మీ ఫోటోల లొకేషన్‌లను అర్థం చేసుకోండి, కనుగొనండి, అలాగే ఎడిట్ చేయండి

మీ ఫోటోలు ఎక్కడ తీశారు అనే దాని ఆధారంగా, మీ ఫోటోలను ఆర్గనైజ్ చేయడానికి, సెర్చ్ చేయడానికి, అలాగే అన్వేషించడానికి మీరు మీ ఫోటోల లొకేషన్‌లను ఉపయోగించవచ్చు.

కింద పేర్కొన్న సందర్భాలలో మీ ఫోటోలకు లొకేషన్ ఉండే అవకాశం ఉంది:

  • ఫోటోతో సహా మీ లొకేషన్‌ను మీ పరికర కెమెరా సేవ్ చేసినప్పుడు.
  • మీరు లొకేషన్‌ను జోడించినప్పుడు.
  • మీ ఫోటోలో గుర్తించిన ల్యాండ్‌మార్క్‌లు, అలాగే ఇతర ఫోటోలలోని లొకేషన్‌లు వంటి సమాచారం ఆధారంగా Google Photos మీ లొకేషన్‌ను అంచనా వేసినప్పుడు.

మీ ఫోటోల లొకేషన్‌ను మేనేజ్ చేయండి

మీ ఫోటో లేదా వీడియో లొకేషన్ సమాచారాన్ని మేనేజ్ చేయడానికి, మీరు లొకేషన్ లేని ఫొటోకు దాన్ని జోడించవచ్చు, లేదా Photos జోడించిన ఎస్టిమేటెడ్ లొకేషన్‌ను ఎడిట్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు.

ఒక లొకేషన్‌ను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. ఫోటో లేదా వీడియోను తెరవండి.
  3. సమాచారం సమాచారం ఆ తర్వాత లొకేషన్‌ను జోడించండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
    • మీ ఇటీవలి లొకేషన్‌ల నుండి ఒక లొకేషన్‌ను జోడించండి లేదా ఎంపిక చేయండి.

ఎస్టిమేటెడ్ లొకేషన్‌ను ఎడిట్ చేయండి లేదా తీసివేయండి

ముఖ్య గమనిక: మీరు ఎస్టిమేటెడ్ లొకేషన్‌లను అప్‌డేట్ చేయడం లేదా తీసివేయడం మాత్రమే చేయగలరు. ఫోటో లేదా వీడియోకు సంబంధించిన లొకేషన్ ఆటోమేటిక్‌గా మీ కెమెరా ద్వారా జోడిస్తే, మీరు లొకేషన్‌ను ఎడిట్ చేయడం లేదా తీసివేయడం చేయలేరు.

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. ఫోటో లేదా వీడియోను తెరవండి.
  3. సమాచారం సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లొకేషన్ పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాతఎడిట్ చేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
    • మీ ఇటీవలి లొకేషన్‌ల నుండి ఒక లొకేషన్‌ను జోడించండి లేదా ఎంపిక చేయండి.
    • ఎస్టిమేటెడ్ లొకేషన్‌ను తీసివేయడానికి, లొకేషన్‌నుతీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు పలు ఫోటోలకు సంబంధించిన లొకేషన్‌ను ఎడిట్ కూడా చేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.com కు వెళ్లండి.
  2. మీకు కావలసిన ఫోటోలను ఎంచుకోండి.
  3. మరిన్ని మరిన్ని ఆ తర్వాత లొకేషన్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
    • లొకేషన్‌ను జోడించండి లేదా ఎంచుకోండి.
    • లొకేషన్‌ను తీసివేయడానికి, లొకేషన్‌ను తీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: మీరు పలు ఫోటోలు లేదా వీడియోలను ఎంపిక చేసినప్పుడు, మీ కెమెరా ద్వారా జోడించిన లొకేషన్ సమాచారాన్ని ఎడిట్ చేయడం Google Photosకు సాధ్యం కాదని మీకు తెలియజేస్తుండవచ్చు. కొనసాగించడానికి, ఆ ఫోటోలు లేదా వీడియోల ఎంపికను తొలగించండి.

