అదనపు UPI IDలతో స్మార్ట్ రూటింగ్ గురించి తెలుసుకోండి

UPI గురించి తెలుసుకోండి

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది మీరు మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు పార్టీల మధ్య నిధులను బదిలీ చేసినప్పుడు సహాయపడే తక్షణ పేమెంట్ సిస్టమ్. Google Payకి బ్యాంక్ ఖాతాను జోడించడానికి, మీ బ్యాంక్ UPIతో పని చేయాలి.

మీకు UPI ID ఎందుకు అవసరం

UPI యూజర్‌గా, మీరు మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన UPI ID అనే ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌ను క్రియేట్ చేయాలి. ఇది మీ బ్యాంక్ ఖాతాలో తక్షణమే డబ్బు పంపడాన్ని, అందుకోవడాన్ని సులభతరం చేస్తుంది. మీరు మీ ఖాతా నంబర్ లేదా ఇతర వివరాలను షేర్ చేయాల్సిన అవసరం లేదు.

Google Payతో, ఈ కింద పేర్కొన్నటువంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్‌ల ద్వారా మీ UPI ID జెనరేట్ చేయబడుతుంది:

  • SBI
  • HDFC
  • Axis
  • ICICI

స్మార్ట్ రూటింగ్ అనేది అదనపు UPI IDలతో ఎలా పని చేస్తుంది

UPI పేమెంట్ సర్వర్‌లతో సమస్యల కారణంగా లావాదేవీలు పూర్తి అవ్వడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా విఫలం అవ్వవచ్చు. అదనపు UPI ID అనేది మీ పేమెంట్ విజయవంతం అయ్యే రేటును మెరుగుపరుస్తుంది ఎందుకంటే ఇది మీ లావాదేవీని సర్వర్ ద్వారా చేస్తుంది, ఇది విజయవంతమైన పేమెంట్‌ను నిర్ధారిస్తుంది.  

ఉదాహరణకు, మీరు మీ ఇంటి నుండి మీ కారులో ఆఫీసుకు వెళ్లడానికి, 4 వేర్వేరు మార్గాల్లో వెళ్లవచ్చని అనుకుందాం. ఎక్కువ ట్రాఫిక్ రద్దీ ఉండటం వల్ల మీరు సాధారణంగా వెళ్లే మార్గం బ్లాక్ చేయబడింది, కాబట్టి మీరు అందుబాటులో ఉన్న ఇతర 3 మార్గాలలో దేనినైనా ఎంచుకుంటారు.

వివిధ బ్యాంక్‌లతో ఉన్న అదనపు UPI IDలు లావాదేవీలు చేయడానికి వివిధ మార్గాలను అందిస్తాయి. ఏదైనా UPI ID పద్ధతి అందుబాటులో లేకపోతే, మీరు సులభమైన పేమెంట్ అనుభవాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించడానికి Google Pay మీ పేమెంట్ చేయడానికి వేరొక పద్ధతిని ఎంచుకుంటుంది.

మీరు ఎన్ని UPI IDలను కలిగి ఉండవచ్చు

మీరు మీ బ్యాంక్ ఖాతా కోసం 4 UPI IDల వరకు జోడించవచ్చు. ఒకే బ్యాంక్ ఖాతాకు సంబంధించి పలు UPI IDలను మీరు కలిగి ఉండవచ్చు. ఇది పేమెంట్ ఆలస్యాలను లేదా వైఫ్యల్యాన్ని తగ్గిస్తుంది, అలాగే Google Pay ద్వారా సురక్షితంగా ఉంచబడుతుంది.

అదనపు UPI IDలను ఎలా క్రియేట్ చేయాలి

అదనపు UPI IDని క్రియేట్ చేయడానికి మార్గాలు ఉన్నాయి:

  • మీరు Google Payతో కొత్త ఖాతాను సెటప్ చేసినప్పుడు, మీరు ఒకటి కంటే ఎక్కువ UPI IDలను క్రియేట్ చేయవచ్చు.
  • మీరు చేసిన పేమెంట్‌లో సమస్యలు ఉన్నా లేదా అది విఫలమైనా, మీ ప్రస్తుత బ్యాంక్ ఖాతాకు కొత్త UPI IDలను జోడించమని మీకు ప్రాంప్ట్ కనిపించవచ్చు.
  • కొత్త UPI IDని క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
చిట్కా: UPI IDలను యాక్టివేట్ చేయడానికి, Google Pay మీ తరపున పార్ట్‌నర్ బ్యాంకులకు SMS పంపుతుంది. స్టాండర్డ్ SMS ఛార్జీలు వర్తిస్తాయి.

