ఆల్బమ్ షేరింగ్‌ను ఆపివేసి, సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

'Google ఫోటోల'లో మీరు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు లేదా ఆల్బమ్‌లను ఎవరు కనుగొనగలరు అనే దానిని మీరు మార్చవచ్చు. ఆల్బమ్‌కు మీరు ఓనర్ అయినప్పుడు మాత్రమే ఇలా చేయగలరు.

ఆల్బమ్ షేర్ చేయడం ఆపండి

మీరు ఆల్బమ్‌ను షేర్ చేయడం ఆపివేస్తే:

  • ఇతర వ్యక్తులు మీ ఆల్బమ్‌ను చూడటం సాధ్యం కాదు.
  • ఇతర వ్యక్తులు జోడించిన కామెంట్‌లు, ఫోటోలు తీసివేయబడతాయి.
ఆల్బమ్ షేర్ చేయడాన్ని ఆపివేయడానికి, అందరు ఆల్బమ్ మెంబర్‌లను తీసివేసి, లింక్ షేరింగ్‌ను ఆఫ్ చేయండి. షేర్ చేసిన ఆల్బమ్ కంట్రోల్‌లు మీ ఫోటోలకు మరింత గోప్యతను ఎలా అందిస్తాయో తెలుసుకోండి.

గమనిక: ఒకవేళ వేరెవరో ఇప్పటికే మీరు షేర్ చేసిన ఫోటోలు లేదా వీడియోలను డౌన్‌లోడ్ లేదా కాపీ చేసుకున్న తర్వాత, షేరింగ్‌ను ఆఫ్ చేసినప్పటికీ ఆ డౌన్‌లోడ్‌లు లేదా కాపీలను తొలగించడం సాధ్యం కాదు.

లింక్ షేరింగ్‌ను ఆన్ & ఆఫ్ చేయండి

  1. కోరుకున్న ఆల్బమ్‌ను తెరిచి, 'మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఆప్షన్‌లు'పై క్లిక్ చేయండి.
  2. లింక్ షేరింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, పక్కన ఉన్న టోగుల్‌ను క్లిక్ చేయండి.

ఆల్బమ్ నుంచి వేరొకరిని తీసివేయండి

ఆల్బమ్ నుంచి వేరొకరిని తీసివేయాలంటే మీరు తప్పనిసరిగా దాని ఓనర్ అయ్యుండాలి.

  1. కావాల్సిన ఆల్బమ్‌ను తెరవండి.
  2. మరిన్నిమరిన్ని ఆ తర్వాతఆప్షన్‌లును క్లిక్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న కాంటాక్ట్‌ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
  4. మరిన్ని మరిన్ని ఆ తర్వాత వ్యక్తిని తీసివేయిని క్లిక్ చేయండి.
Important: If you share an album by link, you will need to turn link sharing off so people you remove can't rejoin.

ఇతరులు ఆల్బమ్‌కు ఫోటోలు జోడించకుండా ఆపండి

ఒకవేళ "సహకరించు" ఆన్ చేసి ఉంటే, మీ ఆల్బమ్ షేరింగ్ లింక్ కలిగి ఉన్న ఎవరైనా ఫోటోలను జోడించవచ్చు. 

ఫోటోలు జోడించకుండా వ్యక్తులను ఆపడం కోసం:

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపు, షేరింగ్ ను క్లిక్ చేయండి.
  3. ఆల్బమ్‌ను తెరవండి.
  4. ఎగువున కుడివైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఆప్షన్‌లు క్లిక్ చేయండి.
  5. సహకారాన్ని ఆఫ్ చేయండి.

గమనికలు:

  • ఐటెమ్‌లు జోడించకుండా మీరు స్వతంత్ర వ్యక్తులను ఆపలేరు, కానీ ఐటెమ్‌లు జోడించకుండా ప్రతిఒక్కరినీ ఆపగలరు. ఆపితే అందర్నీ ఆపాలి తప్ప ఒక్కొక్కరుగా ఆపలేరు.
  • ఇతర వ్యక్తులు జోడించిన ఫోటోలు, మీరు తీసివేస్తే తప్ప ఇప్పటికీ మీకు కనిపిస్తాయి.

ఆల్బమ్‌ను వదిలిపెట్టండి

మీరు ఆల్బమ్‌ను వదిలిపెట్టినప్పుడు, మీ ఫోటోలు, కామెంట్‌లు తీసివేయబడతాయి.

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపు, షేరింగ్ ను క్లిక్ చేయండి.
  3. ఆల్బమ్‌ను తెరవండి.
  4. మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఆప్షన్‌లు ఆ తర్వాత ఆల్బమ్ నుండి వైదొలగండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి. 
ముఖ్య గమనిక: మీరు ఆల్బమ్ ఓనర్ అయితే మీరు ఆల్బమ్‌ను ఖాళీగా ఉంచకూడదు. మీరు ఇకపై ఆల్బమ్‌ను యాక్సెస్ చేయకూడదనుకుంటే, మీరు ఆల్బమ్‌ను అందరి కోసం తొలగించవచ్చు.

మీ లైక్‌లు, కామెంట్‌లు మేనేజ్ చేయండి

కామెంట్‌లను, లైక్‌లను జోడించకుండా వ్యక్తులను ఆపండి

ఒకవేళ మీరు కామెంట్ చేయడాన్ని ఆఫ్ చేస్తే, వ్యక్తులు మీ ఫోటోలను లైక్ చేయలేరు. మీరు తొలగించే వరకు ఇప్పటికే ఉన్న లైక్‌లు, కామెంట్‌లను చూడవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపు, షేరింగ్ ను క్లిక్ చేయండి.
  3. మీరు క్రియేట్ చేసిన ఆల్బమ్‌ను తెరవండి.
  4. ఎగువున కుడివైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఆప్షన్‌లు క్లిక్ చేయండి.
  5. కామెంట్‌లు, లైక్‌లను ఆఫ్ చేయండి.

అన్ని కామెంట్‌లను చూడండి

మీరు చేసిన అన్ని కామెంట్‌లు, లైక్‌లను చూడటానికి లేదా తొలగించడానికి, 'యాక్టివిటీ లాగ్'కు వెళ్లండి.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4171762664700024509
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false