మీ UPI పిన్‌ను రీసెట్ చేయండి

మీ UPI PIN అనేది మీరు కొత్త పేమెంట్ ఖాతాను జోడించినప్పుడు లేదా లావాదేవీని జరిపినప్పుడు మీరు ఎంటర్ చేసే నంబర్.

మీరు తొలిసారి బ్యాంక్ ఖాతాను జోడించే సమయంలో UPI పిన్‌ని సెట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతుంది. మీరు ఇప్పటికే మీ బ్యాంక్ ఖాతా కోసం UPI పిన్‌ను కలిగి ఉన్నట్లయితే, మీరు Google Payలో అదే UPI పిన్‌ను ఉపయోగించవచ్చు. Google Payని ఉపయోగించి మీరు మీ UPI PINను కూడా మార్చుకోవచ్చు.

మీ UPI PINను మార్చండి

మీరు Google Payని ఉపయోగించి కూడా మీ UPI PINను మార్చుకోవచ్చు:
  1. Google Pay ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. బ్యాంక్ ఖాతాను ట్యాప్ చేయండి.
  4. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ట్యాప్ చేయండి.
  5. మరిన్ని మరిన్ని ఆ తర్వాత  UPI PINను మార్చండిని ట్యాప్ చేయండి.
  6. కొత్త UPI PINను క్రియేట్ చేయండి.
  7. మళ్లీ అదే UPI PINను ఎంటర్ చేయండి.

చిట్కా: UPI PINను 3 కంటే ఎక్కువ సార్లు మీరు తప్పుగా ఎంటర్ చేస్తే, మీ తర్వాతి లావాదేవీని చేయడానికి మీరు తప్పనిసరిగా మీ PINను రీసెట్ చేయాలి లేదా 24 గంటలు వేచి ఉండాలి. ఈ సమయంలో మీరు డబ్బును పంపలేరు, అందుకోలేరు.

మీ UPI PINను రీసెట్ చేయండి

మీరు UPI PINను మర్చిపోతే, కొత్త దాన్ని క్రియేట్ చేయవచ్చు.
ముఖ్య గమనిక: మీ UPI PINను రీసెట్ చేయడానికి, మీకు మీ డెబిట్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వివరాలు అవసరమవుతాయి.
  1. Google Pay ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ఫోటో ఆ తర్వాత బ్యాంక్ ఖాతా అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ట్యాప్ చేయండి.
  4. UPI PINని మర్చిపోయానుని నొక్కండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కా: UPI PINను 3 కంటే ఎక్కువ సార్లు మీరు తప్పుగా ఎంటర్ చేస్తే, మీ తర్వాతి లావాదేవీని చేయడానికి మీరు తప్పనిసరిగా మీ PINను రీసెట్ చేయాలి లేదా 24 గంటలు వేచి ఉండాలి. ఈ సమయంలో మీరు డబ్బును పంపలేరు, అందుకోలేరు.

FAQలు

నేను ఆధార్ కార్డ్‌తో నా UPI PINను రీసెట్ చేయలేకపోయాను

మీరు Google Payలో జోడించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాతో రిజిస్టర్ చేసిన అదే మొబైల్ నంబర్‌కు మీ ఆధార్ కార్డ్ లింక్ చేసి ఉండాలి.

మీ ఆధార్ నంబర్‌కు లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబర్‌ను కనుగొనడానికి:

  1. మీ ఫోన్‌లో, https://uidai.gov.inకు వెళ్లండి.
  2. ప్రాధాన్య భాషను ఎంచుకోండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. నా ఆధార్ ఆ తర్వాత ఆధార్ సర్వీస్‌లు ఆ తర్వాత ఈమెయిల్/మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ UPI PINను Google Payకి రీసెట్ చేసే ఆప్షన్ మీకు కనిపించకపోతే, మీ బ్యాంక్‌ను సంప్రదించండి. 
      • మీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్‌కు లింక్ చేయడంలో మీ బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది. 
    • మీ బ్యాంక్‌కు సంబంధించిన కాంటాక్ట్ వివరాలను కనుగొనడానికి, www.digisaathi.infoకు వెళ్లండి.

నేను నా ఆధార్ కార్డ్‌తో UPI PINను రీసెట్ చేయలేకపోయాను

మీ UPI PINను Google Payకి రీసెట్ చేసే ఆప్షన్‌ను కనుగొనడానికి, మీ బ్యాంక్‌ను సంప్రదించండి.

  • మీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్‌కు లింక్ చేయడంలో మీ బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది.
  • మీ బ్యాంక్‌కు సంబంధించిన కాంటాక్ట్ వివరాలను కనుగొనడానికి, www.digisaathi.infoకు వెళ్లండి.

మీ డెబిట్ కార్డ్ వివరాలతో కూడా మీ UPI PINను రీసెట్ చేయవచ్చు.

నా ఆధార్ నంబర్ తప్పు అని చెప్పే ఎర్రర్ వచ్చింది

మీరు Google Payలో జోడించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాతో రిజిస్టర్ చేసిన అదే మొబైల్ నంబర్‌కు మీ ఆధార్ కార్డ్ లింక్ చేసి ఉండాలి.

  • సరైన ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసి, మళ్లీ ట్రై చేయండి.
    • ఇప్పటికీ మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంటే, మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
      • మీ ఆధార్ వివరాలను వెరిఫై చేయండి.
      • మీ బ్యాంక్‌కు సంబంధించిన కాంటాక్ట్ వివరాలను కనుగొనడానికి, www.digisaathi.infoకు వెళ్లండి.

గమనిక: UPI PINను 3 కంటే ఎక్కువ సార్లు మీరు తప్పుగా ఎంటర్ చేస్తే, మీ తర్వాతి లావాదేవీని చేయడానికి మీరు తప్పనిసరిగా మీ PINను రీసెట్ చేయాలి లేదా 24 గంటలు వేచి ఉండాలి. ఈ సమయంలో మీరు డబ్బును పంపలేరు, అందుకోలేరు.

Android iPhone & iPad
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
440618572143166568
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false