స్క్రీన్ షేరింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్త వహించండి

Google Payని ఉపయోగించడం కొనసాగించడానికి, అన్ని స్క్రీన్ షేరింగ్ యాప్‌లను మూసివేయండి.

స్క్రీన్ షేరింగ్ యాప్‌లు అంటే ఏమిటి

స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ముఖ్యంగా ఫోన్‌లో సమస్యలను రిమోట్‌గా పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. అవి మీ ఫోన్‌కు పూర్తి యాక్సెస్‌ను, కంట్రోల్‌ను అనుమతిస్తాయి. స్క్రీన్ షేరింగ్ యాప్‌ల ఉదాహరణలు: Screen Share, AnyDesk, TeamViewer.

మీరు Google Payతో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎందుకు ఉపయోగించకూడదు

ఈ కింది వాటిని చేయడానికి మోసగాళ్ళు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించవచ్చు:

  • మీ తరపున లావాదేవీని జరపడానికి మీ ఫోన్‌ను కంట్రోల్ చేయడం.
  • మీ ATM లేదా డెబిట్ కార్డ్ వివరాలను చూడటం.
  • మీ ఫోన్‌కు వచ్చే OTPని చూసి, దానిని మీ ఖాతా నుండి డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించడం.

మోసం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి

ఏ కారణంగా అయినా థర్డ్-పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయమని Google Pay మిమ్మల్ని ఎప్పుడూ అడగదు. మీరు ఈ యాప్‌లను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసి ఉంటే, Google Payని ఉపయోగించే ముందు, అవి మూసివేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. 

ఎవరైనా Google Pay ప్రతినిధిగా మిమల్ని నమ్మించి, ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని మీకు సూచించి ఉంటే, వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసి, తొలగించండి. మీరు ఈ సమస్యను Google Payకు రిపోర్ట్ కూడా చేయవచ్చు.

మోసం లేదా అనధికారిక యాక్టివిటీ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17010948773691898276
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false