UPI లావాదేవీల ద్వారా మీరు ఎంత డబ్బు పంపవచ్చు లేదా అందుకోవచ్చు అనే దానికి రోజువారీ పరిమితులు ఉన్నాయి.
చిట్కా: Google Payలోని లావాదేవీ పరిమితులు బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, ఇతర పేమెంట్ ఆప్షన్‌ల ఆధారంగా మారుతూ ఉంటాయి. జారీ చేసిన బ్యాంక్‌ను బట్టి UPI పరిమితుల గురించి తెలుసుకోండి.
వ్యక్తి నుండి వ్యక్తికి (P2P) మధ్య జరిగే పేమెంట్‌కు పరిమితులు
మీరు ఈ పరిమితుల్లో దేనినైనా చేరుకుంటే, వ్యక్తికి పేమెంట్ చేయలేకపోవచ్చు:
- గత 24 గంటల్లో ఒకే బ్యాంక్ ఖాతా నుండి గరిష్ఠంగా ₹1 లక్ష వరకు విజయవంతమైన పేమెంట్ మొత్తం. ఈ పరిమితిని అన్ని UPI యాప్‌లలో బ్యాంక్‌లు సెట్ చేస్తాయి.
- గత 24 గంటల్లో 20 విజయవంతమైన పేమెంట్‌లు.
- గత 30 రోజుల్లో 150 విజయవంతమైన పేమెంట్‌లు.
ఈ సమస్యలను పరిష్కరించడానికి:
- మరింత డబ్బును పంపడం కోసం తర్వాతి రోజు వరకు వేచి ఉండండి.
- తక్కువ అమౌంట్ పే చేయండి.
- వేరే బ్యాంక్ ఖాతాను ఉపయోగించి చూడండి.
కొత్త Google Pay లేదా UPI యూజర్‌గా మీ లావాదేవీ పరిమితులను తెలుసుకోండి
మీరు యాప్‌ను రీ-ఇన్‌స్టాల్ చేసి, Google యాప్‌లో మీ బ్యాంక్ ఖాతాను ఇటీవల జోడించినట్లయితే, UPI గైడ్‌లైన్స్ ఇక్కడ ఉన్నాయి:
-
Android డివైజ్‌లకు: సెక్యూరిటీ కారణాల దృష్ట్యా మీరు మొదటి 24 గంటల్లో ₹5,000 వరకు మాత్రమే బదిలీ చేయగలరు.
- iOS డివైజ్‌లకు: మీరు బ్యాంక్ ఖాతాను జోడించిన తర్వాత మొదటి 3 రోజుల్లో, ప్రతి 24 గంటలకు ₹5,000 వరకు, ఈ వ్యవధిలో గరిష్ఠంగా ₹15,000 పరిమితి బదిలీ చేయవచ్చు.
వ్యాపారులకు పేమెంట్ చేయడానికి పరిమితులు
వ్యాపారులకు అధిక-విలువైన పేమెంట్‌లను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేయడానికి, నిర్దిష్ట వ్యాపారి కేటగిరీల కోసం ఒక్కో లావాదేవీ పరిమితిని పెంచారు.
కేటగిరీ వారీగా వెరిఫై చేసిన వ్యాపారి లావాదేవీ పరిమితులు|
వ్యాపారి కేటగిరీ |
కొత్త లావాదేవీ పరిమితి |
మొత్తం రోజువారీ పరిమితి |
|
క్యాపిటల్ మార్కెట్ (మ్యూచువల్ ఫండ్స్, బ్రోకింగ్) |
₹5 లక్షలు |
₹10 లక్షలు |
|
బీమా (ప్రీమియమ్‌లు) |
₹5 లక్షలు |
₹10 లక్షలు |
|
ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) పేమెంట్‌లు) |
₹5 లక్షలు | ₹10 లక్షలు |
| ప్రయాణం | ₹5 లక్షలు | ₹10 లక్షలు |
| క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్‌లు | ₹5 లక్షలు | ₹6 లక్షలు |
| సేకరణలు | ₹5 లక్షలు | ₹10 లక్షలు |
|
బిజినెస్/వ్యాపారి (ముందుగానే ఆమోదించబడినది) |
₹5 లక్షలు | N/A |
| నగలు | ₹2 లక్షలు | ₹6 లక్షలు |
|
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా FX రిటైల్ |
₹5 లక్షలు |
₹5 లక్షలు |
|
డిజిటల్ ఖాతాను తెరవడం – టర్మ్ డిపాజిట్‌లు |
₹5 లక్షలు | ₹5 లక్షలు |
|
డిజిటల్ ఖాతాను తెరవడం – ప్రారంభ ఫండింగ్ |
₹2 లక్షలు | ₹2 లక్షలు |
|
ట్యాక్స్ పేమెంట్‌లు |
₹5 లక్షలు | ₹10 లక్షలు |
| హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ సర్వీస్‌లు | ₹5 లక్షలు | ₹10 లక్షలు |
| IPO లేదా RBI G-Sec (రిటైల్ డైరెక్ట్ స్కీమ్) | ₹5 లక్షలు | ₹15 లక్షలు |
వెరిఫై చేసిన వ్యాపారులను గుర్తించండి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెరిఫై చేసిన వ్యాపారులకు మాత్రమే అధిక పరిమితులు వర్తిస్తాయి. వెరిఫై చేసిన వ్యాపారికి సంబంధించిన సంకేతాలు:
- ఆకుపచ్చ టిక్: పేమెంట్ స్క్రీన్‌పై వ్యాపారి బ్యాంకింగ్ పేరు పక్కన ఆకుపచ్చ చెక్ మార్క్ కనిపిస్తుంది.
- మెసేజ్: మీ UPI PINను ఎంటర్ చేయడానికి ముందు, Google Pay "మీరు ఈ వ్యాపారికి ₹X,XX,XXX వరకు పేమెంట్ చేయవచ్చు" వంటి మెసేజ్‌ను చూపుతుంది.
చిట్కా: వెరిఫై చేసిన వ్యాపారికి చేసిన అధిక విలువ గల లావాదేవీ విఫలమైతే, మీ బ్యాంక్ రోజువారీ పరిమితి NPCI గరిష్ఠ విలువ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
బ్యాంక్ పరిమితులు
మీ రోజువారీ లావాదేవీలు పైన పేర్కొన్న నిర్దేశిత UPI పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ మీకు సమస్య ఎదురవుతుంటే, వేరే బ్యాంక్ ఖాతాను ఉపయోగించి చూడండి.
మీరు ఎంత పంపవచ్చు, ఎంత రిసీవ్ చేసుకోవచ్చు (అందుకోవచ్చు) అన్న దానిపై మీ బ్యాంక్, పరిమితులను పెట్టుకుని ఉండవచ్చు. మరింత సమాచారం కోసం మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
జారీ చేసిన బ్యాంక్‌ను బట్టి UPI పరిమితుల గురించి తెలుసుకోండి.
ఇతర పరిమితులు
మోసాల నుండి రక్షణ కల్పించడానికి, కొన్ని లావాదేవీలను ఫ్లాగ్ చేసి మరింతగా రివ్యూ చేసే అవకాశముంది. లావాదేవీని చేసేటప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చి, అదే సమయంలో మీరు ఇంకా పరిమితిని చేరుకోలేదని భావిస్తే, Google Pay సపోర్ట్‌ను సంప్రదించండి.
చిట్కా: మీరు ₹1 కంటే తక్కువ అమౌంట్‌ను పంపాలనుకున్నా లేదా అందుకోవాలనుకున్నా, ఆ అమౌంట్ బదిలీ సఫలం కాదు, మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది.