మీ బ్యాంక్ ఖాతాను జోడించేటపుడు ఎదురయ్యే సాధారణ సమస్యలను పరిష్కరించండి

మీరు Google Payకు మీ బ్యాంక్ ఖాతాను జోడించడానికి SMS పంపినప్పుడు, మీకు ఏదైనా సమస్య ఎదురైతే, మీ ఫోన్ సెట్టింగ్‌లను, SMS సెట్టింగ్‌లను చెక్ చేయండి.

SMSను ఆన్ చేయండి

ఒక టెస్ట్ SMSను పంపండి. అది విఫలమైతే, మీకు యాక్టివ్ అవుట్‌గోయింగ్ SMS ప్యాక్ ఉందో లేదో చెక్ చేయడానికి మీ ఆపరేటర్‌ను సంప్రదించండి.

చిట్కా: కొన్ని SMS రీఛార్జ్ ప్యాక్‌లలో అవుట్‌గోయింగ్ SMS సదుపాయం ఉండదు. మీరు ప్రీపెయిడ్ మొబైల్ సర్వీస్‌ను ఉపయోగిస్తుంటే, మీ ప్లాన్ వివరాలను చెక్ చేయండి.

తగినంత బ్యాలెన్స్ లేదు

మీరు ప్రీపెయిడ్ మొబైల్ సర్వీస్‌ను ఉపయోగిస్తుంటే:

  • మెసేజ్‌ను పంపడానికి: మీ వద్ద తగినంత SMS బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
  • మీ బ్యాలెన్స్‌ను చెక్ చేయడానికి: మీ ఆపరేటర్ అందించిన దశలను ఫాలో అవ్వండి.
  • వివిధ ఆపరేటర్‌ల ద్వారా మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయడానికి, ఈ కింద అందించబడిన నంబర్‌లను డయల్ చేయండి:
    • Jio: 333#
    • BSNL: *123*1#
    • Airtel: *121*7#
    • MTNL: *123#
    • Tata: *111#
    • VI: *199*1*8#
నెట్‌వర్క్‌ను చెక్ చేయండి

మెసేజ్‌లను పంపడానికి లేదా అందుకోవడానికి:

  • మీ ఫోన్‌కు మంచి నెట్‌వర్క్ కవరేజీ ఉండాలి.
  • మీకు నెట్‌వర్క్ కనెక్షన్ ఉందో లేదో చెక్ చేయండి.
డ్యూయల్ SIM కార్డ్‌లు

మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉన్న నంబర్, మీరు SMSను పంపేందుకు ఉపయోగించే నంబర్, రెండూ ఒకటేనని నిర్ధారించుకోండి.

మీకు డ్యూయల్ SIM ఫోన్ ఉంటే:

  • మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన నంబర్‌తో SMSను పంపేలా చూసుకోండి.
  • మీ SMS సెట్టింగ్‌లు “ప్రతిసారి అడగాలి” అని సెట్ చేసి ఉన్నట్లయితే, మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉన్న SIMనే ప్రధాన SIMగా సెట్ చేయండి.
    1. "నెట్‌వర్క్, సెట్టింగ్‌ల"కు వెళ్లండి.
    2. SIMలు ఆ తర్వాత SMSను ఎంచుకోండి.
    3. మీ SMS సెట్టింగ్‌లను మార్చండి.
మీ SMS సర్వీస్ కేంద్రం (SMSC)ని రీలోడ్ చేయండి

మీ SMSC నంబర్ సరైనదేనని నిర్ధారించుకోవడానికి, దాన్ని రీలోడ్ చేయండి.

  1. మీ ఫోన్‌లో, *#*#4636#*#*కు డయల్ చేయండి.
  2. 'ఫోన్ సమాచారం' అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. “SMSC” కింద, రిఫ్రెష్ చేయండిని ట్యాప్ చేయండి.
మెసేజింగ్ యాప్ కాష్‌ను క్లియర్ చేయండి
  1. మీ మొబైల్ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్ Settingsను తెరవండి.
  2. యాప్‌లు & నోటిఫికేషన్‌లను ట్యాప్ చేయండి.
  3. మీ మెసేజింగ్ యాప్‌ను ఎంచుకోండి.
  4. స్టోరేజ్ ఆ తర్వాత కాష్‌ను క్లియర్ చేయండిని ట్యాప్ చేయండి.
సమస్య ఇంకా పరిష్కారం కాలేదు

Android పరికరం

రోజులోని వేర్వేరు సమయాల్లో SMS పంపండి. మీరు రోజుకు 4 సార్లు పంపడానికి ట్రై చేయవచ్చు.

చిట్కా: మొదటిసారి పంపడానికి ట్రై చేసిన తర్వాత మీకు SMS సమస్యలు ఎదురైనట్లయితే, మీ SIM కార్డ్ విషయంలో సమస్యలు ఏవైనా ఉన్నాయేమో చెక్ చేయండి. మీ ఆపరేటర్‌ను సంప్రదించండి.

iPhone, iPad

రోజులోని వేర్వేరు సమయాల్లో SMS పంపండి. మీరు 24 గంటల్లో 3 సార్లు పంపడానికి ట్రై చేయవచ్చు. 24 గంటల్లో మీరు 3 కంటే ఎక్కువ సార్లు పంపడానికి ట్రై చేస్తే:

  • తర్వాతి 24 గంటల పాటు మీ ఖాతాను బ్లాక్ చేయడం జరుగుతుంది.
  • మీరు Google Payని ఉపయోగించలేరు.

చిట్కా: మొదటిసారి పంపడానికి ట్రై చేసిన తర్వాత మీకు SMS సమస్యలు ఎదురైనట్లయితే, మీ SIM కార్డ్ విషయంలో సమస్యలు ఏవైనా ఉన్నాయేమో చెక్ చేయండి. మీ ఆపరేటర్‌ను సంప్రదించండి.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12121883201106110890
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false