భాగస్వామితో షేరింగ్‌ను సెటప్ చేయండి

ప్రత్యేక వ్యక్తుల ఫోటోలను లేదా నిర్దిష్ట తేదీ నుండి ఫోటోలను షేర్ చేయవచ్చు. ఫోటోలు మీ ఖాతాకు బ్యాకప్ చేయబడి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా షేర్ చేయబడతాయి.

ముఖ్య గమనిక: నిర్దిష్ట వ్యక్తుల ఫోటోలను షేర్ చేయడం, అన్ని భౌగోళిక ప్రాంతాలలో అందుబాటులో లేదు.

మీరు ప్రారంభించే ముందు

డౌన్‌లోడ్ చేసి, Google ఫోటోలు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

పార్టనర్‌తో మీ ఫోటోలను షేర్ చేయండి

ముఖ్య గమనిక: మీతో షేర్ చేసిన ఫోటోకు సంబంధించిన వెర్షన్‌కు మీరు చేసే మార్పులు, మీ పార్ట్‌నర్ ఇప్పటికే సేవ్ చేసిన కాపీలకు వర్తించదు. ఇందులో మీ లాక్ చేసిన ఫోల్డర్‌కు చేసే ఏవైనా ఎడిట్‌లు, తొలగింపులు లేదా బదిలీలు ఉంటాయి. లాక్ చేసిన ఫోల్డర్ గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ పార్ట్‌నర్‌తో షేర్ చేసినప్పుడు, మీరు షేర్ చేయడానికి ఎంచుకున్న ఫోటోలను బ్యాకప్ చేసిన వెంటనే వారు స్వీకరిస్తారు. పార్ట్‌నర్ షేరింగ్ కోసం మీ పార్ట్‌నర్ మీ ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత, వారు తమ ఫోటోలను మీతో తిరిగి షేర్ చేసుకోవడానికి పార్ట్‌నర్ షేరింగ్‌ను ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా పేరులోని మొదటి అక్షరం ఆ తర్వాత Google Photos సెట్టింగ్‌లు ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. షేరింగ్ ఆ తర్వాత పార్ట్‌నర్ షేరింగ్ ఆ తర్వాత ప్రారంభించండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  5. ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి లేదా ఎంచుకోండి. మీరు Google ఖాతా ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించగలరు.
  6. మీ భాగస్వామి ఖాతాకు ఏ ఫోటోలు జోడించాలో ఎంచుకోండి.
  7. తర్వాత అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  8. అన్నీ సరిగ్గా ఉన్నట్లు అనిపిస్తే, ఆహ్వానాన్ని పంపండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  9. ఆప్షనల్: మీ పార్ట్‌నర్ ఫోటోలను చూడడానికి, వారు మీ ఆహ్వానాన్ని ఆమోదించిన తర్వాత వారిని మీతో ఫోటోలు షేర్ చేయమని అడగండి.

వేరొక వ్యక్తితో పార్ట్‌నర్ షేరింగ్ చేయడానికి, లేదా ఆహ్వానాన్ని అందుకోవడానికి, ప్రస్తుత పార్టనర్‌తో షేరింగ్‌ను ఆపండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఫేస్ గ్రూప్‌ల ఆధారంగా ఫిల్టర్ చేయండి

ఫేస్ గ్రూప్‌లు పర్‌ఫెక్ట్ కాదు. ఫేస్ గ్రూప్‌లతో ఫిల్టర్ చేసినప్పుడు కొన్నిసార్లు మీరు ఎంచుకున్న వ్యక్తులలో ఎవరు లేని ఫోటోలను షేర్ చేయవచ్చు.

తేదీ ఆధారంగా ఫిల్టర్ చేయండి

కొన్నిసార్లు, ఫోటో తేదీ తప్పుగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఫోటో స్కాన్ చేయబడినా, లేదా కెమెరా గడియారం సరిగా సెట్ చేయకపోయినా, ఫోటోకు తప్పు తేదీ ఉండవచ్చు. తేదీ ఆధారంగా ఫిల్టర్ చేసినప్పుడు, కొన్నిసార్లు ఎంచుకోబడిన తేదీ పరిధిలో లేని షేర్ చేసిన ఫోటోలు ఫలితంగా రావచ్చు.

