బ్యాంక్ ఖాతాను జోడించండి

మొదటి సారి Google Payని మీరు సెటప్ చేసినప్పుడు, ఒక భారతీయ బ్యాంక్ ఖాతాను జోడించమని మిమ్మల్ని అడుగుతారు, దాని ద్వారా మీరు డబ్బు పంపవచ్చు, అందుకోవచ్చు.

బ్యాంక్ ఖాతాను ఎలా జోడించాలి

ముఖ్య విషయం: ఎర్రర్‌లను నివారించాలంటే, బ్యాంక్ వివరాలను నమోదు చేసే సమయంలో Google Pay యాప్ నుండి నిష్క్రమించకండి.

 1. UPI చెల్లింపుల పద్ధతికి మీ బ్యాంక్ పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి తనిఖీ చేయండి. అలా లేదంటే, మీ బ్యాంక్ ఖాతా Google Payతో పని చేయదు.
 2. Google Payను తెరవండి .
  గమనిక: మీరు యాప్ తాజా వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. మీకు ఖచ్చితంగా తెలియకపోతే, యాప్‌ను అప్‌డేట్ చేయడానికి ట్రై చేయండి.
 3. పైన ఎడమవైపున, మీ ఫోటో ఆ తర్వాత బ్యాంక్ ఖాతా ట్యాప్ చేయండి.
 4. బ్యాంక్ ఖాతాను జోడించు ట్యాప్ చేయండి.
 5. జాబితా నుండి మీ బ్యాంక్‌ని ఎంచుకోండి. మీకు మీ బ్యాంక్ కనిపించకపోతే, ఇంకా మీ బ్యాంక్ Google Payతో పనిచేయడం లేదని అర్థం.
  గమనిక: మీ బ్యాంక్‌కు ధృవీకరణ SMSను పంపడానికి మీరు Google Payను అనుమతించాల్సి ఉంటుంది.
 6. మీ దగ్గర ఇప్పటికే UPI పిన్ ఉంటే, దానిని ఎంటర్ చేయమని అడుగుతుంది.
  • మీ పిన్ మీకు గుర్తు లేకుంటే, 'పిన్‌ను మర్చిపోయాను' ఎంపికను క్లిక్ చేసి, సూచనలను పాటించండి.
  • మీ దగ్గర UPI పిన్ లేనట్లయితే, మీ డెబిట్ కార్డ్ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
   గమనిక: Maestro డెబిట్ కార్డ్‌లలో గడువు ముగింపు తేదీ ఉండదు. Maestro డెబిట్ కార్డ్‌ను జోడించడానికి, గడువు ముగింపు తేదీగా 01/49ని ఉపయోగించండి.
సాధారణ సమస్యలు
మీ బ్యాంక్ ఖాతాను జోడించడం కోసం మీ ఫోన్ నంబర్‌ను నిర్ధారించడానికి ట్రై చేసినప్పుడు, “SMS పంపడం సాధ్యపడలేదు” లేదా “మొబైల్ నెట్‌వర్క్ పని చేయడం లేదు” అని మీకు మెసేజ్‌లు వస్తే, వాటికి ఈ విధమైన కారణాలు ఉండవచ్చు:
 • SMS బ్యాలెన్స్
 • SIM కార్డ్
 • నెట్‌వర్క్ కనెక్షన్

"SMS పంపడం సాధ్యపడలేదు" ఎర్రర్‌లను పరిష్కరించండి

“SMS పంపడం సాధ్యపడలేదు” అని తెలియజేసే ఎర్రర్‌లను మీరు ఎదుర్కొన్నట్లయితే, ఈ సాధారణ అంశాలను తనిఖీ చేయండి:

చిట్కా: కింద ఉన్న ఎంపికలు ఒకవేళ మీ సమస్యను పరిష్కరించడంలో సహాయపడకపోతే, సాధారణ పరిష్కార ప్రక్రియ ఎంపికలను ట్రై చేయండి.

పరికర సమస్యలు

మీ పరికరంలోనే సమస్య ఉంటే, దానిని గుర్తించడానికి:

 • మీ పరికరానికి మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి.
 • విమానం మోడ్ ఆఫ్‌లోనే ఉందని నిర్ధారించుకోండి.
 • మీ బ్యాంక్ ఖాతాతో నమోదు చేసుకున్న అదే SIM కార్డ్‌ను మీరు ఇన్‌సర్ట్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.
 • మీ పరికరాన్ని ఒకసారి ఆఫ్ చేసి, ఆపై తిరిగి ఆన్ చేయండి.
 • తర్వాత మళ్లీ ట్రై చేయండి.

​SIM కార్డ్ సమస్యలు

ముఖ్య విషయం: మీ SIM నంబర్‌కు SMS ప్లాన్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మీ SIM నంబర్‌కు యాక్టివ్‌గా ఉన్న SMS ప్లాన్ లేనట్లయితే, మీరు SMS మెసేజ్‌లు ఏవీ పంపలేరు.

మీ పరికరంలో ఒక్క SIM కార్డ్ మాత్రమే ఉన్నట్లయితే:

 1. SIM కార్డ్‌ను తీసివేయండి.
 2. 30 సెకన్లు వేచి ఉండండి.
 3. SIM కార్డ్‌ను తిరిగి స్లాట్‌లో పెట్టండి.
 4. మళ్లీ ట్రై చేయండి.

