ఫేస్ గ్రూప్స్ ఫీచర్ నిల్వ కొనసాగింపు పాలసీ

Google Photosలోని ఫేస్ గ్రూప్స్ ఫీచర్‌తో మీ ఫ్రెండ్స్ ఫోటోలను మీరు సులభంగా కనుగొనగలరు.

ఫేస్ గ్రూప్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి

ఫేస్ గ్రూప్స్ అనేది 3 దశలలో జరుగుతుంది:

  1. ఏదైనా ఫోటోలో ముఖం ఉందో లేదో మేము గుర్తిస్తాము.
  2. ఫేస్ గ్రూప్స్ ఫీచర్ ఆన్‌లో ఉంటే, అల్గారిథమ్‌లను ఉపయోగించి ముఖాల ఇమేజ్‌లను సంఖ్యాపరంగా సూచించే ఫేస్ మోడల్స్ క్రియేట్ చేయబడతాయి, ముఖాలకు చెందిన వేర్వేరు ఇమేజ్‌ల సారూప్యత సూచించబడుతుంది, అలాగే వేర్వేరు ఇమేజ్‌లు ఒకే ముఖాన్ని చూపిస్తున్నాయో లేదో అంచనా వేయబడుతుంది.
  3. చాలా సారూప్యంగా అనిపించే ముఖాలు, అవి కూడా దాదాపు ఒకే వ్యక్తికి చెందినవి అయిన ఫోటోలు ఒకటిగా ఫేస్ గ్రూప్ చేయబడతాయి. ఏదైనా ఫోటో తప్పు గ్రూప్‌లో ఉందని మీరు భావిస్తే, మీరు దాన్ని గ్రూప్ నుండి ఎప్పుడైనా తీసివేయవచ్చు.

మీరు ఏ ఫేస్ గ్రూప్‌నకు అయినా పేరు లేదా మారుపేరు లేబుల్‌ను జోడించవచ్చు.

మీరు ఫేఫేస్ గ్రూప్స్ ఫీచర్‌ను ఆఫ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది

మీరు ఫేస్ గ్రూప్స్ ఫీచర్‌ను ఆఫ్ చేస్తే, మీరు వీటన్నింటిని తొలగిస్తారు:

  • మీ ఖాతాలోని ఫేస్ గ్రూప్స్
  • ఆ ఫేస్ గ్రూప్స్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించిన ఫేస్ మోడల్‌లు
  • మీరు క్రియేట్ చేసిన ఫేస్ లేబుళ్లు

మీరు ఒక ఫోటో లేదా వీడియోను తొలగించినప్పుడు, ఏం జరుగుతుంది

మీరు ఒక ఫోటో లేదా వీడియోను తొలగిస్తే, ప్రత్యేకించి ఆ ఫోటో లేదా వీడియో నుండి నిర్వచించబడిన ఫేస్ మోడల్స్ ఏవైనా ఉంటే, వాటిని కూడా మీరు తొలగిస్తారు.

మీరు Google ఖాతాను తొలగించినప్పుడు ఏం జరుగుతుంది

మీరు Google ఖాతాను తొలగిస్తే, కింది వాటితో సహా మీ Google Photos కంటెంట్ మొత్తాన్ని మీరు తొలగిస్తారు:

  • మీ ఖాతాలోని ఫేస్ గ్రూప్స్
  • ఆ ఫేస్ గ్రూప్స్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించిన ఫేస్ మోడల్‌లు
  • మీరు క్రియేట్ చేసిన ఫేస్ లేబుళ్లు

మీ Google Photos ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, ఏం జరుగుతుంది

మీ Google Photos ఖాతా 2 సంవత్సరాలకు పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, కింది వాటితో సహా మీ ఫేస్ గ్రూప్స్ కంటెంట్ మొత్తం Google Photos నుండి తొలగించబడుతుంది:

  • మీ ఖాతాలోని ఫేస్ గ్రూప్స్
  • ఆ ఫేస్ గ్రూప్స్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించిన ఫేస్ మోడల్‌లు
  • మీరు క్రియేట్ చేసిన ఫేస్ లేబుళ్లు

సురక్షిత & పూర్తి తొలగింపును ఎనేబుల్ చేయండి

తొలగించబడిన డేటా మా స్టోరేజ్ సిస్టమ్‌ల నుండి సురక్షితంగా, పూర్తిగా తొలగించబడిందని Google ఎలా నిర్ధారిస్తుందో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16199921115628011832
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false