Gmail భద్రతా చిట్కాలు

మీ Gmail ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయానికి దిగువ దశలనుఫాలో చేయండి. 

మీ ఖాతాకు వేరొకరు అనధికారిక యాక్సెస్‌ను కలిగి ఉన్నారని మీరు భావిస్తే, వెంటనే మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి.

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

దశ 1: సెక్యూరిటీ చెకప్‌ను పూర్తి చేయండి

ఖాతాకు అదనపు భద్రత కోసం, మీ ఖాతా అనుమతులను తనిఖీ చేయడం కోసం ఖాతా రికవరీ ఆప్షన్‌లను జోడించడం, 2-దశల వెరిఫికేషన్‌ను సెట్ చేయడం వంటి వాటిని చేయడానికి సెక్యూరిటీ చెకప్ పేజీని సందర్శించడం ద్వారా ప్రారంభించండి.

నా సెక్యూరిటీ చెకప్‌ని ప్రారంభించు

దశ 2: మీరు Gmail సెక్యూరిటీ చిట్కాలను ఫాలో అవ్వండి

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి

ముందుగా, శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను రూపొందించడం ఎలాగో తెలుసుకోండి.

ఆపై, మీ పాస్‌వర్డ్‌ను మార్చండి.

  1. ఖాతా భద్రతా పేజీని సందర్శించండి.
  2. పాస్‌వర్డ్‌ను క్లిక్ చేయండి.
  3. స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
మీ Gmail సెట్టింగ్‌లను చెక్ చేయండి

మీ ఇమెయిల్‌లను వేరెవరూ యాక్సెస్ చేయలేదని నిర్ధారించుకోవడానికి మీరు చెక్ చేయగల కొన్ని సెట్టింగ్‌లు ఉన్నాయి.

  1. బ్రౌజర్‌ను ఉపయోగించి, Gmailని తెరవండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. మీ సెట్టింగ్‌లను చెక్ చేయడానికి దిగువ ఉన్న ట్యాబ్‌లను క్లిక్ చేయండి.

సాధారణ ట్యాబ్

  • టెక్స్ట్ సరిగ్గా కనిపిస్తోందని నిర్ధారించుకోవడానికి మీ సంతకాన్ని చెక్ చేయండి.
  • టెక్స్ట్ సరిగ్గా కనిపిస్తోందని నిర్ధారించుకోవడానికి మీ సెలవు ప్రత్యుత్తరాన్ని చెక్ చేయండి, అలాగే అది మీకు అవసరం లేకుంటే అది ఆన్ చేయబడదు.

ఖాతాలు, దిగుమతి ట్యాబ్

  • మీకు సంబంధించిన అన్ని ఇమెయిల్ చిరునామాలు జాబితా చేయబడ్డాయని నిర్ధారించుకోవడానికి "మెయిల్‌ను ఇలా పంపు" చెక్ చేయండి.
  • తెలియని వ్యక్తులు ఎవరికీ మీ ఖాతా యాక్సెస్ లేదని చూసేందుకు "మీ ఖాతాకు యాక్సెస్‌ను మంజూరు చేయి" తనిఖీ చేయండి.
  • జాబితా చేయబడిన అన్ని ఇమెయిల్ అడ్రస్‌లు మీకు సంబంధించినవే అని నిర్ధారించుకునేందుకు "ఇతర ఖాతాల నుంచి మెయిల్‌ను చెక్ చేయి (POP3 ఉపయోగించి)" చెక్ చేయండి.

ఫిల్టర్‍లు, బ్లాక్ చేసిన అడ్రస్‌ల ట్యాబ్

  • మెయిల్ ఆటోమేటిక్‌గా "వీరికి ఫార్వర్డ్ చేయి" ఫిల్టర్‌ను ఉపయోగించి తెలియని ఖాతాకు ఫార్వర్డ్ చేయలేదని నిర్ధారించుకునేందుకు చెక్ చేయండి.
  • మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా తొలగించే ("వీటిని తొలగించు") ఏవైనా ఫిల్టర్‌లను మీరు సెటప్ చేసారని చెక్ చేయండి.

ఫార్వర్డింగ్, POP/IMAP ట్యాబ్

  • మీ మెసేజ్‌లు తెలియని ఖాతాకు ఫార్వర్డ్ కావడం లేదని చెక్ చేయండి.
  • మీ POP లేదా IMAP సెట్టింగ్‌లు సరిగ్గా ఉన్నాయని వెరిఫై చేసుకోండి.
అప్‌డేట్ కోసం చెక్ చేసి, మీ కంప్యూటర్‌లో ప్రస్తుత బ్రౌజర్ వెర్షన్‌ను చూడండి.
  1. మీ కంప్యూటర్‌లో, Chrome Chrome తెరవండి.
  2. ఎగువ కుడివైపున, మరిన్ని నిర్వహించండి క్లిక్ చేయండి.
  3. సహాయం and then Google Chrome పరిచయం క్లిక్ చేయండి.

ప్రస్తుత వెర్షన్ సంఖ్యను "Google Chrome" శీర్షిక దిగువున కనిపించే సంఖ్యల శ్రేణి ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఈ పేజీకి వచ్చినప్పుడు, అప్‌డేట్‌ల కోసం Chrome చెక్ చేస్తుంది.

అందుబాటులో ఉండే ఏదైనా అప్‌డేట్‌ను వర్తింపజేయడానికి రీ-లాంచ్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

స్కామ్‌లు, స్పామ్, ఫిషింగ్‌ను రిపోర్ట్ చేయండి

మీకు మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అడిగే అనుమానాస్పద ఇమెయిల్ వస్తే, మెసేజ్‌కు రిప్లయి ఇవ్వవద్దు లేదా అందులోని లింక్‌లు వేటినీ క్లిక్ చేయవద్దు.

అవాంఛిత ఇమెయిల్‌లను బ్లాక్ చేయడం లేదా స్కామ్‌లను నివారించడం, రిపోర్ట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1933243476331050715
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false