను కొనుగోలు చేయండి లేదా అద్దెకు తీసుకోండి.
  2. iOS లేదా Android పరికరాన్ని ఉపయోగించి, మీరు కంటెంట్‌ను అద్దెకు తీసుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఏ ఖాతాను అయితే ఉపయోగించారో అదే ఖాతాను ఉపయోగించి YouTube యాప్‌నకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ ఫోటో పై ట్యాప్ చేయండి.
  4. మీ సినిమాలు & టీవీ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. మీరు కొనుగోలు చేసిన లేదా అద్దెకు తీసుకున్న సినిమాలు, టీవీ షో ఎపిసోడ్‌లు మీకు కనిపిస్తాయి.
  5. ఆఫ్‌లైన్ వీక్షణ కోసం మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న సినిమా లేదా టీవీ ఎపిసోడ్‌ను ట్యాప్ చేయండి.
  6. డౌన్‌లోడ్ చేయండి ని ట్యాప్ చేయండి.
  7. వీడియో క్వాలిటీని ఎంచుకోండి. మీరు కొనుగోలు చేసిన క్వాలిటీ, డౌన్‌లోడ్ చేయడానికి ఉపయోగిస్తున్న పరికరం సపోర్ట్ చేసే క్వాలిటీపై ఆధారపడి భిన్నమైన వీడియో క్వాలిటీలు అందుబాటులో ఉంటాయి. UHD క్వాలిటీ కంటెంట్ డౌన్‌లోడ్ చేయడం కోసం అందుబాటులో ఉండదు.
  8. ఆడియో ట్రాక్ కోసం కొన్ని టైటిల్స్ పలు భాషల్లో అందుబాటులో ఉంటాయి. సినిమా లేదా టీవీ షో ఎపిసోడ్ కోసం మీకు కావలసిన ఆడియో ట్రాక్‌ను ఎంచుకోండి. గమనిక: నిర్దిష్ట సినిమాకు లేదా టీవీ షో ఎపిసోడ్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని సబ్‌టైటిల్స్ ఆఫ్‌లైన్ వీక్షణ కోసం అందుబాటులో ఉంటాయి.
  9. డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు వీడియో ప్లేయర్ దిగువున ”'డౌన్‌లోడ్ చేయబడింది” చిహ్నం  కనిపిస్తుంది.

మీరు షోకు సంబంధించిన చాలా ఎపిసోడ్‌లను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, ఒక్కో ఎపిసోడ్ విషయంలో పైన పేర్కొన్న దశలను రిపీట్ చేయండి.

నిర్దిష్ట మొబైల్ పరికరాలలో, Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే వీడియోలు, ప్లేలిస్ట్‌లు డౌన్‌లోడ్ అవుతాయి. మొబైల్ నెట్‌వర్క్ ఉపయోగించి వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి:

  1. మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.
  2. సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "బ్యాక్‌గ్రౌండ్ & డౌన్‌లోడ్‌లు" అనే విభాగంలో, Wi-Fiని ఉపయోగించి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

డౌన్‌లోడ్ చేసిన సినిమాలను, టీవీ షోల ఎపిసోడ్‌లను యాక్సెస్ చేయడం ఎలా

YouTube యాప్‌లో మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేసి, ఆపై డౌన్‌లోడ్‌లు  అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసిన సినిమాలను, టీవీ షో ఎపిసోడ్‌లను యాక్సెస్ చేయవచ్చు. 
అద్దె వ్యవధుల విషయంలో: మీ సినిమా లేదా టీవీ షో ఎపిసోడ్‌లు అద్దె వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. మీరు సినిమాను లేదా టీవీ షో ఎపిసోడ్‌ను అద్దెకు తీసుకున్న తర్వాత, దాన్ని చూడటం ప్రారంభించడానికి మీకు 30 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి మీరు సినిమాను చూడటం ప్రారంభించాక, మీ అద్దె వ్యవధి ముగిసేలోపు, ఆ సినిమాను మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడవచ్చు. సాధారణంగా అద్దె వ్యవధి 48 గంటలు ఉంటుంది, అయితే, అద్దెకు తీసుకోవడానికి చెక్ అవుట్ చేసేటప్పుడు ఆఖరి పేజీలో అద్దె వ్యవధి నోట్ చేయబడుతుంది. మరింత సమాచారం కోసం మా వినియోగ నియమాలను చూడండి.

డౌన్‌లోడ్‌ల నుండి సినిమాలను, టీవీ షోల ఎపిసోడ్‌లను తీసివేయడం ఎలా

మీ డౌన్‌లోడ్‌ల నుండి సినిమాను లేదా టీవీ షో ఎపిసోడ్‌ను తీసివేయడానికి:
  1. YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  2. డౌన్‌లోడ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న డౌన్‌లోడ్ చేసిన సినిమాను లేదా టీవీ ఎపిసోడ్‌ను కనుగొనండి.
  4. సినిమా లేదా టీవీ షో ఎపిసోడ్ పక్కన ఉన్న మెనూ ను ట్యాప్ చేయండి.
  5. డౌన్‌లోడ్‌ల నుండి తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4116509258374697943
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false