నోటిఫికేషన్

మేము Google Chatలోని రూమ్‌ల అనుభవాన్ని Spacesగా అభివృద్ధి చేస్తున్నాము. మరింత తెలుసుకోండి.

Gmailలో Google Chat‌ను ఉపయోగించండి

మీ కమ్యూనికేషన్‌ను మేనేజ్ చేయడానికి, కనెక్ట్ అయ్యి ఉండటానికి, ఒకే చోట కలిసి పని చేయడానికి, మీ Gmail ఇన్‌బాక్స్‌కు Google Chatను జోడించండి. మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తే, ఈ ఆప్షన్ అందుబాటులో ఉండాలో లేదో మీ సంస్థ నిర్ణయిస్తుంది.
ముఖ్య గమనిక: Chat యాప్‌ను బ్లాక్ చేసినప్పటికీ, మీ చిన్నారి, Gmail యాప్‌లో లేదా Gmail వెబ్ వెర్షన్‌లో Chatను ఉపయోగించవచ్చు. మీ చిన్నారికి చెందిన Google ఖాతాను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

Gmailలో Chatను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, సెట్టింగ్‌లు  ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువున, Chat, Meet ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. “Chat” పక్కన, Gmailలో Chatను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, Google Chat లేదా ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మార్పులను సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Gmailలో, Chat ప్యానెల్ స్థానాన్ని మార్చండి

మీరు Chat ప్యానెల్‌ను మీ Gmail ఇన్‌బాక్స్ యొక్క కుడి లేదా ఎడమ వైపునకు తరలించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువున, Chat, Meet ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. “Chat పొజిషన్” పక్కన, ఇన్‌బాక్స్‌కు ఎడమ వైపున లేదా ఇన్‌బాక్స్‌కు కుడి వైపున ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మార్పులను సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Gmailలో Chat అనేది Chatతో పోల్చినప్పుడు ఎలా భిన్నంగా ఉంటుంది?

మీరు Gmailలో Chat, అలాగే Chatలో ఒకే రకమైన ఫీచర్‌లను పొందుతారు, అయితే ఇంటిగ్రేటెడ్ Gmail అనుభవం అనేది ఈమెయిల్స్ మధ్యలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడానికి ప్రధాన స్థానంగా ఉంటుంది.

  • Chat: మీరు ప్రత్యేకమైన చాట్ అనుభవాన్ని ఇష్టపడినప్పుడు, అలాగే విభిన్న యాప్‌ల మధ్య మారడానికి అభ్యంతరం లేకపోతే Chatను ఉపయోగించండి.
  • Gmail: మీరు మల్టీ టాస్క్‌లు చేయాలనుకున్నప్పుడు, అలాగే మీ అన్ని కమ్యూనికేషన్‌లను ప్రధానంగా ఒకే చోట చూడటానికి ఉపయోగించండి. కొత్త ఇంటిగ్రేటెడ్ Gmail లేఅవుట్ గురించి మరింత తెలుసుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9494031586586112515
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false