మిస్ అయిన లొకేషన్‌లను ఎస్టిమేట్ చేయండి

ముఖ్య గమనిక: మీరు లొకేషన్ ఎస్టిమేట్‌ను ఆఫ్ చేసినట్లయితే, మునుపటి ఎస్టిమేటెడ్ లొకేషన్‌లు తీసివేయబడవు, కానీ మీరు వాటిని ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లో, photos.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున, సెట్టింగ్‌లు ఆ తర్వాత లొకేషన్ అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  3. మిస్ అయిన లొకేషన్‌లను అంచనా వేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

ఒక లొకేషన్‌తో ఫోటోను షేర్ చేయండి

మీరు Google Photosతో ఫోటోను షేర్ చేసినప్పుడు, మీ ఫోటోకు సంబంధించిన లొకేషన్‌ను మీరు జోడిస్తే, మారిస్తే లేదా కెమెరా ద్వారా అందించబడితే అది షేర్ చేయబడవచ్చు.

మీరు క్రియేట్ చేసిన లేదా చేరిన ప్రతి షేర్ చేసిన ఆల్బమ్, లింక్ లేదా సంభాషణలో మీ లొకేషన్ షేర్ చేయబడితే మీరు కంట్రోల్ చేయవచ్చు. మీరు పార్ట్‌నర్ షేరింగ్ ఫీచర్‌ను సెటప్ చేస్తే, మీరు షేర్ చేసే అన్ని ఫోటోలలో లొకేషన్ వివరాలు ఉంటాయి. 

మీ ఫోటోల కోసం లొకేషన్‌ను షేర్ చేయడానికి మీరు ఎంచుకుంటే, కింద పేర్కొన్నట్టు జరుగుతుంది: 

  • మీరు ఫోటోకు సంబంధించిన లొకేషన్‌ను జోడించి లేదా ఎస్టిమేటెడ్ లొకేషన్‌ను ఎడిట్ చేసి, ఆపై Google Photosలో ఎవరికైనా దాన్ని షేర్ చేస్తే, మీరు లొకేషన్‌ను కూడా షేర్ చేస్తారు.
  • మీ కెమెరా ద్వారా లొకేషన్ జోడించబడిన ఫోటోను మీరు Google Photosలో షేర్ చేస్తే, ఆ ఫోటోలో కెమెరా అందించిన లొకేషన్‌ చూపబడుతుంది.
  • Google Photos ద్వారా ఎస్టిమేట్ చేసిన లొకేషన్‌తో ఉన్న ఫోటోను మీరు షేర్ చేస్తే, లొకేషన్ షేర్ చేయబడదు.

మీరు Google Photos వెలుపల షేర్ చేసే ఫోటోలు లేదా వీడియోలపై దీని ప్రభావం ఉండదు, వాటిని డౌన్‌లోడ్ చేసి, ఎవరికైనా ఈమెయిల్ చేయడం వంటివి. ఇలాంటప్పుడు, Google Photosలో మీరు చేసిన ఎడిట్‌లు లేకుండా మీ పరికరం సేవ్ చేసిన ఒరిజినల్ లొకేషన్ కనిపిస్తుంది.

మీరు మీ ఫోటోల లొకేషన్‌లను వ్యక్తుల నుండి దాచినప్పటికీ, వారు మీ ఫోటోలోని ల్యాండ్‌మార్క్‌ల ఆధారంగా లొకేషన్‌ను గుర్తించగలరు.

షేర్ చేసిన ఆల్బమ్‌లలో మీ లొకేషన్ వివరాలను షేర్ చేయండి

మీరు షేర్ చేసిన ఆల్బమ్‌లకు ఫోటోలను జోడించినప్పుడు, ప్రతి ఆల్బమ్‌లో మీ ఫోటోల లొకేషన్ వివరాలను షేర్ చేయాలా వద్ద అనేదాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. క్లిక్ షేరింగ్ .
  3. 'షేర్ చేసిన ఆల్బమ్'ను ఎంచుకోండి.
  4. ఎగువన, మరిన్ని More and then ఆప్షన్‌లును క్లిక్ చేయండి.
  5. ఫోటో లొకేషన్‌ను షేర్ చేయండిని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