మీరు Google Payకు లాగిన్ చేసిన తర్వాత బ్యాంక్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయండి

మీరు Google Pay నుండి లాగ్ అవుట్ చేస్తే, మీ బ్యాంక్ ఖాతాలు ఇన్‌యాక్టివ్ అవుతాయి. మీరు తిరిగి లాగిన్ చేసిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయమని మీకు నోటిఫై చేయబడుతుంది.

మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసిన ఏవైనా అదనపు UPI IDలు కూడా మళ్లీ యాక్టివేట్ చేయబడతాయి.

మీ వద్ద ఇంతకు ముందు అదనపు UPI IDలు ఏవీ లేకుంటే, మెరుగైన పేమెంట్ విజయవంత రేటు కోసం మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జోడించే అవకాశం ఉంది. ఇది ఆప్షనల్, అలాగే మీరు మీ ఒరిజినల్ UPI IDతో Google Payను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

పేమెంట్‌లు చేసే విధానాలలో మార్పులు

మార్పులు ఏవీ లేవు. మీరు ఇప్పటికీ మీ బ్యాంక్ ఖాతా నుండి ఎప్పటిలాగానే లావాదేవీ జరపవచ్చు. మీరు అదనపు UPI IDలను కలిగి ఉండి, పేమెంట్ పద్ధతులేవీ అందుబాటులో లేనట్లయితే, మీ లావాదేవీని ప్రత్యామ్నాయ UPI ID ద్వారా చేయవచ్చు.

సాధారణ ప్రశ్నలు

UPI IDకి, బ్యాంక్ ఖాతాకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

UPI ID అనేది మీ బ్యాంక్ ఖాతా తాలూకు ఐడెంటిఫయర్. దీని ద్వారా మీరు నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు పంపవచ్చు, అలాగే అందుకోవచ్చు.

నాకు SBIలో బ్యాంక్ ఖాతా ఉంటే, నా UPI ID @okhdfcbankతో ఎందుకు ముగుస్తుంది?

ఈ సందర్భంలో, HDFC అనేది పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్. ఇది డబ్బు పంపడానికి, అందుకోవడానికి UPI ఎకో సిస్టమ్‌కు ప్లగ్ చేయడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు SBIలో బ్యాంక్ ఖాతా ఉంటే, మీ UPI ID @oksbi, @okhdfcbank, @okaxis లేదా @okiciciతో ముగియవచ్చు. మీరు మీ SBI బ్యాంక్ ఖాతా ద్వారా డబ్బు పంపడాన్ని, అందుకోవడాన్ని కొనసాగించవచ్చు.

నేను ఒకటి కంటే ఎక్కువ UPI IDలను క్రియేట్ చేస్తే, నా డబ్బు ఏ ఖాతాలో జమ చేయబడుతుంది?

మీ లావాదేవీలు ఆ సమయంలో UPI పేమెంట్‌లకు అందుబాటులో ఉండే UPI ID ద్వారా జరగుతాయి. ఈ సమస్యల వల్ల పేమెంట్ విఫలమైతే, మీరు క్రియేట్ చేసిన ఏవైనా అదనపు UPI IDల ద్వారా మేము ఆటోమేటిక్‌గా దాన్ని ప్రాసెస్ చేస్తాము.

నేను UPI IDని క్రియేట్ చేసినప్పుడు నాకు ఛార్జీ విధించబడుతుందా?

మీరు కొత్త UPI IDని రిజిస్టర్ చేస్తే, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్‌కు మీరు SMS పంపాల్సి ఉంటుంది.

  • Android పరికరాల విషయంలో, ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది.
  • iOS పరికరాల కోసం, పంపండిని ట్యాప్ చేయండి.

మీరు రిజిస్టర్ చేసే ప్రతి UPI IDకి, మీకు స్టాండర్డ్ SMS రేట్‌ల ఛార్జీ విధించబడుతుంది.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17298879654720597325
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false