భాగస్వామితో షేరింగ్ ఆహ్వానాన్ని ఆమోదించండి

  1. మీ iPhone లేదా iPadలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. ఏ Google ఖాతాకు అయితే ఆహ్వానం వచ్చిందో దానితో సైన్ ఇన్ చేయండి.
  3. పైన, షేరింగ్ ను ట్యాప్ చేయండి.
    • ముఖ్య గమనిక: కొంత మంది యూజర్‌ల కోసం, షేరింగ్ ఆప్షన్ కింద ఉంటుంది.
  4. మీరు ఆమోదించాలనుకున్న ఆహ్వానాన్ని ట్యాప్ చేయండి ఆ తర్వాత ఆమోదించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఆప్షనల్: మీరు మీ పార్టనర్‌తో తిరిగి మీ ఫోటో లైబ్రరీని షేర్ చేయవచ్చు. పైన ఉన్న, మరిన్ని 더보기 ఆ తర్వాత తిరిగి షేర్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

చిట్కా: మీకు తెలియని వారు మీతో పార్ట్‌నర్ షేరింగ్‌ను ప్రారంభించినట్లయితే, ఆహ్వానాన్ని ఆమోదించిన తర్వాత మీరు వారిని బ్లాక్ చేయవచ్చు. ఒక వ్యక్తిని ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

మీ పార్టనర్ ఫోటోలను కనుగొనండి

  1. మీ iPhone లేదా iPadలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. ఎగువున, షేరింగ్ ను ట్యాప్ చేయండి.
    • ముఖ్య గమనిక: కొంత మంది యూజర్‌ల కోసం, షేరింగ్ ఆప్షన్ దిగువున ఉంటుంది.
  4. మీ పార్ట్‌నర్ పేరును ట్యాప్ చేయండి.
మీ పార్టనర్ ఫోటోలను సేవ్ చేయండి

మీరు మీ పార్ట్‌నర్ ఫోటోలను సేవ్ చేస్తే, అవి మీ Google Photos ఖాతా, ఫోటోల వీక్షణ, సెర్చ్ ఫలితాలు, ఇంకా జ్ఞాపకాలలో కనిపిస్తాయి.

మీ పార్ట్‌నర్, పార్ట్‌నర్ షేరింగ్ ద్వారా మీతో షేర్ చేయడం కొనసాగించేంత వరకు, పార్ట్‌నర్ షేరింగ్ నుండి మీరు సేవ్ చేసే ఫోటోలు, వీడియోలు మీ స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడవు.

  1. మీ iPhone లేదా iPadలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా పేరులోని మొదటి అక్షరం ఆ తర్వాత Google Photos సెట్టింగ్‌లు ఆ తర్వాత షేరింగ్ ఆ తర్వాత పార్ట్‌నర్ షేరింగ్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. సెట్టింగ్‌లను మార్చడానికి మీ ఫోటోలను సేవ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • అన్ని ఫోటోలు: మీ పార్టనర్ షేర్ చేసిన ఫోటోలు సేవ్ చేయబడతాయి.
    • నిర్దిష్ట వ్యక్తుల ఫోటోలు: మీ ఫేస్ గ్రూప్‌ల నుండి ఎంచుకోండి. Google Photos మీ పార్టనర్ ఫోటోల నుండి ఏవైనా ఫేస్ గ్రూప్‌లను గుర్తించినప్పుడు, అది ఆటోమేటిక్‌గా ఫోటోలను మీ Google Photos ఖాతాలో సేవ్ చేస్తుంది.

