Gmailలోని ఇమెయిల్‌లకు నక్షత్రం ఉంచండి

మీరు Gmailలోని ఈమెయిల్స్‌కు స్టార్ గుర్తు ఉంచినప్పుడు, మీరు వాటిని ముఖ్యమైనవిగా మార్క్ చేస్తారు. మీరు వాటిని తర్వాత చూసేలా గుర్తుంచుకోవడంలో ఇది మీకు సహకరిస్తుంది.

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

ఈమెయిల్ పైన స్టార్ గుర్తు ఉంచండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
  2. మీ ఇన్‌బాక్స్ నుండి, సందేశం ఎడమవైపుకి వెళ్లి, తర్వాత నక్షత్రం ఉంచు క్లిక్ చేయండి. సందేశం తెరవబడి ఉన్నట్లయితే, మరిన్ని ఆ తర్వాత నక్షత్రాన్ని జోడించు క్లిక్ చేయండి.
  3. మీరు అనేక స్టార్స్‌ను కలిగి ఉన్నట్లయితే, మీరు ఉపయోగించాలనుకుంటున్న దానిని చూసేంత వరకు స్టార్ చిహ్నాన్ని క్లిక్ చేయడం కొనసాగించండి.

మరిన్ని స్టార్ ఆప్షన్‌లను జోడించండి

మీరు వివిధ రంగులతో కూడిన నక్షత్రాలు లేదా ఇతర చిహ్నాలను జోడించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. దిగువ ఉన్న "నక్షత్రాలు" విభాగానికి స్క్రోల్ చేయండి.
  4. "ఉపయోగంలో లేనివి", "ఉపయోగంలో ఉన్నవి" అనే వాటి మధ్య స్టార్‌లను జరపండి.
  5. ఆప్షనల్: ప్రీసెట్‌ను ఎంచుకోవడానికి, క్లిక్ చేయండి:
    • 1 స్టార్
    • 4 స్టార్‌లు
    • అన్ని స్టార్‌లు
  6. పేజీకి దిగువున ఉన్న, మార్పులను సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు స్టార్ ఉంచిన ఈమెయిల్స్ కోసం సెర్చ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
  2. పేజీకి ఎడమవైపున,  నక్షత్రం ఉంచబడినవి క్లిక్ చేయండి. ముందుగా మీరు మరిన్ని అనే ఆప్షన్‌ను క్లిక్ చేయవలసి ఉంటుంది.

చిట్కా: స్టార్ ఉన్న మెసేజ్‌లను కనుగొనడానికి, మీరు Gmailలో సెర్చ్ ఆపరేటర్‌లను కూడా ఉపయోగించవచ్చు.

  • స్టార్ ఉంచిన మెసేజ్‌లన్నింటినీ కనుగొనడానికి, is:starred‌ను ఎంటర్ చేయండి.
  • ఏదైనా ప్రత్యేక స్టార్ గుర్తుతో ఉన్న మెసేజ్‌లను కనుగొనడానికి, has: అని ఎంటర్ చేసి, దాని పక్కన స్టార్ పేరును ఉంచాలి. ఈ పేర్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్న మీ స్టార్ ఆప్షన్‌ల ఆధారంగా ఉంటాయి:
    • has:yellow-star
    • has:orange-star
    • has:red-star
    • has:purple-star
    • has:blue-star
    • has:green-star
    • has:red-bang
    • has:orange-guillemet
    • has:yellow-bang
    • has:green-check
    • has:blue-info
    • has:purple-question
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3212178578096103949
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false