కొత్త SIM కార్డ్ లేదా ఫోన్ నంబర్

మీ దగ్గర ఉన్నది కొత్త SIM కార్డ్ అయితే, లేదా మీ SIM కార్డ్‌కు ఇటీవలే ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేసి ఉంటే, 48 గంటల వరకు వేచి ఉండి, ఆపై మళ్లీ ట్రై చేయండి.

డ్యుయల్ SIM కార్డ్‌లు

మీ పరికరంలో 2 SIM కార్డ్‌లు ఉన్నట్లయితే:

 • SIM కార్డ్‌లను అటుఇటు మార్చి, ఆపై మళ్లీ ప్రయత్నించండి.
 • ఇతర SIM కార్డ్‌ను తీసివేసి, ఆపై మళ్లీ ట్రై చేయండి

రోమింగ్

మీరు భారతదేశంలో లేనట్లయితే, మీ Android పరికర సెట్టింగ్‌లలో, మీ రోమింగ్ SIM కార్డ్ కోసం SMSలను ఆన్ చేయండి.

మీ SMSCని రిఫ్రెష్ చేయండి

మీ SMS సేవా కేంద్రం (SMSC) నంబర్ సరైనదేనని నిర్ధారించుకోవడానికి, రిఫ్రెష్ చేయండి:

 1. మీ ఫోన్‌తో, ఈ నంబర్‌కు డయల్ చేయండి: *#*#4636#*#*.
 2. 'ఫోన్ సమాచారం'పై నొక్కండి.
 3. “SMSC” కింద, రిఫ్రెష్ చేయిని ట్యాప్ చేయండి.

"మొబైల్ నెట్‌వర్క్ పని చేయడం లేదు" ఎర్రర్‌లను పరిష్కరించండి

“మొబైల్ నెట్‌వర్క్ పని చేయడం లేదు” అని తెలియజేసే ఎర్రర్‌లు మీకు వచ్చినట్లయితే, మీ నెట్‌వర్క్‌లో తాత్కాలిక అంతరాయం ఏర్పడి ఉండవచ్చు లేదా సాధారణం కంటే ఎక్కువ ట్రాఫిక్‌ను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మీరు తర్వాత మళ్లీ ట్రై చేయవచ్చు, మీ పరికరాన్ని రీస్టార్ట్ చేసి మళ్లీ ట్రై చేయండి, లేదా ఈ సాధారణ పరిష్కార ప్రక్రియ ఎంపికలను ట్రై చేయండి:

మెసేజింగ్ యాప్ కాష్‌ను క్లియర్ చేయండి

 1. మీ మొబైల్ పరికరంలో, 'సెట్టింగ్‌లు' యాప్‌ను తెరవండి.
 2. 'యాప్‌లు & నోటిఫికేషన్‌లు' ఎంపికపై నొక్కండి.
 3. మీ మెసేజింగ్ యాప్‌ను ఎంచుకోండి.
 4. స్టోరేజ్ ఆ తర్వాత కాష్‌ను క్లియర్ చేయి ట్యాప్ చేయండి.

మొబైల్ నెట్‌వర్క్‌ను రీసెట్ చేయండి

 1. మీ మొబైల్ పరికరంలో, 'సెట్టింగ్‌లు' యాప్‌ను తెరవండి.
 2. సిస్టమ్ ఆ తర్వాత రీసెట్ ఆ తర్వాత నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయిని ట్యాప్ చేయండి.
 3. సెట్టింగ్‌లను రీసెట్ చేయి ట్యాప్ చేయండి.
 4. ఒకవేళ మీ పాస్‌కోడ్, పిన్ లేదా నమూనాను అందించమని అడిగితే, వాటిని నమోదు చేయండి.
 5. మీ రీసెట్‌ను నిర్ధారించడానికి, సెట్టింగ్‌లను రీసెట్ చేయి ట్యాప్ చేయండి.

మీ SMSCని రిఫ్రెష్ చేయండి

మీ SMS సేవా కేంద్రం (SMSC) నంబర్ సరైనదేనని నిర్ధారించుకోవడానికి, రిఫ్రెష్ చేయండి:

 1. మీ ఫోన్‌తో, ఈ నంబర్‌కు డయల్ చేయండి: *#*#4636#*#*.
 2. 'ఫోన్ సమాచారం'పై నొక్కండి.
 3. “SMSC” కింద, రిఫ్రెష్ చేయిని ట్యాప్ చేయండి.

APN సెట్టింగ్‌లను రీసెట్ చేయండి

 1. మీ మొబైల్ పరికరంలో, "అప్లికేషన్‌లు" ఫోల్డర్‌ను తెరవండి.
 2. 'సెట్టింగ్‌లు' నొక్కండి.
 3. 'వైర్‌లెస్ నియంత్రణలు లేదా వైర్‌లెస్ & నెట్‌వర్క్‌లు' ఎంపికలలో ఏదో ఒకటి ట్యాప్ చేయండి.
 4. మొబైల్ నెట్‌వర్క్‌లు ఆ తర్వాత  యాక్సెస్ స్థానం పేర్లు ట్యాప్ చేయండి.
 5. మరిన్ని మరిన్నిఆ తర్వాత డిఫాల్ట్‌కు రీసెట్ చేయి ట్యాప్ చేయండి.

తర్వాతి దశలు:

మీకు Google Pay యాప్‌తో సమస్యలు ఉన్నాయా?

కింద ఉన్న బటన్‌ను క్లిక్ చేయండి

మీ సమస్యలకు సహాయం పొందండి

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?

మరింత సహాయం కావాలా?

మీ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు సాయపడే, అదనపు మద్దతు ఎంపికల కోసం సైన్ ఇన్ చేయండి