ఒక అంశం గురించి Google శోధనలో కొత్త ఫలితాలు చూపబడినప్పుడు మీరు ఇమెయిల్‌లను అందుకుంటారు. ఉదాహరణకు, మీరు వార్తలు, ఉత్పత్తులు లేదా మీ పేరు ప్రస్తావనల గురించిన సమాచారాన్ని మీరు పొందగలరు.
అలర్ట్‌ను సృష్టించండి
- 'Google Alerts'కు వెళ్లండి.
- పైభాగంలోని పెట్టెలో, మీరు ఫాలో కావాలనుకుంటున్న అంశాన్ని ఎంటర్ చేయండి.
- మీ సెట్టింగ్‌లను మార్చడానికి, 'ఎంపికలను చూపించు' క్లిక్ చేయండి. మీరు వీటిని మార్చవచ్చు:
- మీరు నోటిఫికేషన్‌లను ఎంత తరచుగా పొందాలి
- మీకు కనిపించే సైట్‌ల రకాలు
- మీ భాష
- మీరు సమాచారం పొందాలనుకుంటున్న రంగం
- మీరు ఎన్ని ఫలితాలను చూడాలనుకుంటున్నారు
- ఏయే ఖాతాలు అలర్ట్‌ను పొందుతాయి
- 'అలర్ట్‌ను సృష్టించు' ఎంపికను క్లిక్ చేయండి. మేము సరిపోలే శోధన ఫలితాలు కనుగొన్నప్పుడు ఎప్పుడైనా ఇమెయిల్‌లను పొందుతారు.
అలర్ట్‌ను ఎడిట్ చేయండి
- 'Google Alerts'కు వెళ్లండి.
- అలర్ట్ పక్కన, 'ఎడిట్ చేయి ' ఎంపికను క్లిక్ చేయండి.
- మీకు ఎంపికలు ఏవీ కనిపించకుంటే, 'ఎంపికలను చూపించు' క్లిక్ చేయండి.
- మీ మార్పులు చేయండి.
- 'అలర్ట్‌ను అప్‌డేట్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
- మీరు అలర్ట్‌లను పొందే విధానం మార్చడానికి, 'సెట్టింగ్‌లు ' క్లిక్ చేసి మీరు కోరుకునే ఎంపికలను ఎంచుకుని, 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.
అలర్ట్‌ను తొలగించండి
- 'Google Alerts'కు వెళ్లండి.
- మీరు తీసివేయాలనుకుంటున్న అలర్ట్ పక్కన, 'తొలగించు ' ఎంపికను క్లిక్ చేయండి.
- ఐచ్ఛికం: అలర్ట్ ఇమెయిల్ దిగువున, 'సభ్యత్వాన్ని తొలగించు' క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు అలర్ట్‌ను తొలగించవచ్చు.
అల్టర్‌లు పొందడం లేదా చూడటంలో సమస్యలను పరిష్కరించండి
దశ 1: మీరు లాగిన్ చేసిన ఖాతా ఏదో చూడండి
- 'Google Alerts'కు వెళ్లండి.
- మీ ప్రస్తుత ఖాతా కోసం Google బార్‌ను ఎంచుకోండి.
- మీరు సరైన ఖాతాలో లేకుంటే, మీ 'ప్రొఫైల్ చిత్రం సైన్ అవుట్ చేయి' ఎంపికలను క్లిక్ చేయండి.
- సరైన ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
దశ 2: మీ అలర్ట్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి
- 'Google Alerts'కు వెళ్లండి.
- మీ అలర్ట్‌లు డిజేబుల్ చేసినట్లుగా సూచించే సందేశం మీకు కనిపిస్తే, 'ఎనేబుల్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
- "నా అలర్ట్‌లు" విభాగంలో, మీరు ఫలితాలను చూడాలనుకుంటున్న అలర్ట్‌ను క్లిక్ చేయండి.
- మీ ఇమెయిల్ చిరునామా, సెట్టింగ్‌లను తనిఖీ చేయడానికి, 'ఎంపికలను చూపించు' క్లిక్ చేయండి.
దశ 3: మీ ఇమెయిల్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి
మీరు ఎగువున దశలను అనుసరించి ఉంటే, ఇప్పటికీ కొత్త అలర్ట్‌లను పొందకుంటే, మీ ఇమెయిల్ ఖాతాలో తనిఖీ చేయండి:
- మీ ఇన్‌బాక్స్ నిండిపోలేదని నిర్ధారించుకోండి.
- Google అలర్ట్ ఇమెయిల్‌లు మీ స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్లడం లేదని నిర్ధారించుకోండి. మీరు Gmailను ఉపయోగించినట్లయితే, మీ కాంటాక్ట్‌లకు 'googlealerts-noreply@google.com'ను జోడించండి.