మీ పార్ట్‌నర్‌ వారి ఫోటోల ఖాతా నుండి ఫోటోను తొలగిస్తే, అది పార్ట్‌నర్ షేరింగ్ నుండి తీసివేయబడుతుంది. మీరు ఫోటోను తొలగించకముందే సేవ్ చేసినట్లయితే, మీరు దాన్ని ఇప్పటికీ మీ ఫోటోల లైబ్రరీలో కనుగొనవచ్చు.

మీ పార్టనర్ నుండి మీరు ఇటీవల సేవ్ చేసిన ఫోటోలను తొలగించండి
మీ పార్టనర్ ఫోటోల నుండి సేవ్ చేసిన ఫోటోను మీరు తొలగించినట్లయితే, అది మీ పార్టనర్ ఖాతా నుండి తొలగించబడదు.
  1. మీ కంప్యూటర్‌లో, photos.google.com/search/_tra_కు వెళ్లండి. ఈ పేజీలో, మీ పార్టనర్ నుండి సేవ్ చేసిన ఫోటోలతో పాటు ఏవైనా ఇటీవల జోడించిన ఫోటోలు కూడా ఉంటాయి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న ఫోటోను ఎంచుకోండి.
  3. తొలగించండి తొలగించండిని ఎంచుకోండి.

నోటిఫికేషన్‌లను ఆపివేయండి

  1. మీ iPhone లేదా iPadలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. ఆహ్వానించిన Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా పేరులోని మొదటి అక్షరం ఆ తర్వాత Google Photos సెట్టింగ్‌లు ఆ తర్వాత షేరింగ్ ఆ తర్వాత పార్ట్‌నర్ షేరింగ్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి.

పార్టనర్‌ను తీసివేయండి

మీరు మీ పార్ట్‌నర్‌ను తీసివేస్తే, మీరు షేర్ చేసిన ఫోటోలను వారు యాక్సెస్ చేయలేరు, అలాగే మీరు వారి ఫోటోలను యాక్సెస్ చేయలేరు. మీరు, అలాగే మీ పార్ట్‌నర్ మీ Google Photos ఖాతాలో ఇప్పటికే సేవ్ చేసిన ఏవైనా ఫోటోలను ఇప్పటికీ కనుగొనగలరు. మీరు ఎప్పుడైనా తీసివేయబడిన పార్ట్‌నర్‌తో మళ్లీ షేర్ చేయవచ్చు. మీ పార్ట్‌నర్ ఫోటోలను సేవ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
  1. మీ iPhone లేదా iPadలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. ఆహ్వానించిన Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా పేరులోని మొదటి అక్షరం ఆ తర్వాత Google Photos సెట్టింగ్‌లు ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. షేరింగ్ ఆ తర్వాత పార్ట్‌నర్ షేరింగ్ ఆ తర్వాత పార్ట్‌నర్‌ను తీసివేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

ఫోటోకు మీ పార్ట్‌నర్ యాక్సెస్‌ను తీసివేయండి

మీరు పార్ట్‌నర్ షేరింగ్ నుండి ఫోటోను తీసివేస్తే, పార్ట్‌నర్ షేరింగ్‌లో మీ పార్ట్‌నర్ ఆ ఫోటోను యాక్సెస్ చేయలేరు. మీ పార్ట్‌నర్ ఇప్పటికీ వారి Google Photos ఖాతాలో ఇప్పటికే సేవ్ చేసిన ఫోటోలను కనుగొనగలరు.

ముఖ్య గమనిక: మీరు మీ స్వంత ఫోటోలను మాత్రమే తీసివేయగలరు.

  1. మీ iPhoneలో లేదా iPadలో, Google Photos యాప్ ను తెరవండి.
  2. పైన, షేరింగ్ ను ట్యాప్ చేయండి.
    • ముఖ్య గమనిక: కొంత మంది యూజర్‌ల కోసం, షేరింగ్ ఆప్షన్ కింద ఉంటుంది.
  3. పార్ట్‌నర్ షేరింగ్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న ఫోటోను ట్యాప్ చేయండి.
  5. పైన ఉన్న, మరిన్ని ఆ తర్వాత తీసివేయండి ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13765703126724176791
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false