నోటిఫికేషన్

If you are contacting us regarding an issue with a transaction made in last 3 working days, please know that we are working closely with our banking partners to resolve them. We request you to wait for 3 working days and keep checking your latest bank statements for updates on the status of your payment.

డబ్బు పంపండి

మీరు మీ మొబైల్ పరికరంలో Google Payని ఉపయోగించి భారతదేశంలోని ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీకి డబ్బును పంపవచ్చు. అందుకోసం, మీకు ఇంటర్నెట్ కనెక్షన్, భారతీయ బ్యాంక్ ఖాతా, భారతీయ ఫోన్ నంబర్ అవసరం.

వ్యక్తులకు డబ్బు పంపడానికి, వారి కోసం సెర్చ్ చేయడానికి మీరు కింద పేర్కొన్న వాటిలో దేనినైనా ఉపయోగించవచ్చు:

  • పేరు
  • ఫోన్ నంబర్ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) నంబర్
  • UPI ID లేదా VPA (వర్చువల్ పేమెంట్ అడ్రస్)
  • బ్యాంక్ ఖాతా, భారతీయ ఆర్థిక వ్యవస్థ కోడ్ (IFSC) నంబర్
  • QR కోడ్

హోమ్‌స్క్రీన్‌లో, మీరు ఏదైనా QR కోడ్‌ను నేరుగా స్కాన్ చేయడానికి, ఎవరికైనా పేమెంట్ చేయడానికి, బ్యాంక్ బదిలీ చేయడానికి, లేదా మొబైల్ రీఛార్జ్ చేయడానికి కూడా క్విక్ చర్యల బార్‌ను ఉపయోగించవచ్చు.

భారతదేశంలో ఎక్కడ ఉన్నవారికి అయినా డబ్బు పంపండి

VPA, UPI ID లేదా ఫోన్ నంబర్ ద్వారా డబ్బు పంపండి

మీ కాంటాక్ట్‌కు ఏదైనా UPI అప్లికేషన్‌తో లింక్ చేసిన VPA లేదా UPI ID ఉంటే, మీరు కింది సూచనలను ఫాలో అయ్యి Google Pay ద్వారా డబ్బు పంపవచ్చు:

  1. మీ మొబైల్ పరికరంలో, Google Pay ని తెరవండి.
  2. ఎగువున ఉన్న సెర్చ్ బార్‌లో, గ్రహీత VPA, UPI ID, లేదా ఫోన్ నంబర్‌ను సెర్చ్ చేయండి.
  3. గ్రహీతను ఎంచుకోండి.
  4. మీరు గ్రహీతను ఎంచుకున్న తర్వాత, పేమెంట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు పంపాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేయండి.
  6. కొనసాగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. డబ్బు పంపడానికి మీ UPI PINను ఎంటర్ చేయమని మీకు ప్రాంప్ట్ వస్తుంది.

మీ UPI PINను ఎంటర్ చేసిన తర్వాత, మీ పేమెంట్ ప్రాసెస్ అవుతుంది.

QR కోడ్ ద్వారా డబ్బు పంపండి

గ్రహీతను ఈ సూచనలను ఫాలో అవ్వమని అడగండి:

  1. Google Pay ని తెరవండి.
  2. ఎగువ కుడి మూలన, వారి ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. వారి QR కోడ్‌ను షేర్ చేయడానికి, ప్రొఫైల్. చిహ్నాన్ని ట్యాప్ చేయండి.

మీరు గ్రహీతకు డబ్బు పంపడానికి, వారి QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.

నేరుగా గ్రహీత బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపండి
  1. మీ మొబైల్ పరికరంలో, Google Pay ని తెరవండి.
  2. గ్రహీతకు డబ్బు పంపేందుకు వారి బ్యాంక్ ఖాతా వివరాలను ఎంటర్ చేయడానికి, బ్యాంక్ బదిలీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. గ్రహీత బ్యాంక్ ఖాతా నంబర్‌ను, IFSC కోడ్‌ను ఎంటర్ చేయండి.
  4. కొనసాగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

ముఖ్య చిట్కాలు:

  • డబ్బు పంపడానికి మీరు మీ UPI PINను మాత్రమే ఎంటర్ చేయాలి. డబ్బును అందుకోవడానికి మీరు దానిని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
  • డబ్బు పంపిన తర్వాత, మీకు Google Payలో నోటిఫికేషన్‌ను వస్తుంది. మీకు మీ బ్యాంక్ నుండి పేమెంట్ చేయబడిన మొత్తంతో SMS కూడా అందాలి.
  • మీ లావాదేవీ విఫలమైతే, బ్యాంక్ ముందుగా మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును డెబిట్ చేసి, ఆపై దానిని రీఫండ్ చేయవచ్చు. ఈ సందర్భంలో, మీరు డెబిట్, రీఫండ్ కోసం రెండు SMSలను అందుకోవచ్చు.
  • మీరు డబ్బు పంపేటప్పుడు, సరైన వివరాలను ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి. మీరు UPI ద్వారా డబ్బు పంపిన తర్వాత, దాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు.

మీరు ఎవరినైనా కనుగొనలేకపోవడానికి గల సాధారణ కారణాలు

Google Payలో, “మిమ్మల్ని కనుగొనడానికి వ్యక్తులను అనుమతించండి” అనే సెట్టింగ్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా సెట్ చేయలేదు.

ఈ సెట్టింగ్ ఆన్‌లో లేకపోతే, మీరు ఇప్పటికే Google Payలో ఎవరైనా వ్యక్తితో కనెక్ట్ అయ్యి ఉంటే తప్ప, ఆ వ్యక్తిని సెర్చ్ చేయడం సాధ్యపడదు.

“మిమ్మల్ని కనుగొనడానికి వ్యక్తులను అనుమతించండి” సెట్టింగ్‌ను ఆన్ చేయడానికి, గ్రహీత తప్పనిసరిగా ఈ దశలను ఫాలో అవ్వాలి:

  1. Google Pay యాప్ ను తెరవండి.
  2. పేమెంట్ స్క్రీన్ ‌లో, ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను లేదా ఖాతా ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత Google Payలో ఇతరులు మిమ్మల్ని ఎలా కనుగొనగలరు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. వ్యక్తులు మిమ్మల్ని కనుగొనడానికి, అనుమతించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇలా ఉంటే మీరు ఎవరినైనా సెర్చ్ చేయవచ్చు:

  • ఎవరైనా మీ పరికరంలోని కాంటాక్ట్‌లలో ఉంటే, మీరు వారి పేరుతో సెర్చ్ చేయవచ్చు.
  • ఎవరైనా వ్యక్తి మీ పరికరంలోని కాంటాక్ట్‌లలో లేకపోతే, వారి ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ ద్వారా మీరు వారిని సెర్చ్ చేయవచ్చు.

మీరు ఈ మధ్య జరిపిన పీర్-టు-పీర్ లావాదేవీలతో సమస్యలున్నాయా?

కింద వున్న బటన్‌ను క్లిక్ చేయండి

మీరు ఈ మధ్య జరిపిన లావాదేవీలకు సంబంధించి సహాయం పొందండి

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14264781533731658312
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false