మీరు కొత్త 'షేర్ చేసిన ఆల్బమ్'ను క్రియేట్ చేసినప్పుడు మీ ఫోటోల లొకేషన్ వివరాలు చేయాలా వద్దా అనేదాన్ని కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. క్లిక్ షేరింగ్ and then 'షేర్ చేసిన ఆల్బమ్'ను క్రియేట్ చేయండి.
  3. కొత్త 'షేర్ చేసిన ఆల్బమ్'కు టైటిల్‌ను, ఫోటోలను జోడించండి.
  4. ఎగువున, షేర్ చేయండి and then ఆల్బమ్ ఆప్షన్‌లు అనే ఆప్షన్‌లపై క్లిక్ చేయండి.
  5. ఫోటో లొకేషన్‌ను షేర్ చేయండిని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

చిట్కా: మీరు మొదటిసారిగా ప్రైవేట్ ఆల్బమ్‌ను షేర్ చేసినప్పుడు కూడా ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

సంభాషణలలో మీ లొకేషన్ వివరాలను షేర్ చేయండి

మీరు క్రియేట్ చేసిన కొత్త సంభాషణకు మీరు ఫోటోలను జోడించినప్పుడు, దానిలో లొకేషన్ వివరాలు చేర్చబడవు. ఆటోమేటిక్‌గా లొకేషన్ షేరింగ్ ఫీచర్ ఆఫ్ చేయబడి ఉంటుంది. 

మీరు ఒక సంభాషణను 18 ఆగస్ట్ 2021 తేదీ కంటే ముందు ప్రారంభిస్తే, మీరు గతంలో ఆ సంభాషణకు లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను ఆఫ్ చేస్తే మినహా, ఆ సంభాషణకు మీరు జోడించే లేదా గతంలో జోడించిన ఫోటోలు వాటి లొకేషన్‌లను చూపుతాయి. 

నిర్దిష్ట సంభాషణకు మీరు జోడించే లేదా జోడించిన ఫోటోల లొకేషన్ వివరాలను షేర్ చేయడానికి: 

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.com కు వెళ్లండి.
  2. మెనూ Menu and then షేరింగ్  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సంభాషణపై క్లిక్ చేయండి. 
  4. సంభాషణలో, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్‌ను క్లిక్ చేయండి.
  5. ఫోటోల లొకేషన్‌ను షేర్ చేయండి ఆప్షన్‌ను ఆన్ చేయండి.
పార్ట్‌నర్ షేరింగ్ ఫీచర్‌లో మీ లొకేషన్ వివరాలను షేర్ చేయండి 
ముఖ్య గమనిక: మీరు పార్ట్‌నర్ షేరింగ్ ఫీచర్‌ను సెటప్ చేస్తే, మీరు షేర్ చేసే అన్ని ఫోటోలలో లొకేషన్ వివరాలు ఉంటాయి. ఆగస్ట్ 18 2021 తేదీ కంటే ముందు మీరు పార్ట్‌నర్ షేరింగ్ ఫీచర్‌ను సెటప్ చేస్తే, మీ ఫోటోల లొకేషన్ సమాచారాన్ని మీరు గతంలో డిజేబుల్‌ చేసి ఉంటే మినహా, అది షేర్ చేయబడుతుంది.

పార్ట్‌నర్ షేరింగ్ ఫీచర్‌లో మీరు లొకేషన్ వివరాలను షేర్ చేస్తున్నారా లేదా చెక్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.com కు వెళ్లండి.
  2. మెనూ Menu and then షేరింగ్  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ పార్ట్‌నర్ పేరును క్లిక్ చేయండి. 
  4. ఎగువున, మరిన్ని More and then సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. “మీ పార్ట్‌నర్ యాక్సెస్ చేయగలరు” నుండి, మీరు లొకేషన్ వివరాలను షేర్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయవచ్చు.
చిట్కా: మీరు లొకేషన్ వివరాలను షేర్ చేయడం లేనట్లయితే, కానీ అలా చేయాలని అనుకుంటున్నట్లయితే, మీ పార్ట్‌నర్‌ను తీసివేసి, మళ్లీ వారిని ఆహ్వానించండి. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3089572150243486446
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false