Googleలో సెర్చ్ చేయండి

Googleలో సులభంగా సమాచారాన్ని కనుగొనడంలో సహాయపడేందుకు కావలసిన కొన్ని చిట్కాలు మరియు సూచనలను ఇక్కడ అందిస్తున్నాము.

చిట్కా 1: ప్రాథమిక అంశాలతో మొదలుపెట్టండి

మీరు వెతికేది దేని గురించి అయినప్పటికీ, సమీప విమానాశ్రయం ఎక్కడ ఉంది? లాంటి సాధారణ సెర్చ్‌తో ప్రారంభించండి. ఒకవేళ అవసరమైతే మరిన్ని వివరణలతో కూడిన పదాలను మీరు జోడించవచ్చు.

మీరు ఒక నిర్దిష్ట లొకేషన్‌లో స్థలం లేదా ప్రోడక్ట్ కోసం చూస్తున్నట్లయితే, మీ సెర్చ్‌లో లొకేషన్‌ను జోడించండి. ఉదాహరణకు, బేకరీ హైదరాబాద్.

చిట్కా 2: మీ వాయిస్‌తో సెర్చ్ చేయండి

మీ వాయిస్‌తో సెర్చ్ చేయడానికి,  మైక్రోఫోన్‌ను ట్యాప్ చేయండి. మీ వాయిస్‌తో ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకోండి.

చిట్కా 3: పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి

మీరు వెతుకుతున్న సైట్‌లో కనిపించే అవకాశం ఉన్న పదాలను ఉపయోగించండి. ఉదాహరణకు, నాకు తల నొప్పిగా ఉంది అని చెప్పడానికి బదులుగా, తలనొప్పి అని చెప్పండి, ఎందుకంటే మెడికల్ సైట్‌లలో ఆ పదాన్నే ఉపయోగిస్తూ ఉంటారు.

చిట్కా 4: చిన్న విషయాల గురించి పట్టించుకోకండి

  • స్పెల్లింగ్: మీరు స్పెల్లింగ్ సరిగ్గా పేర్కొన్నా, పేర్కొనకపోయినా, ఇచ్చిన పదానికి Google స్పెల్-చెకర్ అత్యంత సాధారణమైన స్పెల్లింగ్‌ను ఆటోమేటిక్‌గా వాడుతుంది. 
  • క్యాపిటలైజేషన్: Eenadu అని సెర్చ్ చేసినా లేదా eenadu అని సెర్చ్ చేసినా ఒకటే.

చిట్కా 5: క్విక్ ఆన్సర్స్‌ను కనుగొనండి

చాలా సెర్చ్‌లకు, సెర్చ్ ఫలితాల్లో Google నేరుగా సమాధానాలను అందిస్తుంది. స్పోర్ట్స్ టీమ్‌ల గురించిన వివరాల వంటి కొన్ని ఫీచర్‌లు, అన్ని ప్రాంతాలలో అందుబాటులో లేవు. 

  • వాతావరణం: మీ లొకేషన్‌లో వాతావరణం గురించి తెలుసుకోవడానికి, వాతావరణం అని సెర్చ్ చేయండి, లేదా వాతావరణం హైదరాబాద్ లాగా, నగరం పేరును జోడించి, నిర్దిష్ట ప్రదేశంలో వాతావరణం గురించి తెలుసుకోండి.
  • డిక్షనరీ: ఏదైనా పదానికి, నిర్వచనాన్ని కనుగొనడానికి, ఆ పదం ముందు నిర్వచించండి అని జోడించండి.
  • లెక్కలు: 3*9123 లాంటి మ్యాథ్ ఈక్వేషన్‌ను ఎంటర్ చేయండి, లేదా కష్టమైన గ్రాఫింగ్ ఈక్వేషన్‌ల లెక్కలకు సమాధానాలను కనుగొనండి.
  • యూనిట్ కన్వర్షన్‌లు: 3 డాలర్లు, రూపాయిలలో లాంటి ఏదైనా కన్వర్షన్‌ను ఎంటర్ చేయండి.
  • క్రీడలు: షెడ్యూల్, గేమ్ స్కోర్‌లు ఇంకా మరిన్నింటిని కనుగొనడానికి, మీ టీమ్ పేరు కోసం సెర్చ్ చేయండి. 
  • క్విక్ ఫ్యాక్ట్స్: సెలబ్రిటీ పేరు, లొకేషన్, సినిమా లేదా పాట కోసం సెర్చ్ చేసి, ఆ సమాచారాన్ని కనుగొనండి. 

నిపుణుల సెర్చ్ చిట్కాలు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2275368606253168035
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false